మీ జీవితాన్ని మార్చుకోవడానికి బలిపీఠానికి ప్రాధాన్యత ఇవ్వండి
యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. (ఎజ్రా 3:2)
ఒక యూదుని జీవితం సమస్తం దేవుని మందిరం చుట్టూ తిరుగుతుంది. సైన్యాలు దాడి చేయడంతో మందిరాన్ని అప్పటికే ధ్వంసం చేసిన దృశ్యం ఇప్పుడు కనిపించింది. ఎజ్రా దైవికంగా ప్రేరేపించబడ్డాడు మరియు పడిపోయిన దేవుని మందిరాన్ని పునరుద్ధరించడానికి నియమించబడ్డాడు.
ఆసక్తికరంగా, వారు మందిరాన్ని నిర్మించడానికి ముందు, వారు దేవుని బలిపీఠాన్ని నిర్మించారు. వారు బలిపీఠంతో ప్రారంభించారు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక ప్రాధాన్యత.
"నీకు మందిరం కాకుండా బలిపీఠం ఉండొచ్చు, కానీ బలిపీఠం లేకుండా మందిరం ఉండకూడదు" అనే ఈ సిధ్ధాంతాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కానుకను పవిత్రం చేసేది మందిరం కాదు, కానీ కానుక పవిత్రం చేసేది బలిపీఠం. శక్తి ఆలయం నుండి కాదు, బలిపీఠం నుండి వస్తుంది. మందిరంలో జరిగేదంతా బలిపీఠం ద్వేరా వస్తుంది.
ఈ సిధ్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని;
మీరు గొప్ప పరిచర్యను నిర్మించడానికి ముందు, ముందుగా మీ ప్రార్థనా బలిపీఠాన్ని నిర్మించండి
మీరు ఇంటిని నిర్మించే ముందు, ముందుగా ఒక బలిపీఠాన్ని నిర్మించండి
మీరు వివాహాన్ని నిర్మించే ముందు, ముందుగా ఒక బలిపీఠాన్ని నిర్మించండి
మీరు వ్యాపారాన్ని నిర్మించే ముందు, ముందుగా బలిపీఠాన్ని నిర్మించండి
మీరు ఈ ప్రాధాన్యతను జాగ్రత్తగా చూసుకుంటే, మిగితా విషయాలు వాటంతట అవే జరుగుతాయి.
బలిపీఠం ప్రాధాన్యత గురించి యేసు ప్రభువు స్వయంగా ఇలా సెలవిచ్చాడు
కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33)
సారాంశంలో, మీరు అన్నిటికంటే బలిపీఠాన్ని నిర్మించడానికి ప్రాధాన్యతనిస్తే, మిగతావన్నీ జరుగుతాయని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఇది మీరు మరియు నేను నిర్లక్ష్యం చేయకూడని శక్తివంతమైన సిధ్ధాంతం.
బలిపీఠం అంటే ఏమిటి?
బలిపీఠం మార్పు గల స్థానము. ఇది ఆధ్యాత్మికం మరియు సహజత్వం మధ్య కలిసే స్థానం, దైవత్వం మరియు మానవత్వం మధ్య సమావేశం. బలిపీఠం అంటే దేవుడు మానవుని కలిసే స్థానము.
బలిపీఠం అనేది విధిని మార్చే ప్రదేశం.
పాత నిబంధనలో, బలిపీఠం భౌతిక స్థలం. దేవుని కలవాలంటే మరెక్కడా కలవలేని విధంగా, ఈ బలిపీఠము యొద్దకు మీరు వెళ్లాల్సిందే. మీరు అర్పించవలసి వస్తే, మీరు అర్పించడానికి ఈ స్థలానికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే, కొత్త నిబంధనలో, బలిపీఠం ఒక ఆధ్యాత్మిక స్థానము. ఇక్కడే మానవుని ఆత్మ దేవుని ఆత్మను కలుసుకుంటుంది.
బైబిలు దినాలలో, యూదులు యెరూషలేములో బలిపీఠం కలిగి ఉన్నారు మరియు సమరయులు సమరయలో వారి బలిపీఠాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరూ తమ బలిపీఠం సరైనదని వాదించారు. ఇది యూదులు మరియు సమరయుల మధ్య గొప్ప శత్రుత్వానికి దారితీసింది. దీనివల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కూడా.
యేసు ప్రభువు యాకోబు బావి వద్ద సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు, ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు.
అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు మీ హృదయములో (ఆత్మీయ మనిషి) తప్పఈ పర్వతము మీదనైనను (సమరియాలో) యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు - యోహాను 4:21
మనం పరిశుద్ధాత్మ ఆలయం కాబట్టి ఇకపై శారీరక బలిపీఠాలను నిర్మించము.
ప్రార్థన, ఆరాధన మరియు వాక్యంలో ప్రతిరోజూ ప్రభువును వెతకడం మీ ప్రాధాన్యతగా చేసుకోండి. మీ బలిపీఠానికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది.
Most Read
● మీ అభివృద్ధిని పొందుకోండి● మూర్ఖత్వం నుండి విశ్వాసాన్ని వేరు చేయడం
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?
● ఇతరుల పట్ల కృపను విస్తరింపజేయండి
● సంసిద్ధత లేని లోకములో సంసిద్ధముగా ఉండడం
● గతం యొక్క సమాధిలో భూస్థాపితం కావద్దు
● 15 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన