english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
అనుదిన మన్నా

మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2

Friday, 1st of September 2023
1 0 716
Categories : భావోద్వేగాలు (Emotions) మన గుర్తింపు (Our Identity in Christ)
అనేక సార్లు ప్రజలు తమ గుర్తింపును, వారి జీవితమును సమస్యగా అనుమతిస్తారు. ఇది వారు ఆలోచించే, చెప్పే మరియు చేసే ప్రతిదాన్ని నిర్వచిస్తుంది. వారు చేసే అంతా దాని చుట్టూ కేంద్రీకృతమై ఉంది.

మన ప్రయాసమును మన గుర్తింపుతో ముడిపెట్టడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.
1. ఇది ఒక వ్యక్తిని చాలా నిరాశకు గురి చేస్తుంది
2. ఒక వ్యక్తి తిరిగి రాని స్థితికి పూర్తిగా ఆశను కోల్పోయేలా చేస్తుంది


మీ పరిస్థితికి బలిపశువులు కావద్దని నేను మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాను.

ఈరోజు, ప్రభువు మీ పాయసంలో మీకు విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీ అవమానం స్థానంలో మీకు రెట్టింపు ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు ఆయనను విశ్వసించాలని మరియు ఆయనతో సహకరించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఒక సమయంలో ఆ సమస్యపై విజయానికి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ విజయం ఆడంబరం కోసం కొన్ని పద్దతులను మీతో పంచుకోవడానికి నన్ను అనుమతించండి.

1. శ్రద్ధ లేదా సానుభూతి, లేదా జాలి పొందే సాధనంగా మీ సమస్యను ఉపయోగించడానికి ప్రయత్నించవద్దు.

2. మీ సమస్య గురించి అందరితో లేదా ఎవరితోనైనా చెప్పడం లేదా మాట్లాడటం మానేయండి. మీరు పంచుకునేలా సరైన వ్యక్తులతో మిమ్మల్ని కలుపుమని ప్రభువును అడగండి. 

3. సోషల్ మీడియాలో మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో లేదా ఏ పరిస్థితి గుండా వెళ్లుతున్నారో దాని గురించి పోస్ట్ చేయడం మానేయండి. 

4. మీ పరిస్థితి గురించి ప్రార్థించమని ప్రజలను అడగండి మరియు అవును, మీరు కూడా ప్రార్థన చేయాలి. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ప్రార్థన విన్నపములను పంపే కొందరు వ్యక్తులు ఉన్నారు, కానీ వారు ఎప్పుడూ ప్రార్థించరు.

5. రోమీయులకు ​​12:2 ప్రకారం మీ మనస్సును నూతన పరచుకొనుడి

రిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. (రోమీయులకు 12:2)

2 కొరింథీయులలో, పౌలు తన సమస్యలలో ఒకదాని గురించి మాట్లాడాడు, అది ఎన్నటికి పోదు. అతడు దానిని తన 'శరీరములో ఒక ముల్లు' అని అంటున్నాడు.

నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతల యందె బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. (2 కొరింథీయులకు 12:7-10)

పౌలు 'శరీరంలో ఉన్న ముల్లు' ఏమిటో ఎవరికీ తెలియదు. ఇది శారీరక రుగ్మత అని కొందరు అనుకుంటారు. మరి కొందరు ఇది నైతిక సమస్యగా భావిస్తున్నారు. బైబిలు అది ఏమిటో చెప్పకపోవడాన్ని నేను నిజంగా ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరు దీనితో సంబంధం కలిగి ఉన్నాము. మన కష్టాలు వేరు, కానీ నిజం ఏమిటంటే మన మందరం ఏదో ఒకదానితో పోరాడుతాము.

కానీ, పౌలు తన కష్టాలను తన గుర్తింపుగా మార్చుకోలేదు. అతడు తన కష్టాలను అతను ఎవరో అని నిర్వచించనివ్వలేదు. దేవుడు తనను చేయమని పిలిచిన పనిని చేయకుండా తన కష్టాలను బట్టి ఆపనివ్వ లేదు. మరియు మీరు కూడా ఆలా చేయకూడదు!

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
దేవుని శక్తి నామీద నిలిచియుండును. ఆయన కృప నాకు చాలును. నా కష్టాలు, నా బాధ నన్ను నిర్వచించవు - దేవుడు సమస్తము చేయగలడు. యేసు నామంలో. ఆమెన్.

కుటుంబ రక్షణ 
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)

ఆర్థిక అభివృద్ధి
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.

KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.

దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.

Join our WhatsApp Channel


Most Read
● సాధారణ పాత్రల ద్వారా గొప్ప కార్యము
● మీ మనస్సును క్రమశిక్షణలో పెట్టండి
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 6
● నీతి వస్త్రము
● ప్రవచన ఆత్మ
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు
● కృతజ్ఞత అర్పణలు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్