అనుదిన మన్నా
మీ సౌలభ్యము నుండి బయటపడండి
Friday, 26th of January 2024
0
0
625
Categories :
సౌలభ్యము (Comfort Zone)
యెహోవా అబ్రాహాముతో,
"నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. 2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు." (ఆదికాండము 12:1-2)
ప్రతి ఒక్కరికీ ఒక సౌలభ్యము (సౌకర్యం) ఉంటుంది.
సౌలభ్యము అంటే ఏమిటి?
మీ సౌలభ్యము మీకు తెలిసిన వ్యక్తులు, స్థలాలు, వస్తువులు మరియు అలవాట్లతో రూపొందించబడింది.
దేవుడు అబ్రాహామును ఆశీర్వదించే ముందు, అతని సౌలభ్యము నుండి బయటపడమని దేవుడు చెప్పాడు. వాస్తవం ఏమిటంటే, మనం మన సౌకర్యం నుండి బయటకు వెళ్లనంత వరకు, దేవుడు కోరుకున్న విధంగా మనలను ఆశీర్వదించలేడు.
ఆయన (యేసయ్య) బోధించుట చాలించిన తరువాత, "నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని" సీమోనుతో చెప్పెను. (లూకా 5:4)
దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు-ఇదే గొప్ప సమయం! ఈ కారణంగానే ఆయన సీమోనుతో ఇలా అన్నాడు, "నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి." లోతైన ప్రదేశంలో మీరు మొత్తం చేపలు మరియు మంచి నాణ్యత కలిగిన చేపలను కనుగొంటారు. లోతులేని నీటిలో ఒడ్డుకు సమీపంలో మీరు వాటిని కనుగొనలేరు. కానీ లోతుల్లోకి వెళ్లడం అంటే తీరప్రాంతం యొక్క సౌలభ్యం నుండి దూరంగా వెళ్లడం.
ఇప్పుడు, మీ ఆశీర్వాదం కంటే మీ సౌలభ్యం ముఖ్యమైతే, మీరు మీ ఆశీర్వాదాన్ని ఎప్పటికీ పొందలేరు, కానీ మీ సౌలభ్యము నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్న మీకు, "నేను ఒక నూతన కార్యము చేస్తాను" అని ప్రభువు చెబుతున్నాడు.
వారి ఆధ్యాత్మిక సౌలభ్యములో స్థిరపడిన కొందరు వ్యక్తులు ఉన్నారు.
యేసు వారికి చేపలు మరియు రొట్టెలతో (సౌకర్యకరమైన ఆహారం) తినిపించాడు మరియు వారు ఆయనను రాజుగా చేయబోతున్నారు.
ఆ క్షణం, ఆయన తన శరీరం మాంసం మరియు ఆయన రక్తాన్ని పానీయం (అసౌకర్యకరమైన ఆహారం) గురించి మాట్లాడాడు, వారు ఆ క్షణమే ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. నేడు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. దయచేసి వారిలా ఉండకండి.
మనం చాలా సౌకర్యంగా ఉన్నప్పుడు, మనం ముందుకు వెళ్లే అవకాశం చాలా తక్కువ. అప్పుడు మనం గమనంలా కాకుండా స్మారక చిహ్నంగా మారతాము.
అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలు వెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్లెను. (హెబ్రీయులకు 11:8)
చాలా మంది తమ గమ్యాన్ని చేరుకోలేదు ఎందుకంటే వారు తమ సౌలభ్యము నుండి బయటకు రావడానికి వెల చెల్లించడానికి నిరాకరించారు. భిన్నంగా ఉండటానికి ధైర్యం వహించండి. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు మీ సౌలభ్యము నుండి బయటపడండి.

- ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ఉంది, అది మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది.
- మనం సౌలభ్యంగా ఉండే జీవన విధానం ఉంది.
- ఆరాధన తర్వాత మనం కలిసే వ్యక్తుల సమూహము ఉంది, వీరితో మనము చాలా సౌకర్యంగా ఉంటాము.
సౌలభ్యము అంటే ఏమిటి?
మీ సౌలభ్యము మీకు తెలిసిన వ్యక్తులు, స్థలాలు, వస్తువులు మరియు అలవాట్లతో రూపొందించబడింది.
దేవుడు అబ్రాహామును ఆశీర్వదించే ముందు, అతని సౌలభ్యము నుండి బయటపడమని దేవుడు చెప్పాడు. వాస్తవం ఏమిటంటే, మనం మన సౌకర్యం నుండి బయటకు వెళ్లనంత వరకు, దేవుడు కోరుకున్న విధంగా మనలను ఆశీర్వదించలేడు.
ఆయన (యేసయ్య) బోధించుట చాలించిన తరువాత, "నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని" సీమోనుతో చెప్పెను. (లూకా 5:4)
దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు-ఇదే గొప్ప సమయం! ఈ కారణంగానే ఆయన సీమోనుతో ఇలా అన్నాడు, "నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి." లోతైన ప్రదేశంలో మీరు మొత్తం చేపలు మరియు మంచి నాణ్యత కలిగిన చేపలను కనుగొంటారు. లోతులేని నీటిలో ఒడ్డుకు సమీపంలో మీరు వాటిని కనుగొనలేరు. కానీ లోతుల్లోకి వెళ్లడం అంటే తీరప్రాంతం యొక్క సౌలభ్యం నుండి దూరంగా వెళ్లడం.
ఇప్పుడు, మీ ఆశీర్వాదం కంటే మీ సౌలభ్యం ముఖ్యమైతే, మీరు మీ ఆశీర్వాదాన్ని ఎప్పటికీ పొందలేరు, కానీ మీ సౌలభ్యము నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్న మీకు, "నేను ఒక నూతన కార్యము చేస్తాను" అని ప్రభువు చెబుతున్నాడు.
వారి ఆధ్యాత్మిక సౌలభ్యములో స్థిరపడిన కొందరు వ్యక్తులు ఉన్నారు.
- మనలో కొందరు సంవత్సరాలుగా 15నిమిషాల పాటే ప్రార్థిస్తున్నారు.
- మనలో కొందరు ఎప్పుడూ ఆత్మలను సంపాదించరు; మన సభలకు హాజరయ్యే అదే ప్రజలతో మనము సంతోషంగా ఉన్నాము.
- మనలో కొందరు రూ.50, రూ.100కి మించి ఎప్పుడూ ఇవ్వలేదు. (నేను మీ డబ్బును పొందాలనే ఉద్దేశ్యంతో ఇలా చెప్పడం లేదు. మీరు ఆ పద్దతి నుండి బయట పడటానికి చెబుతున్నాను)
- మనలో కొందరు ఎప్పుడూ ఉపవాసం చేయరు.
- మనలో కొందరు ఇప్పటికీ నెలల తరబడి మరియు బహుశా సంవత్సరాల తరబడి ఒకరిపై అదే కోపాన్ని, అపరాధ భావం కలిగి ఉన్నారు. చాలా మందికి ఈ మార్గం చాలా సౌకర్యంగా ఉంటుంది.
యేసు వారికి చేపలు మరియు రొట్టెలతో (సౌకర్యకరమైన ఆహారం) తినిపించాడు మరియు వారు ఆయనను రాజుగా చేయబోతున్నారు.
ఆ క్షణం, ఆయన తన శరీరం మాంసం మరియు ఆయన రక్తాన్ని పానీయం (అసౌకర్యకరమైన ఆహారం) గురించి మాట్లాడాడు, వారు ఆ క్షణమే ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. నేడు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. దయచేసి వారిలా ఉండకండి.
మనం చాలా సౌకర్యంగా ఉన్నప్పుడు, మనం ముందుకు వెళ్లే అవకాశం చాలా తక్కువ. అప్పుడు మనం గమనంలా కాకుండా స్మారక చిహ్నంగా మారతాము.
అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలు వెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్లెను. (హెబ్రీయులకు 11:8)
చాలా మంది తమ గమ్యాన్ని చేరుకోలేదు ఎందుకంటే వారు తమ సౌలభ్యము నుండి బయటకు రావడానికి వెల చెల్లించడానికి నిరాకరించారు. భిన్నంగా ఉండటానికి ధైర్యం వహించండి. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు మీ సౌలభ్యము నుండి బయటపడండి.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. ప్రతి ప్రార్థన అస్త్రాన్ని కనీసం 2 నిమిషాలు పునరావృతం చేయండి
1.తండ్రీ, నా జీవితంలో ప్రతిరోజూ నీ ప్రణాళికను అనుసరించే శక్తిని నాకు దయచేయి.
2. స్తబ్దత (అడ్డంకి) యొక్క ప్రతి శక్తి నాకు వ్యతిరేకంగా పని చేస్తుంది, నేను అగ్నిని ఆజ్ఞాపిస్తునాను. ని సమయం ముగిసింది. ఇప్పుడే నన్ను యేసు నామంలో వదిలి వెళ్లిపో.
3.యేసు నామంలో, నేను ఉన్నత స్థాయికి వెళ్తున్నాను.

Join our WhatsApp Channel
Most Read
● మంచి నడవడిక నేర్చుకోవడం● జీవితంలోని పెద్ద శిలలను గుర్తించడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం
● ప్రార్థనలో వచ్చే కలవరముపై ఎలా విజయం సాధించాలి
● ప్రతిఫలించడానికి సమయాన్ని వెచ్చించడం
● క్రీస్తులో రాజులు మరియు యాజకులు
● అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం
● యేసయ్య ఎందుకు గాడిద మీద ప్రయాణించాడు?
కమెంట్లు