అనుదిన మన్నా
0
0
1021
ఆధ్యాత్మిక గర్వము యొక్క ఉచ్చు
Sunday, 29th of October 2023
Categories :
Spiritual Pride
9తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీ కరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 10ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయము నకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 11పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.12వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. 13అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచున దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.14 lఅతని కంటె
ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. (లూకా 18:9-14)
కొన్నిసార్లు, మనము అన్నింటినీ తెలుసుకున్నామని అనుకుంటాము. మనము మన ఉదయపు భక్తిని కలిగి ఉంటాము, క్రమం తప్పకుండా సంఘానికి హాజరవుతాము మరియు ప్రభువు మరియు ఆయన ప్రజలకు సేవ చేయడంలో కూడా పాల్గొంటాము. కానీ ఆధ్యాత్మిక గర్వము యొక్క ఉచ్చులోకి జారుకోవడం చాలా సులభం, ప్రతిరోజూ మనల్ని నిలబెట్టే కృప యొక్క దృష్టిని కోల్పోతున్నాము. పరిసయ్యుడు మరియు పన్ను సుంకరి ఉపమానం ఆధ్యాత్మిక గర్వానికి వ్యతిరేకంగా కఠినమైన హెచ్చరికను అందిస్తుంది మరియు నిజమైన నీతి మార్గాన్ని చూపుతుంది.
పరిసయ్యులలో ఆధ్యాత్మిక గర్వము
1. వ్యక్తిగత నీతి:
పరిసయ్యుడు తాను ఇతరుల కంటే పైగా ఉన్నానని భావించాడు. అతని ప్రార్థన దేవునితో వినయపూర్వకమైన సంభాషణ కంటే వ్యక్తిగత-అభినందనల ఏకపాత్రగా ఉంది. రోమీయులకు 12:3 మనల్ని హెచ్చరిస్తుంది, "తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను."
2. తీర్పు తీర్చే వైఖరి:
పరిసయ్యుడు తన స్వభావమును దేవుని పరిశుద్ధ స్వభావాన్ని బట్టి కాకుండా ఇతర వ్యక్తుల స్వభావమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఎప్పుడైతే మీరు మీ స్వభావమును దేవుని పరిశుద్ధ స్వభావాన్ని బట్టి కాకుండా ఇతర వ్యక్తుల స్వభావమును బట్టి తీర్పు తీరుస్తారో, మీరు గర్వంగా నడుచుకుంటారు.
అతడు సుంకరి దారుని తృణీకరించాడు మరియు అతనితో అనుకూలంగా పోల్చుకున్నాడు. మత్తయి 7:1-2 హెచ్చరిస్తుంది, "మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును."
3. పనులలో కపటమైన భద్రత:
పరిసయ్యుడు తన క్రియలలో హామీని పొందాడు - వారానికి రెండుసార్లు ఉపవాసం చేయడం, దశమభాగాలు ఇవ్వడం మొదలైనవి. ఎఫెసీయులకు 2: 8-9 మనకు గుర్తుచేస్తుంది, "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు."
4. పశ్చాత్తాపం లేకపోవడం:
పరిసయ్యుని ప్రార్థనలో కీలకమైన అంశం: పశ్చాత్తాపం లేదు. అతనికి పాపాన్ని ఒప్పుకోవడం లేదా దేవుని కృప అవసరం లేదు. 1 యోహాను 1:9 ఇలా చెబుతోంది, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును."
ఆధ్యాత్మిక గర్వము యొక్క ప్రమాదాలు
ఎ) మన స్వంత లోపాలకు మనలను గుడ్డితనముగా చేస్తుంది:
పరిసయ్యుడు తన వ్యక్తిగత-నీతిలో మునిగిపోయాడు, అతడు తన స్వంత ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని చూడలేకపోయాడు.
బి). సంఘాన్ని లేదా సహవాసాన్ని విభజిస్తుంది: ఆధ్యాత్మిక గర్వము క్రీస్తు శరీరంలో అడ్డంకులను ఏర్పరుస్తుంది, యోహాను 17:21లో క్రీస్తు ప్రార్థించిన ఐక్యతను నాశనం చేస్తుంది.
సి) దేవునితో మన బంధాన్ని అడ్డుకుంటుంది:
పరిసయ్యుని ప్రార్థన నిజంగా దేవుని యొద్దకు చేరుకోలేదు ఎందుకంటే అది అహంకారముతో నిండిపోయింది. యాకోబు 4:6, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును" అని లేఖనము చెప్పుచున్నది.
డి). మనల్ని సాతాను మోసానికి గురి చేస్తుంది:
మనం ఎత్తుగా నిలబడి ఉన్నామని భావించినప్పుడు, మనం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంది. 1 పేతురు 5:8 అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తోంది, ఎందుకంటే విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
ప్రార్థన
తండ్రీ, నేను వినయంగా నీ యొద్దకు వస్తున్నాను, సమస్త మంచి విషయాలు నీ నుండి వచ్చాయని అంగీకరిస్తున్నాను. ప్రతి క్షణం నీ కృప నా ఆవశ్యకతను గుర్తించి వినయంతో నడవడానికి నాకు సహాయం చేయి. ఆధ్యాత్మిక గర్వము యొక్క మోసం నుండి నన్ను కాపాడు. యేసు నామములో, ఆమేన్.
Join our WhatsApp Channel

Most Read
● లెక్కించుట ప్రారంభం● కోపం (క్రోధం) యొక్క సమస్య
● ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #2
● దైవికమైన సమాధానము ఎలా పొందాలి
● 39 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఇవ్వగలిగే కృప - 2
కమెంట్లు