అనుదిన మన్నా
ఇతరులను సానుకూలంగా ఎలా ప్రభావితం చేయాలి
Sunday, 16th of July 2023
1
0
1067
Categories :
శ్రేష్ఠత్వము (Excellence)
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. (మత్తయి 5:13-16)
నాయకుడు అంటే ఎవరు?
నాయకుడు అంటే బిరుదును లేదా పదవిని మోసే వ్యక్తి కాదు. ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేసే వ్యక్తి నిజమైన నాయకుడు. ఇతరుల జీవితాల్లో మార్పు తెచ్చేవాడే నిజమైన నాయకుడు. ఈ అవగాహన ద్వారా, గృహిణి, విద్యార్థి మొదలైన వారు కూడా నాయకులే. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సానుకూలంగా ప్రభావితం చేయడం ద్వారా మీరు నాయకుడిగా పిలవబడే అర్హత పొందుతారు.
మీ జీవితంలో ప్రతిరోజూ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సానుకూలంగా ప్రభావితం చేసే మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీకు బిరుదు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. నిజమైన నాయకత్వమంటే దేవుని నామం మహిమపరచబడేలా ప్రజలకు సేవ చేయడమే.
నాయకుడిగా, మీరు చాలా మందిని సానుకూలంగా ప్రభావితం చేయాలనుకుంటే, మీరు మీ జీవితంలోని ప్రతి రంగంలో శ్రేష్ఠత్వమును అలవర్చుకోవడం చాలా ముఖ్యం.
మీ చుట్టూ ఉన్న ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి మీరు ప్రభావితం చేయవచ్చు. ఇది మీరు ఊహించిన దానికంటే వేగంగా మీ నాయకత్వ స్థాయిలలో ఎదగడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీ చుట్టూ ఉన్న ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి మీరు ప్రభావితం చేయవచ్చు. ఇది మీరు ఊహించిన దానికంటే వేగంగా మీ నాయకత్వ స్థాయిలలో ఎదగడానికి మీకు సహాయం చేస్తుంది.
శ్రేష్ఠత్వము అనేది అంటువ్యాధి. గొప్ప J-12 నాయకుడిగా, గొప్ప తల్లిదండ్రులుగా, గొప్ప జీవిత భాగస్వామిగా లేదా గొప్ప విద్యార్థిగా ఉండటానికి మీరు కట్టుబడి ఉండటం ద్వారా, మీరు మీ ప్రియమైన వారిని సానుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా, మీరు దేవుని రాజ్యానికి గొప్పగా చాటి చెప్పె వారిగా మారతారు. మీరు మీ చుట్టూ ఉన్నవారికి ఉప్పు మరియు వెలుగుగా అవుతారు. ఉప్పు మరియు వెలుగు రెండూ తమ చుట్టూ ఉన్న వస్తువులను ప్రభావితం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. రుచిని మెరుగుపరచడానికి ఉప్పును ఉపయోగిస్తారు. వెలుగు అనేది అవగాహన, బుద్ధి మరియు తెలివికి ప్రతీక.
శ్రేష్ఠత్వము అనేది అకస్మాత్తుగా జరిగేది కాదు. మరో మాటలో చెప్పాలంటే, ఇది ఒక్కరోజులో జరగదు. ఇది మీ దినచర్యలో ఉద్దేశ్యపూర్వకంగా అలవాటు చేసుకోవాల్సిన అలవాటు. శ్రేష్ఠత్వము అనేది జీవితకాలపు ప్రతిఫలం పంటతో కొనసాగింపబడే ప్రక్రియ.
ఆచరణాత్మకంగా చెప్పాలంటే, శ్రేష్ఠత్వమును పెంపొందించడం అంటే మీ నియామకాలను క్రమం తప్పకుండా సమయానికి చేరుకోవడం, క్రమం తప్పకుండా పని చేయడం లేదా నిర్ణీత సమయాల్లో క్రమం తప్పకుండా ప్రార్థనలో గడపడం.
కొన్నిసార్లు మీరు కొన్ని పనులు చేయడంలో విఫలం కావచ్చు కానీ దాని వల్ల మీరు కలవరపడకండి. లెమ్ము! దుమ్మును కదిలించు మరియు ముందుకు సాగు. ఎవరో ఇలా అన్నారు, "వాదించినప్పుడు సత్యం శక్తివంతంగా ఉంటుంది, కానీ దానిని ప్రదర్శించినప్పుడు అది మరింత శక్తివంతంగా ఉంటుంది",మీరు శ్రేష్ఠత్వముతో నడిచినప్పుడు, మీరు సత్యాన్ని ప్రదర్శిస్తారు.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
యేసు నామంలో, దేవుని వాక్యం నా జీవన ప్రమాణం. పరిశుద్ధాత్మ నా జీవితంలోని ప్రతి రంగంలో వాక్యం ద్వారా నిర్దేశిస్తుంది. ఆమెన్
కుటుంబ రక్షణ
తండ్రీ, నీ కృప ప్రతిరోజు నూతనగా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మరియు నా కుటుంబము బ్రదుకు దినములన్నియు నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును మరియు చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేసెదము యేసు నామము లో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నా ప్రభువైన యేసుక్రీస్తు కృపను నేను ఎరుగుదును. ఆయన ధనవంతుడై యుండియు ఆయన దారిద్ర్యము వలన నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆయన రాజ్యం కొరకు ధనవంతులు కావలెనని, నా నిమిత్తము దరిద్రుడాయెను. (2 కొరింథీయులు. 8:9)
KSM సంఘము
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృందం సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక. కరుణ సదన్ పరిచర్య ప్రతి రంగములోను సమర్థతంగా ఎదుగును గాక.
దేశం
తండ్రీ, నీ నీతి మరియు శాంతి మా దేశం అంతటా ప్రవహించును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క ప్రతి శక్తులు నాశనం అవును గాక. మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సమాధానము మరియు సమృద్ధి ఉండును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● ప్రభావం యొక్క గొప్ప పరుధులకు మార్గం● ఆయన మీ గాయాలను బాగు చేయగలడు
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
● గొప్ప క్రియలు
● దేవుని 7 ఆత్మలు: ప్రభువు యొక్క ఆత్మ
● ప్రేమ గల భాష
కమెంట్లు