english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం
అనుదిన మన్నా

జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం

Thursday, 1st of May 2025
0 0 85
Categories : తుఫానులు (Storms) ప్రయత్నాలు (Trials) విశ్వాసం (Faith)
జీవితపు తుఫానుల మధ్య, మన విశ్వాసం పరీక్షించబడటం సహజం. సవాళ్లు ఎదురైనప్పుడు, శిష్యులలాగే మనం కూడా, “బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింత లేదా?” అని మనల్ని మనం తరచుగా ప్రశ్నించుకుంటాము. (మార్కు 4:38). ఈ క్షణాల్లోనే మన విశ్వాసం దాని పరిమితికి నెట్టబడుతుంది. ఈ పోరాటంలో మనము ఒంటరిగా లేము; యేసయ్య శక్తిని ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఆయన సంరక్షణను అనుమానించేవారు ఉన్నారు.

1. మీ పోరాటంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి
బైబిలు అంతటా, కష్ట సమయాల్లో తమ పట్ల దేవుని చింతను ప్రశ్నించే అనేక సందర్భాలు ఉన్నాయి. తుఫానులో చిక్కుకున్న శిష్యుల విషయములో, వారు యేసయ్య ఆందోళనను అనుమానించారు, "బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింత లేదా?" (మార్కు 4:38). అదేవిధంగా, మార్తా తన బాధ్యతలతో నిండిపోయిందని భావించి, "ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా?” అని యేసయ్యను అడిగింది. (లూకా 10:40). అత్యంత విశ్వాస యోగ్యులు కూడా పరీక్షా సమయాల్లో సందేహంతో పోరాడగలరని ఈ ఉదాహరణలు మనకు గుర్తుచేస్తున్నాయి.

మన పట్ల దేవుని చింతను ప్రశ్నించే దశకు చేరుకోవడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. ఈ సమయాల్లో మనం మన ఆధ్యాత్మిక అభ్యాసాల నుండి వైదొలగవచ్చు. మన ప్రార్థనలు అంతకంతకూ తగ్గుతాయి మరియు మనం బైబిలు చదవడం లేదా సంఘ ఆరాధనకు హాజరుకావడం లేదా ప్రభువును సేవించడం కూడా మానివేయవచ్చు. మనం దేవుని ప్రేమను ప్రశ్నించడం మరియు "ప్రభువా, నీవు నిజంగా చింతింస్తే, ఇది మొదటి స్థానంలో ఎందుకు జరుగుతుంది?" అని అడగవచ్చు.

2. దేవుని వాగ్దానాల మీద ఆధారపడండి
మన విశ్వాసం క్షీణించినప్పుడు, లేఖనములో కనిపించే దేవుని వాగ్దానాల వైపు తిరగడం చాలా ముఖ్యం. మన పట్ల దేవుని చింత మరియు అక్కఱను మనకు గుర్తుచేసే వాక్యాలతో బైబిలు నిండి ఉంది. అలాంటి ఒక వచనం యెషయా 41:10, "నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును." దేవుని వాక్యంలో మునిగిపోవడం ద్వారా, అనిశ్చితి సమయాల్లో మనం బలాన్ని మరియు భరోసాను పొందవచ్చు.

3. దేవుని నమ్మకత్వం గురించి ఆలోచించండి
సందేహాస్పద క్షణాలలో, దేవుడు తన నమ్మకత్వాని ప్రదర్శించిన లెక్కలేనన్ని సార్లు ఆలోచించడం సహాయకరంగా ఉంటుంది. బైబిలు అంతటా, తన ప్రజల పట్ల దేవునికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఉదాహరణలను మనం చూస్తాము. ఇశ్రాయేలీయుల విషయములో, దేవుడు వారిని అరణ్యంలో నడిపించాడు మరియు వారి అవసరాలను తీర్చాడు (నిర్గమకాండము 16). క్రొత్త నిబంధనలో, ప్రభువైన యేసయ్య రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు మరియు నిస్సహాయులకు నిరీక్షణను ఇచ్చాడు (మత్తయి 9). ఈ విషయాలను గుర్తుంచుకోవడం వల్ల దేవుడు మన పట్ల మనకున్న చింత మీద మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవచ్చు.

4. ప్రార్థించండి మరియు తోటి విశ్వాసుల నుండి మద్దతు పొందండి
మన విశ్వాసం కదిలినప్పుడు దేవునితో తిరిగి చేరుకోవడానికి ప్రార్థన ఒక శక్తివంతమైన మార్గం. ఫిలిప్పీయులకు 4:6-7లో, అవసరమైన సమయాల్లో ప్రార్థనలో దేవుని వైపు తిరగమని పౌలు ప్రోత్సహిస్తున్నాడు, "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును." తోటి విశ్వాసుల నుండి మద్దతు కోరడం కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు మన జీవితాల్లో దేవుని సన్నిధిని మనకు గుర్తు చేస్తుంది. మీరు కరుణా సదన్ సంఘముతో కలసి ఉంటే, J-12 సహకారి అధీనములో మీరు దీన్ని చేయగల మార్గాలలో ఒకటి.

Bible Reading: 1 Kings 19-20
ప్రార్థన
తండ్రీ, సందేహం మరియు కష్ట సమయాల్లో, నా విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడి లేదని, నీ అపారమైన ప్రేమ మరియు చింత మీద ఆధారపడి ఉందని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయి. నీ వాక్య జ్ఞానాన్ని పెంచుకోవడానికి నాకు సహాయము చేయుము. యేసు నామములో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● మీ భవిష్యత్తు కొరకు దేవుని కృప మరియు ఉద్దేశ్యాన్ని హత్తుకోవడం
● ప్రభువుతో నడవడం
● మీరు ఎవరితో నడుస్తున్నారు?
● 21 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
● ఆయన నీతి వస్త్రమును ధరించుట
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్