అనుదిన మన్నా
ప్రార్థనలో వచ్చే కలవరముపై ఎలా విజయం సాధించాలి
Saturday, 22nd of July 2023
1
0
1092
Categories :
కలవరము (Distraction)
ప్రార్థన (Prayer)
మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి కూర్చున్నారా, మీకు తెలియకముందే మీ మనస్సు పట్టణమంతా తిరుగుతోందా. ప్రార్థన సమయంలో కలవరము మరియు ఆటంకాలు అందరూ ఎదుర్కొనే సాధారణ పోరాటం. ఈ యుద్ధంలో మీరు ఒకరే బాధితులు కాదు. అయితే, మంచి శుభవార్త ఏమిటంటే మీరు దానిని మీద విజయం పొందగలరు.
"ఆ ఫిలిష్తీయుడు (గొల్యాతు) ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను" అని బైబిలు సెలవిస్తుంది. (1 సమూయేలు 17:16)
ఉదయం మరియు సాయంత్రం బలి అర్పించే సమయంలో గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీయులను కలవరపెట్టడానికి ప్రయత్నించాడని మీకు తెలుసా? నిజం చెప్పాలంటే, ఈ కలవరం ప్రార్థన సమయంలో జరిగింది.
మీరు ప్రార్థన సమయంలో నిశ్చలతను కనుగొనడానికి కష్టపడుతున్నట్లు అనిపిస్తే, ఈ రెండు సలహాలను పంచుకోవడానికి నాకు అనుమతివ్వండి, ఇది ప్రార్థనలో మెరుగైన దృష్టిని సాధించడంలో మీకు సహాయపడవచ్చు.
1. మృదువైన సంగీతాన్ని (వినండి) ఉపయోగించండి
సంగీతానికి మరే ఇతర సంభాషణ సాధనం లేని విధంగా మన హృదయాలు మరియు మనస్సులతో మాట్లాడే అద్భుతమైన సామర్థ్యం ఉంది. సంగీతం ప్రతి భాషల అడ్డంకులను అధిగమించింది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తరచుగా మృదువైన సంగీతాన్ని నేపథ్యంగా ఉపయోగిస్తాను. మృదువైన సంగీతం నా ఆత్మతో లోతుగా మాట్లాడుతుంది మరియు కలవరము తొలగిపోతుంది, ఇది ప్రార్థనలో మెరుగ్గా దృష్టి పెట్టడానికి నాకు సహాయపడుతుంది. నేను తరచుగా ప్రార్థనను ఆరాధనతో ముగిస్తాను. ప్రయత్నించండి! సమయం ఎగురుతున్నట్లు మీరు చూస్తారు.
2. ప్రత్యామ్నాయంగా బైబిలు పఠనం మరియు ప్రార్థన
చేయాల్సింది చాలా ఉంది కాబట్టి నా మనసు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో, నేను మృదువైన ఆరాధన సంగీతాన్ని వింటూ, వాక్యం చదవడం ప్రారంభింస్తాను. నేను ఇలా చేస్తున్నప్పుడు, నా మనస్సు సంచరించడం ఆగి, ఆయన స్వరానికి మలినమైతుంది.
ఒకానొక సమయంలో, ఒక వచనం నిజంగా నా హృదయంతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సమయంలో, నేను భారాన్ని ఎత్తివేసినట్లు అనిపించెంత వరకు నేను వచనంతో ప్రార్థిస్తాను. నేను మరల వాక్యం చదవడం ప్రారంభింస్తాను. వాక్యం మరియు ప్రార్థన మధ్య ప్రత్యామ్నాయంగా నా మనస్సు సంచరించకుండా మరియు ఆయన సన్నిధిలో గొప్ప సమయాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది.
ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రభువు సన్నిధిలో గడపడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన అభినందిస్తాడు. అందుకే ఆయన మన బలహీనతలో మనకు సహాయం చేస్తానని తన పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. (రోమీయులకు 8:26)
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. (కీర్తనలు 141:1-2)
కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఎలా పరిచర్య చేయాలో ప్రత్యేకంగా నాకు చూపించు. ప్రభువా నాకు అధికారం దయచేయి. సరైన సమయంలో నీ గురించి పంచుకోవడానికి అవకాశాలను బహిర్గతం చేయి. యేసు నామములో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నేను విత్తిన ప్రతి విత్తనమును యెహోవా జ్ఞాపకముంచుకొనును గాక. కాబట్టి, నా జీవితంలో అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యెహోవా తిప్పిస్తాడు. యేసు నామములో.
KSM చర్చి పెరుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించుదురు గాక. నీ పేరు మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
దేశం
తండ్రీ, యేసు నామములో, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలోని ప్రజల హృదయాలు నీ వైపు మళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడి యేసును తమ ప్రభువు మరియు రక్షకునిగా ఒప్పుకుందురు.
Join our WhatsApp Channel
Most Read
● ఇక నిలిచి ఉండిపోవడం చాలు● 21 రోజుల ఉపవాసం: 1# వ రోజు
● మోసపూరిత లోకములో విచక్షణ సత్యం
● ఆరాధనకు ఇంధనం
● ఆశీర్వాదం యొక్క శక్తి
● కార్యం చేయండి
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
కమెంట్లు