అనుదిన మన్నా
వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
Saturday, 4th of March 2023
1
1
476
Categories :
గర్వము (Pride)
నేటి సమాజంలో, విజయం మరియు ప్రతిష్ట యొక్క సందడి గురించే. మనం ఉత్తమంగా, ప్రకాశవంతంగా మరియు అత్యంత విజయవంతంగా ఉండాలని చెప్పే సందేశాలతో నిరంతరం ముట్టడితో ఉంటాము. సాధించాలనే ఒత్తిడి విపరీతంగా ఉంటుంది మరియు వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చులో చిక్కుకోవడం సులభం. అయితే, క్రైస్తవులుగా, మన దృష్టి మన మీద కాకుండా దేవుని మీదనే ఉండాలి.
మనము దేవునికే సమస్త మహిమను ఇవ్వాలని లేఖనము మనకు బోధిస్తుంది. 1 కొరింథీయులకు 10:31లో, "కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి" అని చెప్పుచున్నది. మనల్ని మనం మహిమపరచుకోవాలనుకున్నప్పుడు, మనల్ని మనం దేవుని కంటే ఎక్కువగా ఉంచుకుంటున్నాము. ఇది విగ్రహారాధన యొక్క ఒక రూపం, మరియు దానికై మనం సృజించబడలేదు.
అపొస్తలుల కార్యములు 12:21-23 నాతో పాటు ఈ వచనాన్ని తీయండి
21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసము చేయగా 22 జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరముకాదని కేకలు వేసిరి.
హేరోదు తన చుట్టూ ఉన్న ప్రజలచే స్తుతించబడటానికి మరియు శ్రేష్టంగా ఉండటాన్ని ఇష్టపడే వ్యక్తి. నిజానికి, తీరు మరియు సీదోను ప్రజలు ఆయనను దేవుడిగా స్తుతించేంత వరకు వెళ్లారు. అతడు వారిని ఆపి, “నేను రాజును. నేను దేవుడిని కాను. దేవుడు తన కృప ద్వారా నాకు అధికారము ఇచ్చాడు. నా స్వంత అధికారము నాకు లేదు.” కానీ హేరోదు తన విజయం మరియు ప్రభావం కోసం దేవునికి మహిమను ఇవ్వడానికి బదులుగా, ప్రజల ఆరాధనలో ఆనందించాడు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను - దేవునికి మహిమ చెల్లించకపోతే ప్రమాదం.
అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. (అపొస్తలుల కార్యములు 12:23)
ప్రభువు దూత హేరోదును మొత్తినప్పుడు, భౌతిక పరిధిలో దాని ప్రభావం అతడు పురుగులు పడి చనిపోయాడని లేఖనము చెబుతుంది.
పురాతన యూదా రాజు మహనీయుడైన హేరోదు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మరియు అతని జననేంద్రియాలలో మాగ్గోట్‌ల వల్ల ఏర్పడిన గ్యాంగ్రీన్ (మాంసమును కుళ్ళు చేసే పుండు) ముట్టడి కారణంగా 69 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ఇటీవలి వైద్య విశ్లేషణ వెల్లడించింది. అతని బాధ యొక్క ఖచ్చితమైన కాలక్రమం తెలియనప్పటికీ, నిపుణులు ఈ పరిస్థితి నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిందని అంచనా వేస్తున్నారు.
మన జీవితాల్లో దేవుని పాత్రను గుర్తించడానికి నిరాకరించినప్పుడు మరియు హేరోదు వలె మన కోసం మహిమను వెదకినప్పుడు, మనల్ని మనం ప్రమాదకరమైన స్థితిలో ఉంచుకుంటున్నామని ఇది కఠినమైన జ్ఞాపకము.
మాక్స్ ఒక ప్రతిభావంతుడైన సువార్త సంగీతకారుడు, అతడు ఎల్లప్పుడూ సంగీతం పట్ల మక్కువ కలిగి ఉన్నాడు మరియు అతని నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని అంకితం చేశాడు. అతడు ప్రసిద్ధ సువార్త సంగీత విద్వాంసుడు కావాలని కలలు కన్నాడు, అమ్ముడుపోయిన ప్రేక్షకుల యెదుట వాయించడం మరియు ప్రపంచవ్యాప్తంగా అభిమానులచే ఆరాధించబడడం జరిగింది.
త్వరలో అతడు పెద్ద పెద్ద వేదికలపై వాయించడం మరియు అతని అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. మాక్స్ ఆశ్చర్యపోయాడు; అతడు చివరికి దానిని సాధించాడు. అయితే, అతని కీర్తి పెరిగేకొద్దీ, అతని అహంకారము కూడా పెరిగింది. అతడు తన స్వంత విజయం మీద మరింత దృష్టి కేంద్రీకరించాడు మరియు అతడు దేవుని మహిమపరచడానికి మొదట సంగీతాన్ని ఎందుకు ప్రారంభించాడో మర్చిపోవడం ప్రారంభించాడు. ఒకరోజు వేలమందిలో సంగీతం వాయిస్తుండగా గుండెపోటు వచ్చింది.
ఆసుపత్రిలో, అతడు దేవుని దర్శనం పొందుకున్నాడు, అతడు తన మీద దాడికి గల కారణాన్ని చెప్పాడు. తనను కరుణించి స్వస్థపరచిన ప్రభువుకు మొరపెట్టాడు, ఈరోజు ఆయన పాటలు వేలమంది హృదయాలను తాకుతున్నాయి. (కొన్ని కారణాల వల్ల పేరు మార్చాను)
దేవుని మహిమపరచడమే మన ఉద్దేశమని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. కీర్తనలు 86:9, "ప్రభువా, నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు." దీనర్థం మన జీవితంలో మన అంతిమ లక్ష్యం మన మాటలు, క్రియలు మరియు వైఖరి ద్వారా దేవునికి మహిమ తీసుకురావడమే
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నేను ఈ రోజు నీ యెదుట సాగిలపడుతున్నాను మరియు సమస్త మహిమలు నీకు మాత్రమే చెందినవని అంగీకరిస్తున్నాను. నేను చేసే ప్రతి పనిలో నీకు మహిమ చెల్లించడం నన్ను గుర్తుచేసే నీ వాక్యానికై వందనాలు. నీకు మహిమ చెల్లించడం కంటే నాకే మహిమ కలుగును గాక అని వెతుక్కునే ఉచ్చులో నేను పడిపోయిన క్షణానికై నన్ను క్షమించు.
Join our WhatsApp Channel
Most Read
● ప్రవచనాత్మక పాట● ఆధ్యాత్మిక ప్రయాణం
● రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి
● 21 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 5
● 02 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 16 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు