అనుదిన మన్నా
ప్రభువా, కలవరము నుండి నన్ను విడిపించు
Friday, 15th of March 2024
1
0
766
Categories :
కలవరము (Distraction)
మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. (1 కొరింథీయులకు 7:35)
అపూర్వమైన కలవరమైన యుగంలో మనం ఈరోజు జీవిస్తున్నాం. చాలా మంది నిశ్శబ్దంగా ప్రార్థనలో మరియు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దినాన్ని ప్రారంభించే రోజులు పోయాయి. ఇప్పుడు చాలా మంది ఇ-మెయిల్ మరియు సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను తనిఖీ చేయడం ద్వారా వారి దినాన్ని ప్రారంభిస్తున్నారు.
మా కెమెరాలు అటుఇటు తిరుగుతున్నప్పుడు, ఆరాధన సమయంలో కూడా ప్రజలు టెక్స్ట్ సందేశాలు పంపడాన్ని వారు చూస్తున్నారని నా మీడియా బృందం తరచుగా నాకు చెబుతు ఉంటుంది. మా వారపు సమావేశం సందర్భంగా ఒక మీడియా సిబ్బంది ఒకసారి నాకు ఇలా నివేదిక ఇచ్చాడు, ఆరాధన సమయంలో తన రెండు చేతులను పైకెత్తి ఒక చేత్తో ఆమె సందేశం పంపుతున్న ఒక స్త్రీని ఒకసారి చూసాడు. ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు కాని నిజం ఏమిటంటే మనం త్వరలో కలవరానికి బానిసల తరం అవుతున్నాము.
కలవరం వల్ల మనం చెప్పేది వినగల సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది మన భౌతిక మరియు ఆధ్యాత్మిక బంధాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది దృష్టితో ఆలోచించే మన సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
కలవరం కారణంగా చాలా మందికి నిశ్చలంగా ఉండడం, ప్రార్థన చేయడం మరియు ధ్యానం చేయడం అసాధ్యం. దీనర్థం ఇది ఆధ్యాత్మికమైన ప్రమాదం, దీని నుండి మనకు దేవుని విమోచన అవసరం.
కలవరాన్ని ఎలా నిర్వచించవచ్చు?
కలవరానికి నా నిర్వచనం ఏమిటంటే, మన దృష్టిని ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న వాటి నుండి తక్కువ ప్రాముఖ్యత ఉన్న వాటి వైపుకు మల్చడం.
కలవరం ఎందుకు చాలా ప్రమాదకరం?
అత్యంత ప్రమాదకరమైన సమస్య ఏమిటంటే దేవుని నుండి దూరం కావడం - మన జీవితంలోని గొప్ప వ్యక్తి నుండి తక్కువ దృష్టిపై మార్చే మన ధోరణి. బైబిలు దీనిని విగ్రహారాధన అని అంటుంది.
మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయన యొద్దకు వచ్చి, "ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను." (లూకా 10:40)
మార్తా చెడ్డదానితో కాకుండా కలవరంలో ఉందని గమనించండి. ఆమె దృష్టిని ఉత్తమంగా ఆకర్షించిన మంచిదానితో ఆమె కలవరంలో పడింది - యేసయ్య. మరలా, కలవరానికి మరొక నిర్వచనం, మంచిది మిమ్మల్ని ఉత్తమమైన వాటి నుండి దూరం చేస్తుంది.
చాలా పనులు చేయడం వలన మీరు ప్రభువు చేత పిలువబడిన వాటి నుండి మిమ్మల్ని కలవరపడవచ్చు. ఇక్కడే నాకు సమస్య ఎదురైంది, కానీ ప్రభువు కృపతో నాకు సహాయం చేశాడు. నా తొలినాళ్లలో ప్రతిదీ చేయాలనే కోరిక నాలో ఉండేది.
అలా మరియు ఇలా చేస్తున్నందున మీరు దీన్ని చేయకూడదు. ప్రభవు మీతో చెప్పినట్లు చేయండి. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని పిలిచిన దానిపై దృష్టి పెట్టడం చాలా కష్టమైన విషయం.
"అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను." (లూకా 10:41-42)
మనం క్రమం తప్పకుండా ఏదో ఒకదానితో కలవరంలో ఉన్నప్పుడు, అది మన హృదయ అంతర్గత స్థితిని వెల్లడిస్తుంది కాబట్టి మనం దానిని చాలా జాగ్రత్తగా గమనించాలి. గుర్తుంచుకోండి, కలవరం అనేది అభిషేకానికి నం.1 శత్రువు అయితే దృష్టి అనేది సామర్త్యానికి కీలకం.

ప్రార్థన
తండ్రీ, మీరు నన్ను చీకటి రాజ్యం నుండి రక్షించి, మీ ప్రియా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలోకి నన్ను మార్చినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా కలవరం కలిగించే ప్రతి శక్తి, యేసు నామంలో నరికివేయబడును గాక.
ధన్యత గల పరిశుద్దాత్మ, నేను చేయవలసిన సమస్త విషయాలపై దృష్టి పెట్టడానికి నాకు శక్తిని దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● ఆరాధనకు ఇంధనం● అగాపే ప్రేమలో ఎదుగుట
● పరీక్షలో విశ్వాసం
● ఐక్యత మరియు విధేయత దర్శనం
● దేవుని కృపకై ఆకర్షితులు కావడం
● ఒక దేశాన్ని రక్షించిన నిరీక్షణ
● అడ్డు గోడ
కమెంట్లు