అనుదిన మన్నా
మరొక అహాబు కావద్దు
Sunday, 3rd of September 2023
0
0
822
Categories :
దేవుని వాక్యం (Word of God)
మోసం (Deception)
రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. (2 రాజులు 22:11)
దేవుని ప్రజలు విగ్రహారాధనలో దేవునికి దూరమయ్యారు. దేవుని మందిరం (దేవుని గృహము) నిర్లక్ష్యం చేయబడింది. అటువంటి ఆధ్యాత్మిక చీకటి సమయంలో, దేవుడు యోషీయా అనే యువ రాజును లేవనెత్తాడు.
పై వచనానికి నేపథ్యం ఏమిటంటే, ప్రధాన యాజకుడు హిల్కియా మందిరానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. అతడు యోషీయా రాజు వద్దకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని (దేవునిచే వ్రాయబడిన మాటలు) తీసుకువస్తాడు. యోషీయా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, అతడు దోషిగా నిర్ధారించబడ్డాడు మరియు పశ్చాత్తాపానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు.
అలాగే, మీరు వాక్యాన్ని విన్నప్పుడు, మీ వైపు నుండి వాక్యానికి ప్రతిస్పందన ఉండాలి. మీరు కేవలం వాక్యాన్ని విని వదిలేయడం సరిపోదు. "నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను" అని చెప్పడం మాత్రమే సరిపోదు, మీరు దానిపై కార్యం చేయాలి. లేఖనము సెలవిస్తుంది, "దయ్యాలు కూడా నమ్ముతాయి మరియు వణుకుతున్నాయి" (యాకోబు 2:20), కానీ వారు తమ విశ్వాసాన్ని ఎప్పుడూ వెంబడించరు.
మీరు వినువారు మాత్రమై యుండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించు వారునైయుండుడి. (యాకోబు 1:22)
ఒక వ్యక్తి కేవలం వాక్యం విని ఏమీ చేయనప్పుడు, అలాంటి వ్యక్తి తనను తాను మోసానికి దారితీస్తాడు.
ఈ అంత్య దినాలలో మోసం అనేది అతి పెద్ద ప్రమాదం. మోసానికి ఒకరి దుర్బలత్వాన్ని తిరస్కరించే ఎవరైనా ఇప్పటికే మోసపోయారు. మోసం అంటే మీరు వినాలనుకున్నది వినాలనుకోవడం.
అహాబు తాను వినాలనుకున్నది ప్రవచించే ప్రవక్తలతో తన కోసం ఏరపర్చుకున్న దుష్ట రాజు.
ఇశ్రాయేలు రాజు (అహాబు) దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి, "యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా" అని వారి నడిగెను. "అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును" గనుక పొండని వారు చెప్పిరి. (1 రాజులు 22:6)
లోతుగా పరిశీలిస్తే, వారు చెప్పేది నిజం కాదని అతనికి తెలుసు, కానీ అతడు ఇప్పటికీ ఆ అబద్ధాన్ని నమ్ముతాడు, ఎందుకంటే అతడు అప్పటికే మోసపోయాడు. అతడు దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని చాలాసార్లు విన్నాడు, కానీ అతడు దానిని వింటూనే ఉన్నాడు మరియు దాని గురించి ఏమీ చేయలేదు. మరొక అహాబు కావద్దు.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామంలో, నీ కృప మరియు జ్ఞానంతో, నేను, నా కుటుంబ సభ్యులు, నా సంఘము మరియు నాకు సంబంధించిన వారందరూ నీ నుండి బాగా బోధించబడ్డారని నేను ప్రకటిస్తున్నాను. దీనికై నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
తండ్రీ, యేసు నామంలో, పరిశుద్దమైన మరియు అపరిశుద్దమైన, అపవిత్రమైన వాటి నుండి పవిత్రమైన మరియు అసత్యం నుండి సత్యమైన వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి మాకు వివేచన దయచేయి.
తండ్రీ, ఎల్లప్పుడూ నీ వాక్యమును వినేవాడిగా మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ వాక్యప్రకారము ప్రవర్తించు ఉండేలా నాకు అధికారం దయచేయి. యేసు నామంలో. ఆమెన్.
కుటుంబ రక్షణ
తండ్రీ, నీ కృప ప్రతిరోజు నూతనగా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మరియు నా కుటుంబము బ్రదుకు దినములన్నియు నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును మరియు చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేసెదము యేసు నామము లో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నా ప్రభువైన యేసుక్రీస్తు కృపను నేను ఎరుగుదును. ఆయన ధనవంతుడై యుండియు ఆయన దారిద్ర్యము వలన నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆయన రాజ్యం కొరకు ధనవంతులు కావలెనని, నా నిమిత్తము దరిద్రుడాయెను. (2 కొరింథీయులు. 8:9)
KSM సంఘము
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృందం సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక. కరుణ సదన్ పరిచర్య ప్రతి రంగములోను సమర్థతంగా ఎదుగును గాక.
దేశం
తండ్రీ, నీ నీతి మరియు శాంతి మా దేశం అంతటా ప్రవహించును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క ప్రతి శక్తులు నాశనం అవును గాక. మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సమాధానము మరియు సమృద్ధి ఉండును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు● ఆయన బలం యొక్క ఉద్దేశ్యం
● అవిశ్వాసం
● 21 రోజుల ఉపవాసం: 17# వ రోజు
● అద్భుతాలలో పని చేయుట: కీ#1
● ప్రేమ గల భాష
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
కమెంట్లు