మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏదో ఒక సమయంలో, మనమందరం కనిపించని యుద్ధం యొక్క బరువును అనుభవించాము - మన దేహము మరియు ఎముకలను కాకుండా మన ఆత్మలను లక్ష్యంగా చేసుకునే ఆధ్యాత్మిక యుద్ధం. మీరు ఎందుకు అలాంటి దాడికి గురవుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజం సరళమైనది మరియు లోతైనది: మీలో విలువైనది ఏదైనా లేకుంటే అపవాది మీ మీద అంతగా దాడి చేయడు. దొంగలు ఖాళీగా ఉన్న ఇళ్లలోకి చొరబడి సమయాన్ని వృథా చేయనట్లే, గొప్ప సామర్థ్యం లేదా ఉద్దేశ్యము లేని వ్యక్తులతో శత్రువు బాధపడడు.
"ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము." (ఎఫెసీయుకు 6:12)
ప్రతి విశ్వాసి హృదయంలో ఒక దైవ నిధి ఉంది - దేవుడు ఉంచిన వరములు, ఉద్దేశ్యం మరియు సంభావ్యత. దేవుడు ఇచ్చిన ఉద్దేశ్యంతో నడిచే విశ్వాసి యొక్క శక్తి గురించి శత్రువుకు తెలుసు, అందువల్ల, వాడు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకముందే వారిని అరికట్టడానికి మరియు నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు.
మోషే గురించి పరిశీలించండి. అతడు పుట్టినప్పటి నుండి, అతని జీవితాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం జరిగింది. ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతుందని భయపడి హీబ్రూ మగ శిశువులను చంపమని ఫరో ఆదేశించాడు. కానీ దేవుడు మోషే కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశ్యం చాలా ముఖ్యమైనది, శత్రువు మొదటి నుండి దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మోషే, అసమానతలకు వ్యతిరేకంగా, రక్షింపబడడమే కాకుండా ఫరో రాజభవనంలో పెరిగాడు, తరువాత అతని ప్రజలను స్వేచ్ఛ వైపు నడిపించాడు.
"గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని." (యిర్మీయా 1:5)
మోషే వలె, మీరు రూపింపక మునుపే దేవునిచే మీరు ప్రతిష్ఠించబడియున్నారు. మీలో ఉన్న సంభావ్యత అపారమైనది. కానీ దీనిని గుర్తించడం సగం యుద్ధం మాత్రమే. మిగిలిన సగం మీ గమ్యం నుండి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నించే అనివార్యమైన ఆధ్యాత్మిక యుద్ధానికి సిద్ధమవుతోంది.
కాబట్టి, మీరు స్థిరంగా నిలబడి, లోపల ఉన్న నిధిని ఎలా కాపాడుకుంటారు?
1. దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి:
"మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి." - ఎఫెసీయులకు 6:11. ఇందులో సత్యం, నీతి, సమాధాన సువార్త, విశ్వాసం, రక్షణ మరియు దేవుని వాక్యం ఉన్నాయి. ప్రతి కవచము మనల్ని రక్షించడానికి మరియు శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
2. వాక్యములో పాతుకుపోయి (దృడంగా) ఉండండి:
బైబిలు కేవలం ఒక పుస్తకం కాదు; అది మీ ఆయుధం. యేసు అరణ్యంలో సాతాను ప్రలోభాలతో పోరాడాడు: "వ్రాయబడియున్నది...". వాక్యలోము బాగా ప్రావీణ్యం ఉండటం వల్ల శత్రువు యొక్క అబద్ధాలను సత్యంతో ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
3. ప్రార్థనాపూర్వక జీవితాన్ని పెంపొందించుకోండి:
ఒక సైనికుడు స్థావరంతో మాట్లాడటం నిర్వహిస్తున్నట్లే, మనం దేవునితో మన సహవాసము కొనసాగించాలి. "యెడతెగక ప్రార్థనచేయుడి” అని పౌలు సలహా ఇస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:17). ప్రతి పరిస్థితిలో, ప్రార్థనలో దేవుని వైపు తిరగండి. ఇది సైన్యఅధ్యక్షుడు పట్ల మన ప్రత్యక్ష మార్గము.
4. నీతిమంతుల సహవాసముతో మిమ్మల్ని చుట్టుముట్టుకొనుడి:
మిమ్మల్ని లేవనెత్తగల, సలహా ఇవ్వగల మరియు ప్రార్థించగల వారితో సహవాసం కొనసాగించండి. "ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును." (సామెతలు 27:17). యుద్ధ సమయాల్లో, మీ వెనుక ఉన్న దళం కలిగి ఉండటం అమూల్యమైనది.
"అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు." (2 కొరింథీయులకు 4:7)
ఈ యుద్ధాల మధ్య, మీరు దాడికి గురవుతున్నారనే వాస్తవం మీలో ఉన్న నిధి యొక్క ధృవీకరణ అని గుర్తుంచుకోండి. ప్రతి పరీక్ష మరియు ప్రలోభము దేవుని రాజ్యంలో మీ విలువను గుర్తించడం. శత్రువు తన సమయాన్ని ఖాళీ పాత్రల మీద వృధా చేయడు.
ప్రార్థన
పరలోకపు తండ్రీ, నీ దివ్యమైన ప్రకాశమును మాలో వెలిగించుము. జీవిత పోరాటాల మధ్య, నీవు మాలో దాచుకున్న నిధిని మేము గుర్తించగలము. మేము చేసే ప్రతి పనిలో నీ ప్రేమ మరియు ఉద్దేశ్యాన్ని ప్రతిబింబించడానికి మాకు సహాయం చేయి. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● పరలోకము అనే చోటు● సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 2
● మన్నా, పలకలు మరియు చేతికఱ్ఱయు
● మిమ్మల్ని అడ్డుకునే పరిమిత నమ్మకాలు
● జీవితంలోని పెద్ద శిలలను గుర్తించడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం
కమెంట్లు