అనుదిన మన్నా
మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
Saturday, 18th of February 2023
0
0
738
Categories :
వాతావరణం (Atmosphere)
విడుదల (Deliverance)
"నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది." కీర్తనలు 119:105
దేవుని వాక్యము మన జీవితాలను మరియు గృహాలను నడిపించే మాదిరి. మన పిల్లలను దేవుని మార్గంలో మరియు ఉపదేశాలలో ఏమి చేయాలో మరియు ఎలా పెంచాలో మనకు దిశానిర్దేశం చేసే దిక్సూచి. దావీదు మన వచనంలో దేవుని వాక్యం తన పాదాలను వెళ్ళే మార్గంలో నడిపించే దీపమని చెప్పాడు. సోషల్ మీడియాలోని సమాచారంతో తన జీవితాన్ని లేదా ఇంటిని నడుపుతున్న వ్యక్తిని మరియు లేఖనాల సమాచారంతో తన ఇంటిని నడుపుతున్న వ్యక్తిని మీరు చెప్పవచ్చు. వ్యత్యాసం ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రభువైన యేసయ్య మత్తయి 7:24-27లో ఇలా బోధించాడు,
24"కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. 26మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. 27వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను."
వాక్యము పునాది, మరియు పునాది బలంగా ఉన్నప్పుడు, భవనం నిలుస్తుంది. కాబట్టి సిద్ధాంతం మరియు చేతబడి అనే గాలి ప్రజలను ఎగదోయడం ప్రారంభించినప్పుడు, వాక్యము ప్రకారం జీవించే వ్యక్తి స్థిరంగా ఉంటాడు.
కాబట్టి, మనం ఒక కుటుంబంగా వాక్యము యొక్క జీవనశైలిని అభివృద్ధి చేయాలి. మీరు మీ చేతిలో బైబిలు పట్టుకోవడం లేదా మీ ఇంట్లోని ప్రతి గదిలో బైబిలు ఉంచడం వల్ల దేవుని వాక్యం మీ జీవితంలో సక్రియం చేయబడదు మరియు పనిచేయదు. దేవుని వాక్యం ప్రేరేపించబడింది మరియు అది బోధించబడినప్పుడు, వాక్యము మాట్లాడుతున్నప్పుడు దైవ శక్తి విడుదల అవుతుంది.
కీర్తన 119:9-11లో దావీదు ఇలా అన్నాడు, "యవ్వవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." మీరు ఈ వచనము గమనించారా? మీ పిల్లలు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు వారికి వాక్యం బోధించాలి. కొంతమంది తమ పిల్లలకు వారి సంస్కృతి మరియు సంప్రదాయాన్ని నేర్పించటానికి ఇష్టపడతారు, అవును, ఇది మంచిది, కానీ మీ సంస్కృతి వారు సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే ఆచరిస్తారు. వాళ్ళు వేరే చోట దొరికితే ఎలా ఉంటుంది; ఆ సమయంలో, ఏమి చేయాలో వారికి దిశానిర్దేశం చేసేందుకు దేవుని వాక్యమే దిక్సూచి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక పుస్తకం బైబిలు.
కాబట్టి, మీ ఇంటి మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీ భూమి మరియు ఆస్తుల మీద వాక్యాన్ని మాట్లాడండి. మీరు మీ కుటుంబ సభ్యుల మీద దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు, మీరు వారిపై దైవ ఆఙ్ఞాను చెబుతున్నారు. మీరు భూసంబంధమైన సంఘటనలపై దైవ ప్రత్యక్షతను అధికం చేస్తున్నారు. మీరు మీ మార్గంలో ఉన్న పర్వతాని కదలమని చెప్తున్నారు, మరియు అది కదులుతుంది. మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించండి మరియు వారు ఎల్లప్పుడూ చెప్పనివ్వండి. వారు ఏమి అనుభూతి చెందుతున్నారో లేదా ఆర్థిక వ్యవస్థ ఏమి చెబుతుందో కాకుండా వాక్యం చెప్పేది చెప్పడం నేర్చుకోవాలి.
యోవేలు 3:10 ఇలా చెబుతోంది, "మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గ ములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను." వారు బలహీనంగా ఉన్నారా? వారు తమ జీవితాల మీద దేవుని బలాన్ని ప్రకటించును గాక.
దేవుని వాక్యానికి పవిత్రపరిచే శక్తి కూడా ఉంది. యోహాను 15:3లో యేసు ఇలా అన్నాడు, "నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీ రిప్పుడు పవిత్రులై యున్నారు." దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. మీ పిల్లలు కొన్ని మార్గాల్లో బానిసలుగా ఉన్నారా? వారు కొన్ని బలహీనతలతో పోరాడుతున్నారా? వాక్యాన్ని అధ్యయనం చేసే సమయాన్ని వారికి ఇవ్వండి.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీ వాక్యము యొక్క వెలుగుకై నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యమును పాటించేందుకు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమును, నీ మార్గాన్ని అనుసరించే కృపకై నేను ప్రార్థిస్తున్నాను. నేను నీ వాక్యంతో నా కుటుంబాన్ని పరిశుద్దపరుస్తున్నాను, మా జీవితాలు వాక్యం ద్వారా నడపబడుతున్నాయని నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● దేవుని వాక్యాన్ని మార్చవద్దు● మరణించిన వ్యక్తి జీవించడం కోసం ప్రార్థిస్తున్నాడు
● సమాధానము కొరకు దర్శనం
● మీ సన్నిహిత్యాని కోల్పోకండి
● మీరు ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?
● ఆరాధన యొక్క నాలుగు ముఖ్యమైన అంశాలు
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
కమెంట్లు