english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం – I
అనుదిన మన్నా

పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం – I

Saturday, 1st of July 2023
1 0 986
Categories : పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వం (Sensitivity to the Holy Spirit)
లేఖనంలో చాలా సార్లు, పరిశుద్ధాత్మ ఒక పావురంతో పోల్చబడింది. (గమనించండి, నేను పోల్చాను అని చెప్పాను). దీనికి కారణం పావురం చాలా సున్నితమైన పక్షి. మనం పరిశుద్ధాత్మతో సన్నిహితంగా నడవాలంటే, మనం ఆయన సున్నితమైన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.

అప్పుడు ఆమె (దెలీలా) అరిచింది, "సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడు చున్నారనగా అతడు నిద్రమేలుకొని యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు." (న్యాయాధిపతులు 16:20)

లేఖనంలోని అత్యంత హృదయ విచారక భాగాలలో ఇది ఒకటి, ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి కోసం అత్యంత శక్తివంతముగా ఉపయోగించబడ్డాడు, దేవుని సన్నిధిని తేలికగా తీసుకున్నాడు మరియు దేవునికి ఏది ఇష్టమో మరియు ఏది కాదు అనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. సమ్సోనూ యొక్క అతి పెద్ద తప్పు ఏమిటంటే, పరిశుద్ధాత్మ యొక్క సున్నితమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అతడు ఎప్పుడూ పట్టించుకోలేదు. యేసు నామంలో, ఇది మన వంతు భాగము కాదని నేను ప్రవచిస్తున్నాను.

పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పగలమని మీకు తెలుసా?
అననీయ మరియు సప్పీరా పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పారని బైబిలు స్పష్టంగా తేలియాజేస్తుంది.

అప్పుడు పేతురు, "అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?" (అపొస్తలుల కార్యములు 5:3)

మీరు ఒక వ్యక్తికి మాత్రమే అబద్ధం చెప్పగలరు మరియు శక్తి (బలానికి) కాదు.

అననీయా మరియు సప్పీరా కథ క్రైస్తవులు కూడా ధైర్యంగా, ఘోరమైన పాపంలోకి ఆకర్షించబడతారనే విషాదకరమైన సత్యాన్ని ప్రదర్శించబడింది. ఈ విధంగా మోసపరచాలనే కోరికతో సాతాను వారి హృదయాలను ప్రేరేపించాడు (అపొస్తలుల కార్యములు 5:3) మరియు "ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు" (9వ వచనం).

పరిశుద్ధాత్మను కూడా ఎదురించచవచ్చు.
స్తెఫను ప్రధాన యాజకుడు (యూదుల ప్రచారకుడు) కి చెప్పారు, వారు ఆయనని తిరస్కరించడం ద్వారా పరిశుద్ధాత్మ పట్ల అవిధేయత చూపుతున్నారని:


"ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, (మూలభాషలో-వంచని మెడగలవారలారా, హృదయములయందును చెవులయందు సున్నతి పొందినవారలారా) మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు." (అపొస్తలుల కార్యములు 7:51)

పరిశుద్ధాత్మను దూషించవచ్చు.
పరిశుద్ధాత్మను దూషించవచ్చని యేసు బోధించాడు:

కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. 

మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. (మత్తయి 12:31-32)

పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీ పక్షాన ఉంటుంది, కానీ ఆయన సున్నితమైన మరియు సాధుస్వభావం కారణంగా ఆయన మిమ్మల్ని ఎప్పుడూ బలవంతం చేయడు. మీరు చేసే పనులన్నింటిలోకీ ఆయనని ఆహ్వానించాలి. తన పనిని ఒంటరిగా చేయడానికి ఆయనకి తగిన స్వెచ్చను ఇవ్వాల.

చాలా సంవత్సరాల క్రితం, ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ హైవే మీద డ్రైవింగ్ చేస్తున్నాడు. రోడ్డుపై నుంచోని ఉన్న కారును అతను గమనించాడు మరియు దాని డ్రైవర్ దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హెన్రీ ఫోర్డ్ తన కారును ఆపి డ్రైవర్‌కు ఏ విధంగా నీవు సహాయ పడగలను అని అడిగాడు. డ్రైవర్, కోపంతో, "ముసలివాడా, నేను చేయలేనిది నువ్వు ఏమీ చేయగలవు. నీ పని నీవు చూసుకో; స్వతహాగా నేను దీనిని బాగుచేస్తాను."

చాలా సున్నితంగా, హెన్రీ ఫోర్డ్ తన కారులో తిరిగి వెళ్లిపోయాడు. కారు బాగు చేయాల్సిన వ్యక్తి తాను కారు తయారీదారుని తిరస్కరించానని గ్రహించలేదు! ఖచ్చితంగా, తయారీదారుడే దానిని బాగు చేయగలడు.

చాలా అవకాశాలు పోతాయి ఎందుకంటే, క్రైస్తవులుగా, కొన్ని పనులు చేయడానికి పరిశుద్ధాత్మ మనతో ఏమి (లేదా ఎలా) మాట్లాడుతున్నాడో మనం గుర్తించలేము. సరళంగా చెప్పాలంటే, మనము ఆయన స్వరం మరియు సన్నిధి పట్ల తగినంత సున్నితంగా లేము.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
దేవా తండ్రీ, యేసు నామంలో ఈరోజు నాపై తాజా అగ్ని కుమ్మరించబడును గాక. నా దేవా మరియు నా ప్రభువా, యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా నాకు బాప్తిస్మము దయచేయి.

కుటుంబ రక్షణ
తండ్రీ, దయచేసి నాకు మరియు నా కుటుంబ సభ్యుల కంటే ముందుకు వెళ్లి, ప్రతి వంకర మార్గాన్ని సరిదిద్దు మరియు ప్రతి కఠినమైన మార్గాన్ని సులభతరం చేయి.

ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, శిష్యులు బయటకు వెళ్లి, అన్ని విషయాలు తమకు లోబడి ఉన్నాయని సాక్ష్యాలతో తిరిగి వచ్చారు; నేను కూడా విజయం మరియు సాఫల్య సాక్ష్యాలతో తిరిగి వస్తాను.

KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించుదురు గాక. నీ నామము మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
 
దేశం
తండ్రీ, యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా, దుష్టుల స్థలము నుండి నీ ప్రతీకారాన్ని విడుదల చేయి మరియు ఒక దేశంగా మేము కోల్పోయిన మహిమను పునరుద్ధరించు. నీ సమాధానము మా దేశాన్ని పాలించును గాక.

Join our WhatsApp Channel


Most Read
● లోకమునకు ఉప్ప లేదా ఉప్పు స్తంభం
● కలవరాన్ని అధిగమించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● మానవుని ప్రశంసల కంటే దేవుని ప్రతిఫలాన్ని కోరడం
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
● ధైర్యంగా కలలు కనండి
● వివేచన v/s తీర్పు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్