english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 1
అనుదిన మన్నా

అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 1

Saturday, 10th of February 2024
0 0 1172
Categories : అప్పు (Debt)
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, "నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పుల వాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని" ఎలీషాకు (ప్రవక్తకు) మొఱ్ఱపెట్టెను. (2 రాజులు 4:1)

1. అప్పు మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది
2 రాజులు 4:1లో, అప్పులో ఉన్న దేవుని బిడ్డను మనం చూస్తున్నాము. ఆమె తన పిల్లలను కూడా అప్పులతలకు కోల్పోయే స్థితిలో ఉంది. అప్పు మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది మరియు మిమ్మల్ని మీకంటే ఎక్కువగా అప్పులపాలు చేస్తుంది. అప్పు రెప్పటికి చెల్లించడానికి ఈరోజు పని చేసేలా చేస్తుంది.

కొందరు పౌలుకు చెల్లించడానికి పేతురు నుండి అప్పుల ఊబిలో ఉన్నారు. అప్పు సంబంధాలు, కుటుంబాలు, సంఘాలు మరియు పిలుపులను నాశనం చేసింది. కొందరు ఒక క్రెడిట్ కార్డును మరొక క్రెడిట్ కార్డుకు చెల్లించడానికి ఉపయోగిస్తారు. ఈ దుష్ట ఊబిని విచ్ఛిన్నం చేయాలి, తద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచిన మరియు చేయవలసిన కార్యమును మీరు నెరవేర్చగలరు.

2. అప్పు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది
అప్పుల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. అప్పుల వల్ల రక్తపోటు, తలనొప్పి లాంటి ఆరోగ్యం కోల్పోయిన ప్రజలు ఉన్నారు.

మరికొందరు సమయం వచ్చిందని కాకుండా అప్పుల ఒత్తిడి, బాధతో చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు; కొందరు వ్యసనాలలో మునిగిపోయారు. ఈ విషయాలు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను కూడా నా జీవితంలో అలా ఒకప్పుడు ఉన్నాను. నన్ను రక్షించిన ఆయన కృపకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు అదే కృప మిమల్ని కూడా రక్షించగలదు.

3. అప్పు మీ రూపాన్ని ప్రభావితం చేస్తుంది
అప్పుల వల్ల ఒక యవ్వన అమ్మాయి ముసలి స్త్రీలాగా, ఒక యువకుడు ముసలివానిగా చేస్తుంది.

4. అప్పు మీ గౌరవాన్ని (పరువును) దూరం చేస్తుంది
అప్పు చేయడంలో పరువు అనేది ఉండదు. మీరు అప్పు తీసుకున్నప్పుడు, మీరు వారికి విషయాలు (కొన్నిసార్లు వ్యక్తిగత విషయాలు) చెప్పాల్సివస్తుంది, తద్వారా వారు మీపై దయ చూపుతారు మరియు మీకు అప్పు ఇస్తారు. కొంత మంది పురుషులు మరియు మహిళలు తమ విలువలను, వారి గౌరవాన్ని రాజీ పడవలసిన సందర్భాలు నాకు తెలుసు. అప్పు ఇచ్చిన వ్యక్తులు వారిని దుర్భాషలాడారు కూడా.

ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. (సామెతలు 22:7)

5. అప్పు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది
కొంత మంది కేవలం నాలుకతో మాట్లాడే క్రైస్తవులు, కానీ అప్పుల కారణంగా, శత్రువు అబద్ధం మరియు తారుమారు చేయడానికి వారి నాలుకను ఉపయోగిస్తాడు. అలాంటి వారు ప్రార్థించలేరు. వారిలో భయం ప్రవేశించింది. అప్పు బాధించేది మరియు నాశనం చేసేది.

అయితే, నేను మీకు మంచి శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. తన బిడ్డలు రుణగ్రస్తులుగా ఉండాలని యెహోవా కోరుకోడు. ఆయన వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన ప్రజలు ఇతరులకు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు చేసే వారిగా ఉండరు (ద్వితీయోపదేశకాండము 15:6)

#తాళంచెవి నం.1
అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం ప్రార్థించడం

ప్రార్థన ఒక ఆధ్యాత్మిక ఆయుధం, కానీ మీరు ఫలితాలను చూసే వరకు అది ఒక ప్రత్యకమైన లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుని తుపాకీలా పదే పదే కాల్చాలి. ఏకాగ్రత లేని ప్రార్థన ఫలితం ఇవ్వదు.

ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, మీ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని ప్రార్థించడం అంటే ఏమిటి. ప్రభువే మన ప్రదాత మరియు అప్పుల నుండి బయటపడటానికి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కొందరికి, జీవించి ఉన్నట్లు కూడా కనిపించని అవకాశాల ద్వారా ఆయన అద్భుతంగా కార్యం చేస్తాడు. కొంత మందికి, ఆయన సృజనాత్మక ఆలోచనలను ఇస్తాడు. కొందరికి అది అద్భుత ధనం అవుతుంది; కొందరికి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు కావచ్చు. ప్రభువు అంది పుచ్చిన ఈ అవకాశాలపై మీరు చేయవలసింది ఒక్కటే అంటే కార్యం (పని) చేయటం.
ఒప్పుకోలు

ప్రతి ప్రార్థన అస్త్రాన్ని మీ హృదయం నుండి వచ్చేంత వరకు కనీసం ఒక నిమిషం పాటు పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి.

 

1. నా జీవితం మరియు కుటుంబం నుండి అప్పుల పర్వతం మరియు పేదరికం ఇప్పుడే యేసు నామంలో నిర్మూలించబడును గాక.

2. నా ఆర్థిక మరియు ఆస్తులను నమిలే (భుజించే) సాతాను శక్తులు యేసు నామంలో అగ్నితో కాల్చివేయబడును గాక.

3. యేసు నామంలో ఆర్థిక పరిమితుల గొలుసులు నా జీవితం నుండి విచ్ఛిన్నం చేయబడును గాక.

4. నా సమృద్ధి గురించి సంతోషించే ప్రభువు, యేసు నామంలో నా చేతుల కష్టార్జితము వర్ధిల్లును గాక.


Join our WhatsApp Channel


Most Read
● రెండవసారి చనిపోవద్దు
● అపకీర్తి గల పాపానికి ఆశ్చర్యమైన కృప అవసరం
● ప్రభువా, కలవరము నుండి నన్ను విడిపించు
● యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
● ప్రభువైన యేసు పునరుత్థానానికి సాక్ష్యమివ్వడం
● ఎదురుదెబ్బల నుండి విజయం వరకు
● ఆధ్యాత్మిక విధానాలు: సహవాస విధానము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్