english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని 7 ఆత్మలు : ఆలోచన గల ఆత్మ
అనుదిన మన్నా

దేవుని 7 ఆత్మలు : ఆలోచన గల ఆత్మ

Saturday, 29th of July 2023
0 0 673
Categories : ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు (Names and Title of the Spirit) దేవుని 7 ఆత్మలు (The 7 Spirits of God)
ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. (అపొస్తలుల కార్యములు 16:6-7)

పరిశుద్ధాత్మ వారి నాటంకపరచెను అనే మాటను గమనించండి. పౌలు మరియు అతని బృందం ఆసియలో ప్రకటించాలని కోరుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఇది ఆలోచన గల ఆత్మ

వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి. అప్పుడు ఆత్మ నీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. (అపొస్తలుల కార్యములు 11:11-12)

అపొస్తలుడైన పేతురు, చర్మకారుడైన సిమోను ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడు, కొర్నేలి ఇంటికి వెళ్లమని చెబుతూ, ఆలోచన గల ఆత్మ తనకు ఎలా పరిచర్య చేసిందో ఇక్కడ వివరించాడు.

కీర్తనలు 16:7లోని దావీదు మాటలను గుర్తుకు తెచ్చుకోండి: "నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది."

ఆలోచన గల ఆత్మ మీకు నిర్దేశిస్తుంది మరియు ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో మీకు తెలియజేస్తుంది. ఆయన మీ ప్రతి వ్యవహారాలలో మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు తప్పు దిశలో నడిపించబడి ఉండవచ్చు, కానీ ఆలోచన గల ఆత్మ మీకు పరిచర్య చేసినప్పుడు, "మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును" (యెషయా 30:21).

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా 9:6)

బైబిల్ యొక్క ఈ భాగం యొక్క అసలైన హీబ్రూ పదము, ఇక్కడ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో సూచించినట్లుగా, "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త," అని రెండు వేర్వేరు పేర్లను చెప్పబడలేదు. ఇది వాస్తవానికి ఒకే పేరుగా చదువబడుతుంది: "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త." ప్రవక్త ప్రభువును వర్ణించే ఇతర పేర్లు, "బలవంతుడైన దేవుడు," "నిత్యుడగు తండ్రి," మరియు "సమాధానకర్తయగు అధిపతి" కూడా ద్వంద్వీకరించబడిందని మీరు గమనించవచ్చు.

"ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త" అనే పేరుకు "అసాధారణ వ్యూహకర్త" అని అర్థం. ఆలోచన గల ఆత్మ అసాధారణ వ్యూహకర్త. అంటే ఆయన సాధారణ మనస్సు లేదా ఇంద్రియాలకు అతీతుడు. ఆయన అతీంద్రియుడు. ఆయన గందరగోళానికి కర్త కాదు. మీరు ఎదుర్కొనే ప్రతి సంక్షోభం నుండి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మీరు చీకటి నుండి ఎలా బయటికి రావచ్చో ఆయనకు తెలుసు; మిమ్మల్ని ఎలా విజయవంతం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన మీ అసాధారణ వ్యూహకర్త, మరియు ఆయన మీలో నివసిస్తున్నాడు.
ప్రార్థన
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
ధన్యుడగు పరిశుద్ధాత్మ, నీవు నా ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త; నీవే నా అసాధారణ వ్యూహకర్త.

నీ దైవికమైన ఆలోచన నాకు ఉన్నందున నా ప్రణాళికలన్నీ స్థిరపడతాయి.
యేసు నామంలో. ఆమెన్

కుటుంబ రక్షణ
బ్లెస్డ్ హోలీ స్పిరిట్, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఎలా పరిచర్య చేయాలో ప్రత్యేకంగా నాకు చూపించండి. ప్రభూ, నాకు అధికారం ఇవ్వండి. సరైన సమయంలో మీ గురించి పంచుకోవడానికి అవకాశాలను బహిర్గతం చేయండి. యేసు నామంలో. ఆమెన్.

ఆర్థిక అభివృద్ధి
నేను విత్తిన ప్రతి విత్తనమును యెహోవా జ్ఞాపకముంచుకొనును. కాబట్టి, నా జీవితంలో అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యెహోవా తిప్పిస్తాడు. యేసు నామంలో.

KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.

దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో

Join our WhatsApp Channel


Most Read
● ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు
● ఇతరులకు ప్రకవంతమైన దారి చూపుట
● మీ పూర్తి సామర్థ్యాన్నికి చేరుకొనుట
● దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం
● 07 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● మీ పనికి (ఉద్యోగానికి) సంబంధించిన రహస్యం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్