అసూయ మధ్య యోసేపు విజయం యొక్క రహస్యాన్ని లేఖనం వెల్లడిస్తుంది. "యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను.." (ఆదికాండము 39:2)
మీపై ఎంత మంది అసూయపడినా, వారు మీకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా మరియు చేసినా, మీరు దేవుని సన్నిధిలో కొనసాగేలా చూసుకోండి. ఏది ఏమైనప్పటికి, ప్రభువుతో మీ సాంగత్యాన్ని కొనసాగించండి. అసూయ యొక్క ప్రతికూలత మిమ్మల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేయనివ్వవద్దు. అసూయ యొక్క బాణాలు మిమ్మల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేయనివ్వవద్దు. దానికి బదులుగా, మీరు ప్రభువుకు మరింత దగ్గరవ్వాలి.
యోసేపును బానిసగా కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ప్రభువు యోసేపుతో ఉన్నాడని చూసి, అతని ఇంటిమీద విచారణకర్తగా నియమించాడు.
అతడు తన యింటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. (ఆదికాండము 39:5)
రెండవది, పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది, ఎందుకంటే అతడు తన జీవితంలో దేవుని కృప మరియు అభిషేకాన్ని కలిగిన వ్యక్తితో అనుసంధానించబడ్డాడు. ఇది శక్తివంతమైన పద్దతి; మీరు సరైన వ్యక్తులతో సంబంధం కలిగి ఉండాలి. మీకై మీరు వేరు చేసుకోండి లేదా మీ విజయం పట్ల అసూయపడే వ్యక్తులకు మీ అవగాహనను పరిమితం చేయండి.
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.
మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. (సామెతలు 13:20)
జ్ఞానవంతులు మరియు పరిణతి చెందిన వ్యక్తులతో మిమ్మల్ని వేరు చేయడానికి ప్రయత్నించడం దుష్టుని యొక్క వ్యూహాలలో ఒకటి, ఎందుకంటే మీరు దేవుని కృప మరియు శక్తిని వారి జీవితాలలో కలిగిన వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నంత కాలం, మీరు అభివృద్ధి చెందుతారని అతనికి తెలుసు.
చివరగా, నేను మీకు మరికొన్ని క్రియాత్మక సలహా ఇస్తాను.
నేడు, సోషల్ మీడియా ప్రజలు తమ తెర వెనుక దాక్కోవడాన్ని మరియు వారికి సరిగ్గా తెలియని వ్యక్తులపై అవమానాలు చేయడం చాలా సులభం చేసింది.
మీ వ్యక్తిగత పేజీలో లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎవరైనా మీ గురించి ప్రతికూలంగా మాట్లాడినట్లయితే, వారి వ్యాఖ్యలను తొలగించండి. అయినప్పటికీ, వారి ప్రవర్తన కొనసాగితే, ఆ వ్యక్తిని అన్‌ఫ్రెండ్ చేయండి లేదా బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. మీరు ఆన్‌లైన్ బెదిరింపులను సహించాల్సిన అవసరం లేదు.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత అభివృద్ధి
సైన్యములకధిపతియగు యెహోవా. నేను నిన్ను యేసు నామంలో అడుగుతున్నాను. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లబడదు అని నేను అంగీకరిస్తున్నాను. నాపై ప్రయోగించిన అసూయతో కూడిన ప్రతి బాణం పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా దహించబడును గాక. అసూయతో నా మార్గంలో రూపింపబడిన ప్రతి అవరోధం మరియు ప్రతిబంధకాలను నిర్మూలించబడును గాక. ఓ దేవా, నా విశ్వసనీయతకు ఏదైనా నష్టాన్ని ఉంటే పునరుద్ధరించు. ప్రతి తప్పు వ్యక్తి నుండి నన్ను వేరుచేయి మరియు సరైన వ్యక్తులతో నన్ను అంటి కట్టు.
నన్ను శపించడానికి ప్రయత్నించిన వారిపై నేను దీవెనలను పలుకుతున్నాను. నీవు ఇప్పటికే వారికి ప్రసాదించిన దీవెనలను వారు చూసేలా చేయి. నీవు వారి కోసం ఉంచి ఉన్న మార్గాన్ని వారికి చూపంచు మరియు నీవు వారి కోసం ఏర్పాటు చేసిన మార్గంలో ముందుకు సాగడానికి వారికి కృపను అనుగ్రహించు. నా మాటలు కృపతో రుచికరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను మరియు నీవు నన్ను ఎలా దీవించావో నేను నిన్ను మహిమ పరచినప్పుడు నేను గర్వపడను. యేసు నామంలో, ఆమేన్.
కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి పరిచర్య చేయడానికి నాకు అధికారం దయచేయి. యేసు నామములో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎవరూ మూసివేయలేని నీ తలుపులు తెరిచినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. (ప్రకటన 3:8)
సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడేలా నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించును గాక. నీ నామము మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
దేశం
తండ్రీ, యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా, దుష్టుల శిబిరంలో నీ ప్రతీకారాన్ని విడిచిపెత్తును గాక మరియు ఒక దేశంగా మేము కోల్పోయిన మహిమ పునరుద్ధరించబడును గాక.
Join our WhatsApp Channel
Most Read
● మాకు కాదు● అంతిమ భాగాన్నిగెలవడం
● 21 రోజుల ఉపవాసం: 10# వ రోజు
● ధారాళము యొక్క ఉచ్చు
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
● నిరాశ పై ఎలా విజయం పొందాలి
● మోసపూరిత లోకములో విచక్షణ సత్యం
కమెంట్లు