english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. సమయానుకూల విధేయత
అనుదిన మన్నా

సమయానుకూల విధేయత

Tuesday, 5th of December 2023
1 0 842
ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, ఉదయపు వెలుతురు కోసం ఎదురుచూడలేనంత అత్యవసర సందేశంతో కనిపించాడు. "ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను" (మత్తయి 2:13).

మనోహరమైన విషయం ఏమిటంటే, యోసేపు వెనుకాడలేదు. క్షణం యొక్క అసంబద్ధత, అసౌకర్యం మరియు ప్రమాదం ఉన్నప్పటికీ, యోసేపు లేచి తన కుటుంబాన్ని రాత్రిపూట ఐగుప్తునకు తీసుకెళ్లాడు. అతని తక్షణ విధేయత యేసును రక్షించింది, ఈ ప్రవచనాన్ని నెరవేర్చింది: "ఐగుప్తులోనుండి నేను నా కుమారుని పిలిచితిని" (మత్తయి 2:15).

మన జీవితాలు శబ్దంతో నిండిపోయాయి: సోషల్ మీడియా అప్‌డేట్‌లు, సమాచార విషయాలు మరియు తాజా ట్రెండ్‌లు. ఈ సందడి మధ్య, దేవుని స్వరం తరచుగా "మృదువైన గుసగుసగా" వస్తుంది. “ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. (1 రాజులు 19:12).

దేవదూత యోసేపుతో కలలో మాట్లాడినట్లే, దేవుడు ఇప్పుడు మీతో నిశ్చలమైన, చిన్న స్వరంతో మాట్లాడుతున్నాడు, సంభావ్య హాని నుండి లేదా గొప్ప ఆశీర్వాదం వైపు మిమ్మల్ని ఒక దిశ వైపు నడిపిస్తాడు.

యోసేపు యొక్క విధేయత కేవలం ఖచ్చితమైనది కాదు; అది సమయానుకూలమైనది. "అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లెను" (మత్తయి 2:14). మన ఆధ్యాత్మిక నడకలో, కేవలం దేవుని స్వరాన్ని వినడానికి సరిపోదు; సమయపాలన ముఖ్యం.

నోవహు ఓడను నిర్మించడం (ఆదికాండము 6) లేదా మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడం గురించి ఆలోచించండి (నిర్గమకాండము 12-14). ఇది కేవలం దేవుడు చెప్పినట్లు చేయడం గురించి కాదు కానీ ఆయన చెప్పినప్పుడు చేయడం.

యోసేపు విషయము, దైవ మార్గదర్శకత్వం వినడం మరియు దాని ప్రకారం పనిచేయడం అనేది మన అవగాహనకు మించిన అలల ప్రభావాలను కలిగిస్తుందని చూపిస్తుంది. మీరు ఈరోజు నడుస్తున్నప్పుడు, మీ చెవులను ఆయన స్వరాని వినగలిగేలా చేయండి మరియు కదలడానికి సిద్ధంగా ఉండండి. మీ విధేయత మీరు ఇంకా చూడలేని భవిష్యత్తుకు అంశముగా కావచ్చు.
ప్రార్థన
తండ్రీ, నీ స్వరాన్ని స్పష్టంగా వినడానికి మాకు చెవులు దయచేయి మరియు నీ సూచనల ప్రకారం వేగంగా పని చేయడానికి విధేయులైన హృదయాలను దయచేయి. యేసు నామములో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● యూదా పతనం నుండి 3 పాఠాలు
● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1
● గతం యొక్క ఏకాంతగృహమును తెరుచుట
● విత్తనం యొక్క గొప్పతనం
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
● యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
● దోషానికి సంపూర్ణ పరిష్కారం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్