తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు, "చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడు". (1 సమూయేలు 1 6:18)
ఈ సమయం వరకు, దావీదు తన తండ్రి గొర్రెలను చూసుకునే గొర్రెల కాపరి మాత్రమే, మరియు ఇప్పుడు రాజా భవనంలో అతని గురించి ఎవరో మాట్లాడుతున్నారు. మరుగున పడిన ప్రదేశం నుండి ఖ్యాతి చెందిన ప్రదేశానికి ఎదగబోతున్నాడు. అజ్ఞాతవాసి నుండి తెలిసిన వారి వద్దకు రాబోతున్నాడు. త్వరలో అతడు రాజు ముందు నిలబడతాడు మరియు చివరికి ఒక రోజు రాజు అవుతాడు.
రాజుల ముందు ఎవరినైనా నిలబెట్టగల దాచి ఉంచిన రహస్యాలు ఈ వచనములో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. దేవుడు పాక్షపాతి దేవుడు కాదు.
అపొస్తలుడైన పేతురు దృఢ నిశ్చయంతో ఇలా అన్నాడు, "దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను" (అపొస్తలుల కార్యములు 10:34). జాతి, జాతీయత, సామాజిక స్థితి లేదా మరే ఇతర బాహ్య కారణాల వల్ల దేవుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి పట్ల దయను చూపడు. దావీదు పట్ల చేసిన కార్యము మీ పట్ల మరియు నా పట్ల కూడా కార్యం చేస్తుంది.
#1. "నేను బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని"
దావీదు తన తండ్రికి కుమారుడు
ఆధ్యాత్మిక తండ్రులు మరియు ఆధ్యాత్మిక కుమారులు అనే పదాలు లేఖనాలలో ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు తిమోతి మరియు తీతులను తన "ఆధ్యాత్మిక" కుమారులుగా పేర్కొన్నాడు.
ప్రియ కుమారుడగు తిమోతికి. (2 తిమోతి 1:2)
మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు (తీతుకు 1:4)
తిమోతి యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతో కూడ సువార్త వాక్యము నిమిత్తము సేవ చేసెను.. (ఫిలిప్పీయులు 2:22)
దుఃఖకర విషయం ఏమిటంటే నేడు, దేవుని రాజ్యంలో, నేను ఏమి పొందగలను అనే దాని గురించే కలిగి ఉంది. నా స్వంత కారణాన్ని మరింత పెంచుకోవడానికి నేను మరొకరి నుండి ఏమి పొందుకోగలను అనే దాని గురించే ఉంది. దేవుని రాజ్యంలో విధేయత లేదా బంధం అనేది చాలా తక్కువ. ఆత్మ యొక్క నిజమైన ప్రవాహాన్ని మనం చూడకపోవడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి.
నిజమైన ఆధ్యాత్మిక తండ్రికి బహిర్గతం కావడం అనేది ఒక వ్యక్తి కలిగి ఉండగలిగే అత్యంత ఆప్యాయమాణము మరియు సాధికార సంబంధాలలో ఒకటి. ఇది నేను వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాను. ఒకరు సంఘంలో సందర్శకుడిగా లేదా సంఘంలో సభ్యుడిగా ఉండవచ్చు మరియు ఇవన్నీ మంచివి.
దయచేసి నన్ను తప్పుగా భావించవద్దు. ఏది ఏమైనప్పటికీ, ప్రేమ యొక్క బంధం నుండి ఒకరికొకరు లోబడి ఉండడం నేర్చుకున్నప్పుడు విడుదల చేయబడిన అభిషేకం యొక్క మరొక కోణం ఉంది. ఒకానొక దేవుని దాసుడు నాతో ఇలా అన్నట్లు నాకు గుర్తుంది, "నీకు కుమారుడిగా ఎలా ఉండాలో తెలియకపోతే, తండ్రిగా ఎలా ఉండాలో నీకు తెలియదు." నేడు దేవుని రాజ్యంలో చాలా కొద్ది మంది మాత్రమే ప్రభువుకు సంబంధించిన విషయాలలో వారికి మార్గదర్శకులుగా ఉన్నారు.
చివరికి, చాలా మంది తమ దృష్టిలో సరైనదని భావించే దాన్ని చేస్తారు. దేవుని రాజ్యంలో చాలా మంది సహోదరులు మరియు సహోదరీలు మరియు చాలా తక్కువ మంది తండ్రులు మరియు తల్లులు ఉండటంలో ఆశ్చర్యమైన విషయం ఉందా?
దావీదు తన తండ్రికి నమ్మకమైన కుమారుడు. తన తండ్రి గొర్రెలను తన గొర్రెల్లాగా చూసుకున్నాడు. అతడు తన సహోదరులచే తిరస్కరించబడ్డాడు, అయినప్పటికీ అతడు తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. మీరు మరియు నేను అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే తోబుట్టువుల మధ్య ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. దావీదు నిజమైన కుమారుడు. ఇది అతనిని రాజు యెదుట నిలబడుటకు మరియు చివరికి అతన్ని రాజుగా చేసిన లక్షణాలలో ఒకటి.

ప్రార్థన
నేడు, దానియేలు ఉపవాసం యొక్క 2వ రోజు
[మీరు ఇంకా దీన్ని ప్రారంభించకపోతే లేదా దాని మీద మరింత సమాచారం కావాలనుకుంటే, దయచేసి 26 & 27 ఆగస్టు లోని అనుదిన మన్నాను చూడండి]
లేఖ పఠనము
ఆమోసు 3:3
రోమీయులకు 15:5-6
ప్రార్థన అస్త్రములు
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. తొందరపడకండి. ప్రతి ప్రార్థన అస్త్రానికి కనీసం రెండు నిమిషాలు వెచ్చించండి.
తండ్రీ, నేను నా బంధాలన్నిటినీ యేసు నామంలో నీ సంరక్షణకై అప్పగిస్తున్నాను.
తండ్రీ, ఎల్లప్పుడూ సరైన పదాలను నా నోటిలో ఉంచు, తద్వారా నేను నా బంధాన్ని నాశనం చేయను గాక, యేసు నామంలో.
నా బంధాలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్టుల అవకతవకలు యేసు నామంలో అగ్నితో నరికి వేయబడును గాక.
నా బంధాలకు సంబంధించిన శత్రువు నుండి నేను కోల్పోయిన ఆధారమును యేసు నామంలో తిరిగి పొందుదును గాక.
నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చినందుకు ప్రభువుకు వందనాలు, యేసు నామంలో.
ప్రభువును ఆరాధిస్తూ కొంత సమయం గడపండి.
Join our WhatsApp Channel
Most Read
● మూడు పరిధులు (రాజ్యాలు)● కోతపు కాలం - 1
● ఉద్దేశపూర్వక వెదకుట
● ఆర్థిక గందరగోళం నుండి ఎలా బయటపడాలి # 2
● అందమైన దేవాలయము
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 2
కమెంట్లు