అనుదిన మన్నా
0
0
61
ప్రవచనాత్మక పాట
Saturday, 26th of July 2025
Categories :
ప్రవచనాత్మక గీతము (Prophetic song)
రాజు యెహోషాపాతు తన సైన్యం ముందు దేవుని స్తుతిస్తూ ఒక గాయక బృందాన్ని పంపాడు. సైన్యానికి నాయకత్వం వహించే గాయక బృందాన్ని ఊహించుకోండి. అతడు నిస్సందేహంగా స్తుతులను వారి మరణానికి పాడటం లేదు. అతడు ప్రవచనాత్మక పాట యొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాడు, అలాగే మీరు కూడా కలిగి ఉండండి. అతడు దేవుని వాక్యం ద్వారా ఇప్పటికే పొందిన విజయాన్ని ప్రకటించడానికి వారిని పంపించాడు.
బైబిలు ఇలా సెలవిస్తుంది, "వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి." (2 దినవృత్తాంతములు 20:22-23)
వారు ప్రవచనాత్మక గీతాన్ని పాడటం ప్రారంభించినప్పుడు, వారి శత్రువులు ఒకరితో ఒకరు పోరాడటం ప్రారంభించారు. శత్రు శిబిరంలో గందరగోళం నెలకొంది. దేవుని స్తుతించే పాట తప్ప ఏ ఆయుధం లేకుండా విజయం సాధించారు.
అంత్య దినాలలో ఇది జరగబోతోంది. సంఘం ప్రవచనాత్మక ఆరాధనలో ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, శత్రువుల వాకిట్లో గందరగోళం ఉంటుంది. వారు తమలో తాము పోరాడబోతున్నారు.
సమస్తము మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినప్పుడు, శత్రువుపై స్వర్గాన్ని విచ్ఛిన్నం చేయండి మరియు స్తుతుల ప్రవచన గీతంతో శత్రువుపై విజయం సాధించండి.
కీర్తనలు 149:5-9 దేవుని ప్రజలు కీర్తనలతో దేవుని స్తుతించినప్పుడు; అది వారి శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే రెండంచుల ఘడ్గం వంటిది అని మనకు సెలవిస్తుంది. చీకటి యొక్క దుష్ట పాలకులు బంధించబడుతారు. ఇంకా, ఆయన నామాన్ని విశ్వసించే వారందరికీ యిదే మహిమగల ఘనత అని లేఖనం సెలవిస్తుంది.
స్తుతుల పాట పాడటం అనేది మంచి అనుభూతి గురించి కాదు మరియు ఖచ్చితంగా మంచిగా అనిపించడం గురించి కాదు. దేవునికి స్తుతి పాట పాడటానికి మీరు గాయకుడు లేదా సంగీతకారుడు కానవసరం లేదు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నియంత్రిచి, పరలోక స్తుతులను విడుదల చేయడానికి అనుమతించండి. ఏదో గొప్పగా జరగబోతోంది!
Bible Reading: Isaiah 6-9
ప్రార్థన
పరిశుద్ధాత్మ దేవా నన్ను నియంత్రిచి మరియు నాలో స్తుతిని జన్మించు. నీ యందు నా స్తుతులు ఆమోదయోగ్యంగా ఉండును గాక. యేసు నామంలో. (ఇప్పుడు ఒక వినసొంపు గల పాటతో దేవుని ఆరాధించే సమయాన్ని గడపండి)
Join our WhatsApp Channel

Most Read
● 08 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● మీ తలంపులను పెంచండి
● మార్పుకు (రూపాంతరముకు) సంభావ్యత
● మీ పనికి (ఉద్యోగానికి) సంబంధించిన రహస్యం
● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1
● 33 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
కమెంట్లు