అనుదిన మన్నా
క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
Thursday, 27th of April 2023
0
0
651
Categories :
Angels
ఇటీవల, దేవదూతల రాజ్యం పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంది. క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చు మరియు వారు చేయాలనుకున్నది చేయమని చెప్పగలరని నేను అనేక కథనాలను (ప్రసిద్ధ వ్యక్తుల ద్వారా కూడా) చూశాను.
మన ఏకైక అధికారం దేవుని వాక్యం, కాబట్టి వాక్యం ఏమి చెబుతుందో చూద్దాం:
1. దేవదూతలు దేవుని సేవకులు, మనకు కాదు
నేను చాలా మంది ప్రార్థన విన్నాను, "ఓ ప్రధాన దేవదూత గాబ్రియేలు నా కోసం విఙ్ఞాపణ చేయి. పరలోకపు సైన్యానికి చెందిన యువరాజు మిఖాయేలు, వెళ్లి ఆ శక్తిని నాశనం చేయమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
దేవదూతలు దేవుని సేవకులు మరియు మనకు కాదు. వారు ఆయన ఆజ్ఞను పాటిస్తారు మరియు లోబడుతారు. వారు ఆయన మాటకు, ఆయన స్వరానికి ప్రతిస్పందిస్తారు మరియు మన ప్రత్యక్ష ఆదేశాలు లేదా విన్నపాలకు కాదు. ఈ క్రింది లేఖనాలను పరిశీలించండి, నేను చెప్పేది మరింత అర్థవంతంగా ఉంటుంది.
యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి
ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు
ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. (కీర్తనలు 103:20-21)
కీర్తనలు 91:11 గమనించండి
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
"ఆయన తన దూతలను ఆజ్ఞాపించును" అనే పదబంధాన్ని గమనించండి.
మన రక్షణ కోసం ఆయన దేవదూతలను ఇవ్వడం యేసు నామంలో తండ్రికి చేసిన ప్రార్థనకు ప్రతిస్పందనగా ఉంది.
ప్రభువైన యేసు భూమిపై నడిచినప్పుడు, దేవదూతలు తన తండ్రి అధికారంలో ఉన్నారని ఆయన అంగీకరించాడు.
"యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?'" (మత్తయి 26:52-53)
1 పేతురు 3:21-22 ప్రకారం, పునరుత్థానం తర్వాత, దేవదూతలు ఇప్పుడు యేసు ఆజ్ఞ క్రింద ఉన్నారు.
"... దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు." (1 పేతురు 3:21-22)
మరియు మనకు సహాయం చేయడానికి ఈ దేవదూతలను విడుదల చేసిన ప్రభువైన యేసయ్యే.
"వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?" (హెబ్రీయులకు 1:14)
కాబట్టి మీరు గమనించండి, ఈ దేవదూతలు మనకు సేవ చేస్తారు, కానీ వారు యెహోవా యొక్క ఆధ్యాత్మిక అధికారానికి మాత్రమే లోబడి ఉన్నారు.
ఒప్పుకోలు
1. మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు, మనము 2023లో ప్రతి వారం (మంగళ/గురు/శని) ఉపవాసం ఉంటున్నాము. ఈ ఉపవాసం ఐదు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది.
2. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి
3. అలాగే, మీరు ఉపవాసం లేని రోజుల్లో ఈ ప్రార్థన అంశాలను ఉపయోగించండి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
ప్రతి భారం నా భుజం నుండి తీసివేయబడును, మరియు నా మెడ మీద నుండి ప్రతి కాడి కొట్టివేయబడును మరియు అభిషేకం కారణంగా కాడి విరుగగొట్టబడును. నేను వాక్య అవగాహనలో ఎదుగుదును. (యెషయా 10:27)
కుటుంబ రక్షణ
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)
ఆర్థిక అభివృద్ధి
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● ఆశీర్వాదం యొక్క శక్తి● ప్రవచనాత్మకంగా అంత్య దినాలను విసంకేతనం చేయడం
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● 07 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దేవుని మహిమపరచండి మరియు మీ విశ్వాసాన్ని ఉత్తేజపరచండి
● బైబిలును ప్రభావవంతంగా ఎలా చదవాలి
● మీ స్పందన ఏమిటి?
కమెంట్లు