అనుదిన మన్నా
33 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
Friday, 12th of January 2024
1
0
714
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
నాకు నీ కనికరము కావాలి
"అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను." (ఆదికాండము 39:21 NKJV)
ప్రజలు విచిత్రమైన దేశంలో ఉన్నప్పుడు అనుభవించే ఇబ్బందుల్లో ఒకటి, వారికి సహాయం మరియు వనరులు లేకపోవడం. కానీ ఇక్కడ యోసేపు చెరసాలలో, ఒక విచిత్రమైన దేశంలో ఉన్నాడు, మరియు అతడు వెళ్లిన ప్రతిచోటా, దేవుడు అతనిపై కనికరము చూపాడు మరియు ప్రజల దృష్టిలో అతనికి కనికరము ఇచ్చాడు. యోసేపు చెరసాలలో దేవుని కనికరము మరియు కృపను పొందగలిగితే, అతడు చెరసాలలో ఉండకముందే దానిని అనుభవిస్తున్నాడని అర్థం.
ప్రజల నుండి మంచి విషయాలను ఆస్వాదించడానికి మరియు మన లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనకు జీవితంలో దేవుని కనికరము అవసరం. దేవుని కనికరము లేకుండా, శత్రువు నుండి అనేక తీర్పులు మరియు ఆరోపణలు మన జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
మనం పరిపూర్ణులం కాదు, అంటే పొరపాటున చేసిన మన పాపపు పనులు తీర్పుకు దారితీయవచ్చు. కానీ దేవుని కనికరము మనల్ని కాపాడుతుంది, మనల్ని నిలబెట్టేది మరియు ఆయన కృపను పొందేలా చేస్తుంది. ఈనాటి మన విషయపు లేఖనం తెలియజేస్తుంది, ఒక వ్యక్తి కనికరమును పొందాలంటే, అతడు దేవుని కనికరమును వెతకాలి.
నిర్గమకాండము, 33వ అధ్యాయం, 19వ వచనంలో, దేవుడు ఇలా అంటున్నాడు, "ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదననెను."
దేవుడు మానవుని మీద కనికరము చూపినప్పుడు, ఇతరులు పొందేందుకు కష్టపడుతున్న వాటిని అతడు ఆనందిస్తాడు.
దేవుని కనికరము మనకు ఎందుకు అవసరం?
నేను చాలా విషయాలు ప్రస్తావించినప్పటికీ, దేవుని కరుణ మనకు ఎందుకు అవసరమో నేను ఇంకా జాబితా ఇస్తాను (ఇది సమగ్ర జాబితా కాదు).
1. తీర్పుపై విజయం సాధించాలంటే మనకు దేవుని కనికరము అవసరం. (యాకోబు 2:13)
2. మన జీవితాలకు వ్యతిరేకంగా దుష్టుని చేతివ్రాతను తొలగించడానికి మనకు దేవుని కనికరము అవసరం. (కొలొస్సయులకు 2:14)
3. దేవుని కృపను మరియు ఆశీర్వాదాలను పొందాలంటే మనకు దేవుని కనికరము అవసరం.
4. మనం అజాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు మనకు దేవుని కనికరము అవసరం.
5. దేవుని నుండి మంచి విషయాలను ఆస్వాదించడానికి మనకు దేవుని కనికరము అవసరం.
6. ఆయన సన్నిధిని చేరుకోవడానికి మనకు దేవుని కనికరము అవసరం. ఆయన కనికరము లేకుండా మనం ఆయన సన్నిధిని చేరుకోలేము. (నిర్గమకాండము 25:21-22)
7. మన జీవితాలను గురించి నిందించే వ్యక్తిని నిశ్శబ్దం చేయడానికి మనకు దేవుని కనికరము అవసరం. (యోహాను 8:7-11)
8. చెడు, కష్టాలు, బాధలు మరియు మనపై గురిపెట్టే అన్ని దుష్ట కార్యములను ఆపడానికి మనకు దేవుని కనికరము అవసరం. ఇది దేవుని శక్తిని మరియు ఆశీర్వాదాలను అనుభవించడానికి మరియు ఆనందించేలా చేసే కనికరము కొరకు చేసే ప్రార్థనలు.
మార్కు 10:46-52లో గ్రుడ్డివాడైన బార్తిమయయి, "యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు" అని అరిచాడు. కరుణ కోసం కేకలు వేసాడు. మీరు కరుణకై రోధించినప్పుడు, అది దేవుని దృష్టిని పొందుతుంది. కరుణతో కూడిన రోధన ద్వారా యేసు దృష్టిని ఆకర్షించినప్పుడు, "నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు?" అని అడిగాడు. అప్పుడు "నాకు దృష్టి కావాలి" అన్నాడు. కరుణ కొరకు కేకలు వేసినప్పుడు మీ శరీరంలో అపవాదిచే దెబ్బతిన్న ఏదైనా పునరుద్ధరించగలదు.
దావీదు దేవుని కనికరము అనుభవించిన మరొక వ్యక్తి. అతడు దేవుని కనికరమును అర్థం చేసుకున్నాడు మరియు కీర్తనల పుస్తకంలో దాని గురించి మాట్లాడాడు.
దేవుని కనికరముకై దావీదు యొక్క కొన్ని కీర్తనలను నేను మీకు చూపుతాను:
• కీర్తనలు 4:1 "నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము."
• కీర్తనలు 6:2 "యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము."
• కీర్తనలు 9:13 "నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము"
• కీర్తనలు 13:5 "నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా."
• కీర్తనలు 23:6 "నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను."
• కీర్తనలు 25:7 "నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు కొనుము."
• కీర్తనలు 30:10 "యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము."
కనికరము కొరకు చేసే మొర దేవుని దృష్టిని పొందుతుంది. ఇది విడుదల ఇవ్వగలదు. ఇది బాబు చేయగలదు. ఇది సహాయపడగలదు.
• కీర్తనలు 32:10 "భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవా యందు నమ్మిక యుంచువానిని కృప ఆవరించుచున్నది."
• కీర్తనలు 33:18 "యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది."
ఈ రోజు, మీరు దేవుని కనికరము కొరకు మొఱ్ఱ పెట్టడం నాకు అవసరం. నేను ఈ కీర్తనలలో కొన్నింటిని మీతో పంచుకున్నాను, తద్వారా మీరు దేవుని కనికరము గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు. మీరు దేవుడు జోక్యం చేసుకోవాల్సిన రంగం నాకు తెలియదు, కానీ మీరు ఈ రోజు కనికరము కొరకు మొఱ్ఱ పెట్టగలిగితే మరియు ఆయన కనికరము మీకు అవసరమైన రంగాన్ని పేర్కొనగలిగితే, మీరు దేవుని కనికరమును ఆనందిస్తారు.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రా
1. దేవా, నన్ను కరుణించి నాకు సహాయం చేయి. (కీర్తనలు 51:1)
2. దేవా, నీ కరుణ నాకు చూపుము మరియు యేసు నామమున మనుష్యులచేత నాకు కనికరము కలుగునట్లు చేయుము. (కీర్తనలు 90:17)
3. దేవా, నీ కరుణ నాపై ఉండును గాక మరియు నేను వెళ్ళే ప్రతిచోటా నన్ను వెంబడించును గాక. (కీర్తనలు 23:6)
4. దేవా, నీ కరుణతో నన్ను విడిపించు మరియు యేసు నామములో నాకు సహాయం చేయి. (కీర్తనలు 79:9)
5. దేవా, యేసు నామములో నీ కరుణతో నన్ను స్వస్థపరచుము. (కీర్తనలు 6:2)
6. తండ్రీ, నీ కరుణతో, యేసు నామములో నా ఆశీర్వాదాలను, నా మహిమను మరియు నా జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్న మరణం మరియు శత్రువుల అన్ని దాడుల నుండి నన్ను విడిపించు. (కీర్తనలు 116:8)
7. దేవా, నా ప్రార్థనలను ఆలకించి నన్ను కరుణించు. నేను చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన. తండ్రీ, ఈ సమయములో నన్ను కరుణించు. ఈ ప్రార్థనలకు యేసు నామములో నాకు సమాధానాలు దయచేయి. (1 యోహాను 5:14-15)
8. తండ్రీ, నీ కరుణచేత, నాపై వచ్చిన ప్రతి నిందారోపణల స్వరమును శాంతపరచు. నా జీవితానికి వ్యతిరేకంగా, జారీ చేయబడిన ప్రతి తీర్పుపై యేసు నామములో నీ కరుణ విజయం సాధించేలా చేయి. (యాకోబు 2:13)
9. తండ్రీ, నీ కరుణతో, నా పాపాలను క్షమించి, యేసు నామములో ప్రతి రకమైన అన్యాయం నుండి నన్ను పరిశుద్ధపరచు. (1 యోహాను 1:9)
10. దేవా, ఆశీర్వాదాల పునరుద్ధరణకు మరియు యేసు నామములో నా ఆస్తులను కలిగి ఉండటానికి నాకు నీ కనికరము అవసరం. (యోవేలు 2:25)
Join our WhatsApp Channel
Most Read
● మరణించిన వ్యక్తి జీవించడం కోసం ప్రార్థిస్తున్నాడు● ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
● ప్రాచీన ఇశ్రాయేలు గృహాల నుండి పాఠాలు
● మీ పనికి (ఉద్యోగానికి) సంబంధించిన రహస్యం
● చెడు ఆలోచనల యుద్ధంలో విజయం పొందుట
● మారని సత్యం
● మీ సన్నిహిత్యాని కోల్పోకండి
కమెంట్లు