అనుదిన మన్నా
మీరు ఎవరి సమాచారమును నమ్ముతారు?
Saturday, 24th of June 2023
0
0
844
Categories :
రక్షణ (Salvation)
"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1)
దేవుని దాసుడు తన ప్రార్థన సమయాలలో ఒక దర్శనంలో పరలోకానికి తీసుకువెళ్లబడ్డాడు. తన పరలోక సందర్శన సమయంలో, అతడు ఒక ప్రకాశవంతమైన పుస్తకాన్ని చూశాడు. అది ఏ పుస్తకం అని ఆయన ప్రభువును అడిగాడు. దేవుడు చిరునవ్వు నవ్వి అతనిని స్వయంగా చూడమని అడిగాడు. అది బైబిలు. అతడు చూసినది అతనిని ఆశ్చర్యపరిచింది; బైబిల్లో ఒక అధ్యాయాం తెరిచి ఉంచబడింది - యెషయా 53.
నేటి వచనం మనకు చాలా మంది రక్షణ సువార్త సందేశాన్ని తిరస్కరిస్తారని స్పష్టంగా చెబుతుంది. అనేక మంది వివిధ కారణాల వల్ల రక్షణ సందేశాన్ని తిరస్కరిస్తారు.
కొందరు వ్యక్తులు రక్షణ సందేశాన్ని అంగీకరిస్తే, వారు సమాజం నుండి బహిష్కరించబడతారని సమాజానికి భయపడుతున్నారు. యోహాను 9:22లో, యూదుల భయం కారణంగా యేసు ద్వారా స్వస్థత పొందిన అంధుడి తల్లిదండ్రులను మనం చూశాము, వారు ఆయనని క్రీస్తుగా అంగీకరించలేదు. తమను సమాజ మందిరం నుండి బయటకు వెలివేస్తారని కూడా వారు భయపడ్డారు. ఈ రోజుకి కూడా, మనిషి మరియు సమాజం పట్ల భయం కారణంగా రక్షణ యొక్క నిజమైన సందేశంపై చాలా మంది రాజీ పడుతున్నారు.
వారిలా ఉండకండి. స్వస్థత పొంది, సమాజ మందిరం నుండి వెలివేయబడిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా - ఈ వ్యక్తి తన కోసం ఎదురుచూస్తున్న యేసును పొందుకున్నాడు.
ఈ రోజు నుండి, దేవుని వాక్యం కోసం దృఢంగా నిలిచి యుండండి. మీ బహుమానము ఏమిటంటే మీరు యేసయ్యను పొందుకుంటారు. సమాజంలో నిలబడటం మరియు స్థానము గురించి ఏమాత్రం బాధపడకుండా యేసు పాదాల చెంత బహిరంగంగా సాగిలపడిన యాయీరు లాగా ఉండండి మరియు అంతిమ ఫలితం అతని కుమార్తె జీవము పొందుకుంది.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
నేను సత్యమును తెలుసుకున్నాను, మరియు సత్యము నన్ను స్వతంత్రులనుగా చేయును. యేసే నా జీవితానికి ప్రభువు, నా దేవుడు మరియు నా ప్రాణముకు రక్షకుడు.
కుటుంబ రక్షణ
బ్లెస్డ్ హోలీ స్పిరిట్, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఎలా పరిచర్య చేయాలో ప్రత్యేకంగా నాకు చూపించండి. ప్రభూ, నాకు అధికారం ఇవ్వండి. సరైన సమయంలో మీ గురించి పంచుకోవడానికి అవకాశాలను బహిర్గతం చేయండి. యేసు నామంలో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నేను విత్తిన ప్రతి విత్తనమును యెహోవా జ్ఞాపకముంచుకొనును. కాబట్టి, నా జీవితంలో అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యెహోవా తిప్పిస్తాడు. యేసు నామంలో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో
Join our WhatsApp Channel
Most Read
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #2● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
● 02 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● జూడస్ జీవితం నుండి పాఠాలు -1
● మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?
● ప్రార్థన యొక్క పరిమళము
● చెడు ఆలోచనల యుద్ధంలో విజయం పొందుట
కమెంట్లు