అనుదిన మన్నా
మీరు ద్రోహాన్ని అనుభవించారా
Wednesday, 24th of May 2023
0
0
1196
Categories :
Betrayal
Forgiveness
నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల
నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు
నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.
ఈ పనిచేసిన నీవు నా సహకారివి
నా చెలికాడవు నా పరిచయుడవు.
మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము
ఉత్సవమునకు వెళ్లు సమూహముతో
దేవుని మందిర మునకు పోయి యున్నవారము. (కీర్తనలు 55:12-14)
ఈ పదాలు ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుకు ద్రోహముకు సంబంధించిన మెస్సియానిక్ ప్రవచనం.
కానీ యేసుకు ద్రోహం చేసింది యూదా మాత్రమే కాదు. ఆయన శిష్యులు కూడా చేసారు; వారు తమ ప్రాణాలకు భయపడి పారిపోయారు. యేసుకు అత్యంత సన్నిహితులలో ఒకరైన పేతురు, యేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా నిర్ద్వందంగా ఖండించాడు. యేసు అనుభవించిన లోతైన బాధ, నొప్పి, ఒంటరితనం ఊహించడం కష్టం.
మనలో చాలా మందికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అత్యంత సన్నిహితులు చేసే ద్రోహం మరింత బాధాకరం. ఇది జరిగినప్పుడు, మన హక్కులను, మన దృక్కోణాన్ని కాపాడుకోవడానికి మనము ఎదగాలని కోరుకుంటున్నాము. సరిదిద్దుకోవడానికి తీవ్రంగా పోరాడతాం. కొన్నిసార్లు, మనము నిశ్శబ్దంగా లోపల నలిగిపోతాము.
మన పరిపూర్ణ ఉదాహరణ అయిన యేసయ్య ద్వారా, నమ్మకద్రోహాన్ని ఎలా జాగ్రత్త వహించాలో సరైన పద్దతిని మనం నేర్చుకోవచ్చు. ద్రోహాన్ని అధిగమించడానికి యేసయ్య బోధల నుండ ఉన్నాయి.
#1 మీ హృదయాన్ని కాపాడుకోండి
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము (సామెతలు 4:23)
ద్రోహం మీ భావాలను బాధించడమే కాదు, అది నేరుగా మీ హృదయానికి, మీ సమస్త భావోద్వేగాలకు స్థానంగా వెళుతుంది. మీరు ద్రోహానికి సరిగ్గా స్పందించకపోతే, మీ హృదయం ఇతరుల పట్ల మరియు చివరికి ప్రభువు పట్ల గట్టిపడుతుంది. ద్రోహం యొక్క లక్ష్యం మీ హృదయాన్ని విషపూరితం చేయడం, మరియు మీరు దాని నుండి రక్షించుకోవాలి.
#2 ద్రోహం చేసినవారిని క్షమించుట
మనుష్యుల అప రాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. (మత్తయి 6:14-15)
క్షమాపణ అనేది విశ్వాసం యొక్క క్రియ. మీరు క్షమించకపోతే, యేసయ్య మీకు ఉచితంగా ఇచ్చిన క్షమాపణను మీరు అనుభవించలేరు! క్రొత్త నిబంధన గ్రీకులో "క్షమించు" అనే పదానికి "వదిలిపెట్టు" అని అర్థం. వదిలిపెట్టు ముందుకు వెళ్ళు.
ప్రార్థన
1. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
2. అలాగే, మీరు ఉపవాసం లేని దినాలలో ఈ ప్రార్థన అంశాలను ఉపయోగించండి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామములో, క్రీస్తు విశ్వాసం ద్వారా నా హృదయంలో నివసించే విధంగా, నీ అద్భుతమైన సంపద నుండి నా అంతర్గత జీవిలో నీ ఆత్మ ద్వారా నన్ను శక్తితో బలపరచాలని నేను ప్రార్థిస్తున్నాను.
తండ్రీ, జ్ఞానాన్ని మించిన నీ ప్రేమలో నేను పాతుకుపోయి స్థిరపడాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో.
తండ్రీ, నేను దేవుని సంపూర్ణత యొక్క కొలమానానికి నింపబడాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. (ఎఫెసియులకు 3 ఆధారంగా)
కుటుంబ రక్షణ
పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యేసు నామములో నాపై మరియు నా కుటుంబ సభ్యులపై మళ్లీ తాజాగా వచ్చును. యెహోవా, నీ అగ్ని నా జీవితంలో, నా కుటుంబంలో యేసు నామములో పవిత్రం కానివన్నీ కాల్చబడును గాక.
ఆర్థిక అభివృద్ధి
సహాయం కోసం నా వైపు చూసేవాడు నిరాశ చెందడు. నా అవసరాలను సంతృప్తి పరచడానికి మరియు అవసరమైన ఇతరులకు ఇవ్వడానికి నాకు తగినంత కంటే ఎక్కువ ఉండును. నేను ఇచ్చేవాడను మరియు ఎప్పుడూ పుచ్చుకునే వాడను కాను. యేసు నామములో.
KSM సంఘం
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు, సిబ్బంది మరియు బృంద సభ్యులు అలౌకిక జ్ఞానం, వివేచన, సలహా శక్తి, జ్ఞానం మరియు ప్రభువు పట్ల భయంతో నడవాలని నేను ప్రార్థిస్తున్నాను (యెషయా 11:2-3)
దేశం
తండ్రీ, నీ నీతి మా దేశాన్ని నింపును గాక. మా దేశానికి వ్యతిరేకంగా పనిచేసే చీకటి మరియు విధ్వంసం యొక్క సమస్త శక్తులన్ని నాశనం అవును గాక. మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సమాధానము మరియు సంపద ఉండును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● కలవరాన్ని అధిగమించడానికి క్రియాత్మకమైన మార్గాలు● 21 రోజుల ఉపవాసం: 12# వ రోజు
● లోకమునకు ఉప్ప లేదా ఉప్పు స్తంభం
● మరొక అహాబు కావద్దు
● విశ్వాసులైన రాజుల యాజకులు
● ఆధ్యాత్మిక తలుపులను మూసివేయడం
● పర్వతాలను కదిలించే గాలి
కమెంట్లు