english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
అనుదిన మన్నా

మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము

Monday, 22nd of May 2023
0 0 706
Categories : Mentor
ప్రభువైన యేసుక్రీస్తును నా వ్యక్తిగత ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నేను ఆత్మతో నిండిన సంఘానికి హాజరుకావడం ప్రారంభించాను. కూడిక ముగిసిన తర్వాత, ఒక చిన్న సమూహపు అబ్బాయిలు (వారిలో ముగ్గురు) నన్ను వారితో టీ తాగడానికి ఆహ్వానించారు.

సమీపంలోని ఓ హోటల్‌లో వెయిటర్లుగా వారు పనిచేశారు. టీ తాగేటప్పుడు, మేము ప్రభువు గురించి మాట్లాడుకుంటాము, లేఖనాలు గురించి పంచుకుంటాము, అలాగే, నేను పుస్తకాలు చదవడానికి ఇష్టపడతానని తెలిసినప్పుడు వారు కొన్ని క్రైస్తవ పుస్తకాలను నాతో పంచుకునేవారు. మా సహవాసం ఎక్కువ సమయం ఉండదు (45 నిమిషాలు). ఒకరోజు, నేను సంఘానికి హాజరు కానప్పుడు, వారు నా పొరుగువారి ల్యాండ్‌లైన్‌ నంబరుకు కూడా కాల్ చేసారు. ఇది నాకు చాలా మంచి అనుభూతిని కలిగించింది, అంగీకరించబడింది.

లేఖనం స్పష్టంగా చెబుతోంది:
ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు (మార్గదర్శకుడు) తన చెలికానికి వివేకము పుట్టించును. (సామెతలు 27:17)

ఈ రోజు సంఘం యొక్క విచారకరమైన భాగం ఏమిటంటే ప్రజలు హాజరు కావడం మరియు వెళ్లిపోవడం - ఏ ఒక్కరు కలసి ఉండటానికి ఇష్టపడరు మరియు ఏ ఒక్కరు లోబడటానికి ఇష్టపడరు. కానీ మీరు ఎవరితోనైనా కలసినప్పుడు మరియు లోబడినప్పుడు నిజమైన అభివృద్ధి జరుగుతుందని మీరు చూస్తారు. నా తొలినాళ్లలో మరియు నేటికీ నేను దీన్ని కొనసాగిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను.

చాలా తరచుగా, వివాహ వేడుకలో క్రింది లేఖనాలు ఉపయోగించబడతాయి. కానీ ఈ లేఖనాలు అన్వయం కేవలం వివాహానికి మాత్రమే పరిమితం కాదు మరియు మార్గదర్శకత్వానికి కూడా వర్తిస్తుంది.

ప్రసంగి 4:9-10
ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును.

ప్రతి క్రైస్తవునికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడు అవసరమని నేను నమ్ముతున్నాను. గమనించండి ఎందుకని?

#1: ఇది వాక్యానుసారమైనది
మోషే యెహోషువకు మార్గదర్శకం చేసాడు. యిత్రో మోషేకు మార్గదర్శకం చేసాడు. నయోమికి రూతుకు మార్గదర్శకం చేసింది. ఏలీయాకు ఎలీషా మార్గదర్శకం చేసాడు. యేసు తన శిష్యులకు మార్గదర్శకం చేసాడు. పౌలు తిమోతికి మార్గదర్శకం చేసాడు. పెద్దలు తరువాతి తరానికి బోధించాలి మరియు మార్గనిర్దేశం చేయాలి (తీతు 2) అని అపొస్తలుడైన పౌలు స్వయంగా చెప్పాడు.

#2: మనందరికీ గుడ్డిచుక్కలు ఉన్నాయి
నిర్వచనం ప్రకారం, "గుడ్డిచుక్క" అనేది మనకు కనిపించని విషయం. కాబట్టి, మీకు గుడ్డిచుక్కలు లేవని మీరు చెబితే, మీరు దానిని అంగీకరించారు. మనల్ని మనం పూర్తిగా చూసుకోవడానికి మరొకరు సహాయం చేయాలి.

#3: ప్రజలు మనకు దేవుడు ఇచ్చిన బహుమానము
ఎవరో ఇలా సెలవిచ్చారు, "దేవుడు మనకు బహుమానము ఇచ్చినప్పుడు, ఆయన దానిని ఒక వ్యక్తిలో చుట్టేస్తాడు." మమ్మల్ని మార్గనిర్దేశం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఎవరూ మన పక్కన నడవనప్పుడు మనము ఈ బహుమానమును కోల్పోతాము.

నేటి కాలంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన సిధ్ధాంతాలలో ఇది ఒకటి. ప్రయోజనాలు అమూల్యమైనవి మరియు చాలా ఎక్కువ తుఫానులను కలిగి ఉన్న జీవన సముద్రంలో జీవనాధారాన్ని అందిస్తాయి.
కరుణా సదన్‌లో, మనకు J-12 లీడర్ అని పిలవబడే వ్యక్తి ఉన్నాడు, అతడు పాస్టర్‌కి రిపోర్ట్ చేస్తాడు, అతడు నాకు రిపోర్ట్ చేస్తాడు. మీరు J-12 లీడర్‌లో ఉన్నప్పుడు, ఈ వ్యక్తి ఒక మార్గదర్శకునిగా మరియు సులభతరం చేసే వ్యక్తిగా వ్యవహరిస్తాడు మరియు ఆధ్యాత్మిక వృద్ధికి సహాయం చేస్తాడు. చాలా మంది దీనికై సాక్ష్యం చెప్పారు.

మీరు కరుణా సదన్‌లో భాగమైతే, మీరు ఒక నాయకుని క్రింద ఉండాలని నేను సిఫార్సు చేస్తున్నాను. మీరు నాయకుడి క్రింద ఉండాలనుకుంటే, మీరు KSM కార్యాలయానికి కాల్ చేయవచ్చు లేదా నోహ్ చాట్‌లో సందేశం పంపవచ్చు. అలాగే, మీరు వేరే సంఘములో భాగమైతే, మీరు ప్రార్థన చేయమని మరియు మీరు ఎవరికి లోబడి యుంటారో వారిని కనుగొనమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రయోజనాలు అమూల్యమైనవి.

మార్గదర్శకత్వం బంధాలు సులభం కాదు మరియు దాని హెచ్చు తగ్గులు ఉండవచ్చు కానీ దేవుడు వీటన్నింటి ద్వారా పని చేస్తున్నాడని గుర్తుంచుకోండి. (రోమీయులకు 8:28 చదవండి)

ప్రార్థన
1. మీకు జ్ఞాపకము ఉంటే, మనము వారంలోని ప్రతి మంగళ/గురు/శనివారం ఉపవాసం ఉంటున్నాము.

2. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి.

3. అలాగే, మీరు ఉపవాసం లేని రోజుల్లో ఈ ప్రార్థన అంశములను ఉపయోగించండి.

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
(మీకు మార్గదర్శకుడు లేకుంటే ఇలా ప్రార్థించండి): తండ్రీ, నా జీవితంలో మీ సన్నిధిని మరియు సత్యాలను నిజంగా నింపగల మార్గదర్శకుడు నాకు దయచేయి.

(మీకు మార్గదర్శకుడు ఉంటే ఇలా ప్రార్థించండి): తండ్రీ, నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను....... నేను అతని/ఆమె మరియు అతని కుటుంబ సభ్యులపై ఆశీర్వాదం పలుకుతున్నాను. యేసు నామములో. ఆమెన్.
[ఎల్లప్పుడూ మీ మార్గదర్శకుడు కోసం క్రమం తప్పకుండా ప్రార్థించండి]


కుటుంబ రక్షణ
తండ్రీ, “తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా (యేసయ్య) యొద్దకు రాలేడు” అని మీ వాక్యం చెబుతోంది (యోహాను 6:44). నా సభ్యులందరినీ నీ కుమారుడైన యేసు వైపుకు ఆకర్షించమని నేను మనవిచేయుచున్నాను, వారు నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు మరియు నీతో శాశ్వతత్వం ఉంటారు.

ఆర్థిక అభివృద్ధి
ఓ దేవా యేసు నామములో లాభదాయకమైన మరియు ఫలించని శ్రమ నుండి నన్ను విడిపించు. దయచేసి నా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించు.

ఇప్పటి నుండి నా గమనము మరియు పరిచర్య ప్రారంభం నుండి నా పెట్టుబడులు మరియు శ్రమలన్నీ యేసు నామములో పూర్తి లాభాలను పొందడం ప్రారంభిచును గాక.

KSM సంఘం:
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృంద సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక.

దేశం:
తండ్రీ, యేసు నామములో, ఈ దేశాన్ని నిర్వహించడానికి జ్ఞానం మరియు అవగాహన ఉన్న నాయకులను, పురుషులను మరియు స్త్రీలను లేవనెత్తు.

Join our WhatsApp Channel


Most Read
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
● హెచ్చరికను గమనించండి
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #1
● అరణ్య మృగం గల మనస్తత్వంపై విజయం పొందడం
● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1
● మార్పు చెందడానికి ఇంకా ఆలస్యం చేయకు
● 21 రోజుల ఉపవాసం: #20 వ రోజు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్