అనుదిన మన్నా
ఆయనకు సమస్తము చెప్పుడి
Friday, 16th of February 2024
0
0
793
Categories :
ప్రార్థన (Prayer)
వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్లి, యాకోబుతోను, యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. సీమోను అత్త (భార్య తల్లి) జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. (మార్కు 1:30)
గమనించండి, "వారు పేతురు అత్తగారి గురించి యేసయ్యకు ఒకసారే చెప్పిరి" అని లేఖనాలు చెబుతున్నాయి.
అనేక కీర్తనలు వ్రాసిన ఒక దేవుని దాసుడు ఉన్నాడు. అతని కీర్తనలు అతనికి కలిగిన అనుభవాల నుండి ప్రేరణ పొందాయి. ఒకరోజు అత్యంత పేదరికంలో మగ్గుతున్న ప్రజలను పరామర్శించగా, అణచి వేయబడిన స్థితి నయం కానటువంటి స్త్రీని కలిశాడు. ఆమె తన బాధలను కురిపించింది. ఆమె మొఱ్ఱపెడుతూ, "నేను ఏమి చేయాలో చెప్పు? అయ్యో , నేను ఏమి చేయాలి?"
ఆమె అనుభవిస్తున్న బాధ మరియు దుఃఖాన్ని చూసి ఈ దేవుని దాసునికి మాటలు కరువయ్యాయి. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ అతనికి జ్ఞానం గల వచనాన్ని ఇచ్చాడు. అతడు, "యేసయ్యకు సమస్తము చెప్పు" అని జవాబిచ్చాడు.
ఒక్క క్షణం ఆ స్త్రీ ఆలోచనల్లో కూరుకుపోయినట్లు అనిపించింది. అప్పుడు ఒక్కసారిగా ఆమె ముఖం వెలిగిపోయింది. "అవునా!" అని ఆమె రోధించింది, "నేను యేసయ్యకు చెప్పాలి,అంతే కదా!" ఈ విధంగా అతని నుండి మరొక గొప్ప కీర్తన పుట్టింది - యేసయ్యకు చెప్పు.
ప్రార్థన అంటే యేసయ్యకు సమస్తము చెప్పడం తప్ప మరొకటి కాదు. ఐతే ఇక్కడ మీరు ఇష్టపడే మరియు నమ్మదగిన వ్యక్తులతో విషయాలను పంచుకోవడం తప్పేమి కాదు. అయినప్పటికీ, మీరు వారికి ప్రతిదీ చెప్పలేరు. అందుకే ఈ వాక్యం నీకు మరియు నాకు - యేసయ్యకు సమస్తము చెప్పుడి.
మీరు దీన్ని నమ్మరు, కానీ ఇది నిజం. నేను టీచర్‌గా ఉన్న రోజుల్లో ఇద్దరు చిన్న పిల్లలు గొడవపడడం చూశాను. వారిలో ఒక చాలా చిన్నవాడు; మరోపక్క ఇంకొకడు బాగా లావుగా మరియు బొద్దుగా ఉన్నాడు. బొద్దుగా ఉన్న అబ్బాయి ఈ చిన్న పిల్లవాడిని తోస్తున్నాడు. నిస్సహాయతతో, చిన్న పిల్లవాడు అరిచాడు, "మా అన్నయ్య 8వ తరగతి చదువుతున్నాడు, నేను అతనికి చెప్తాను" అంతే, అది విని ఆ అబ్బాయి పారిపోయాడు.
మార్కు 3:34-35లో, తనను నిజంగా వెంబడించే వారు తన సహోదరులు మరియు సహోదరియులు అని యేసయ్య ప్రకటించాడు: "తన చుట్టు కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను."
ఇది కేవలం మానసిక వ్యాయామం కాదు, "విశ్వసించడం అంటే తండ్రి చిత్తాన్ని చేయడం వల్ల మనం ఆయన సహోదరులు మరియు సహోదరియులుగా అర్హత పొందుతాము.
కాబట్టి, మీరు మన పెద్ద సహోదరుడైనా - ప్రభువైన యేసుక్రీస్తుతో సమస్తము చెప్పినప్పుడు మీ స్వస్థత, మీ విమోచన మరియు సమృద్ధి వంటంతా అవే వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఆయనకు ప్రతి విషయాన్ని చెప్పడం ఒక అంశముగా చేసుకోండి.

ఒప్పుకోలు
నేను ప్రతి పరిస్థితిలో పూర్తి విజయంతో నడుస్తాను, ఎందుకంటే యేసు ప్రభువు నా జీవితంలో వైఫల్యాన్ని తొలగించాడు. నేను జయించువాడిని మరియు క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను. యేసు నామంలో నేను విజయస్తుడను. ఆమెన్ (ఫిలిప్పీయులకు 4:13; 1 యోహాను 5:4)
Join our WhatsApp Channel
Most Read
● హెచ్చరికను గమనించండి● విత్తనం యొక్క శక్తి - 2
● యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
● మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
● ఒక కలలో దేవదూతలు అగుపడటం
● 01 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ధైర్యంగా కలలు కనండి
కమెంట్లు