అనుదిన మన్నా
అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
Monday, 11th of September 2023
0
0
841
Categories :
ఆత్మ ఫలం ( fruit of the spirit)
ప్రేమ (Love)
అగాపే ప్రేమ అనేది అత్యున్నతమైన ప్రేమ. ఇది 'దేవుని ప్రేమ'గా పేర్కొనబడింది. ప్రేమ యొక్క మిగితా రూపాలు పరస్పరం ఇవ్వడం మరియు తీసుకోవడం లేదా నిర్ణయించిన షరతులపై ఆధారపడి ఉంటాయి. అగాపే ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. దేవుడు తన క్రైస్తవులందరూ పంచుకోవాలని కోరుకునే ప్రేమ ఇదే. నిజమైన అగాపే ప్రేమ ఎల్లప్పుడూ బహుమానంగా (ఇచ్చే విధంగా) ఉంటుంది.
అయితే దేవుడు మన యెడల తన (స్వంత) ప్రేమను (అగాపే ప్రేమను) వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మన మింకను పాపులమై యుండగానే క్రీస్తు (మెస్సీయ, అభిషిక్తుడు) మన కొరకు చనిపోయెను. (రోమీయులకు 5:8)
దేవుడు మన పట్ల తన అగాపే ప్రేమను చూపించినప్పుడు, మనం ఇంకా పాపులమే. దేవుని ప్రేమకు బదులుగా మనం ఏమీ ఇవ్వలేము.
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ (అగాపే), సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. (గలతీయులకు 5:22-23)
ఆత్మ ఫలాల జాబితాలో అగాపే ప్రేమ మొదటగా ప్రస్తావించబడింది ఎందుకంటే ఇది అన్నింటికీ పునాది. ప్రేమ అనేది ఆత్మ ఫలం మాత్రమే కాదు; ఇది మిగితా ఫలాలను వ్యక్తం చేసే మూలం. ప్రేమ అనేది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ప్రధాన మూలం.
ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మ నుండే వెలువడతాయి. పరిశుద్ధాత్మతో మన అనుదిన సహవాసాన్ని కొనసాగించడానికి మనం జాగ్రత్తగా ఉంటే. ఆయన మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. (రోమీయులకు 5:5 చదవండి

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో మరియు నా పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించదానికి నాకు నేర్పుము. యేసు నామంలో ఆమేన్.
కుటుంబ రక్షణ
తండ్రీ, దయచేసి నాకు మరియు నా కుటుంబ సభ్యుల కంటే ముందుకు వెళ్లి, ప్రతి వంకర మార్గాన్ని సరిదిద్దు మరియు ప్రతి కఠినమైన మార్గాన్ని సులభతరం చేయి.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, శిష్యులు బయటకు వెళ్లి, అన్ని విషయాలు తమకు లోబడి ఉన్నాయని సాక్ష్యాలతో తిరిగి వచ్చారు; నేను కూడా విజయం మరియు సాఫల్య సాక్ష్యాలతో తిరిగి వస్తాను.
KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించుదురు గాక. నీ నామము మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
దేశం
తండ్రీ, యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా, దుష్టుల స్థలము నుండి నీ ప్రతీకారాన్ని విడుదల చేయి మరియు ఒక దేశంగా మేము కోల్పోయిన మహిమను పునరుద్ధరించు. నీ సమాధానము మా దేశాన్ని పాలించును గాక.
Join our WhatsApp Channel
Most Read
● పోలిక (పోల్చుట అనే) ఉచ్చు● రక్తంలోనే ప్రాణము ఉంది
● ప్రేమ - విజయానికి నాంది - 1
● మీ ప్రతిదినము మిమ్మల్ని నిర్వచిస్తుంది
● జీవితపు హెచ్చరికలను పాటించడం
● ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క నిశ్శబ్ద నిరోధకము
● 33 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు