ప్రేమ - విజయానికి నాంది - 1
ఒక్కసారి ఆలోచించండి, డబ్బు నిజమైన ఆనందాన్ని ఇవ్వదు, కీర్తి ఆత్మగౌరవాన్ని తీసుకురాదు మరియు పగ నిజంగా సంతృప్తిని ఇవ్వదు. అలాంటప్పుడు విజయానికి ప్రణాళిక (వ్యూహం) ఏమిటి?
ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ నాయకులను ఉద్దేశించి మదర్ థెరిసా ప్రసంగించారు. అక్కడ ఆమెను, "మనం ప్రపంచ శాంతిని ఎలా పొందగలం?" అని అడిగారు. ఆమె, "ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని జవాబిచ్చింది, ఇది చాలా సరళంగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ఆలోచించండి, మన మందరం నిజంగా అలా చేస్తే పోయిన పరలోకము తిరిగి దొరుకుతుంది.
నేటి కాలంలో చాలా సంస్థలు ద్వేషం మరియు ప్రతీకారంతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. అయితే ప్రభువైన యేసు తన రాజ్యాన్ని ప్రేమ అనే పునాదిపై స్థాపించాడు. నేటికీ లక్షలాది మంది ఆయన కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
మీ జీవితంలో దేవుడు మీకు దగ్గరగా ఉంచిన వ్యక్తులను ప్రేమించడం అంత తేలికైన పని కాదు. నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే, వారిని ప్రేమించాలంటే మిమ్మల్ని మీరు బలహీనంగా మార్చుకోవాలి. చాలామంది మీరు బలహీనంగా మార్చుకోవడాని బలహీనతకు చిహ్నంగా చూస్తారు. మీ బలహీనత్వాన్ని చూసి చాలా మంది మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవచ్చు.
వారు మీ జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు లేదా మీరు నడిపించే వ్యక్తులు అయినా కావొచ్చు, మీరు వారికి మీ వ్యక్తిగత సమయాన్ని ఇవ్వాలి. ఇది చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడని కార్యము మరియు అందుకే వ్యక్తులను ప్రేమించడం అంత సులభం కాదు మరియు ఇది ఎల్లప్పుడూ విజయవంతమైన వ్యూహం - జీవితంలోని ప్రతి సమయంలో కాల పరీక్షగా నిలిచే వ్యూహం.
మీకు అందం లేకపోయినా పర్వాలేదు, మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ముఖ్యం కాదు, మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను నిజాయితీగా ప్రేమించగలిగితే వారు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మీకు ప్రతిస్పందిస్తారు. క్రూరమైన జంతువులు ప్రేమకు ప్రతిస్పందిస్తాయి మరియు మనిషి దానికి భిన్నంగా లేడు. అందుకే ప్రేమ విజయానికి నాంది.
యేసు ప్రభువు ఇలా అన్నాడు, "మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను." (యోహాను13:35)
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
ప్రభువైన యేసయ్య, నీవే ప్రేమకు కర్త మరియు క్రియ. నీవు ప్రేమస్వరూపివి మరియు నీవు మొదట మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మాకు ప్రేమ గురించి తెలుసు. నువ్వు నన్ను ప్రేమించినట్లే నా చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం నేర్పు. ఆమెన్.
కుటుంబ రక్షణ
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)
ఆర్థిక అభివృద్ధి
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.
Most Read
● అంతర్గత నిధి● 31 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దేవుని యొక్క 7 ఆత్మలు: తెలివి గల ఆత్మ
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 1
● మీ వైఖరి మీ ఔన్నత్యాన్ని నిర్ణయిస్తుంది
● కలుసుకోవడం యొక్క సామర్థ్యం
● అశ్లీలత