అనుదిన మన్నా
వాక్యాన్ని పొందుకొవడం
Tuesday, 12th of March 2024
0
0
838
Categories :
దేవుని వాక్యం (Word of God)
ఒకసారి నేను ప్రార్థన ఫోన్ కాల్కు హాజరయ్యాను. ఒక స్త్రీ నాకు ఫోన్ చేసి రాత్రి సమయంలో దుష్టుడు తనను ఎలా వేధిస్తున్నడో చెప్పింది. నిద్రపోయే ముందు బైబిలు చదవమని నేను ఆమెకు మర్యాదపూర్వకంగా సలహా ఇచ్చాను.
వెంటనే ఆమె ప్రతి రాత్రి తన దిండు కింద బైబిలును తప్పకుండా ఉంచుకుంటానని సమాధానం ఇచ్చింది. ఇది కొందరికి హాస్యాస్పదంగా అనిపించినా, బైబిలు చదవకుండా నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు.
చాలా మంది తమ ఇళ్లలో లేదా వారి ఫోన్లలో బైబిలు యొక్క వివిధ వెర్షన్లను కలిగి ఉన్నారు, కానీ వారు దానిని చదవడానికి ఎప్పుడూ సమయం కేటాయించరు. మీరు బైబిలు కలిగి ఉండటం లేదా బైబిలు పట్టుకొవడం వల్ల దుష్టుడు భయపడడు; మీరు బైబిలు చదవడం ప్రారంభించినప్పుడు మరియు అది చెప్పేది నమ్మడం ప్రారంభించినప్పుడు మాత్రమే దుష్టుడు భయాందోళన స్థితిలోకి వెళ్ళుతాడు.
కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. (కీర్తనలు 107:19)
దేవుని ప్రజలు, కష్టాలలో ఉన్నప్పుడు, ప్రభువుకు మొఱ్ఱపెట్టిరి, ఆయన వారిని విడిపించాడని పై లేఖనం చెబుతోంది. ప్రభువు తన ప్రజలను ఎలా విడిపిస్తాడు? ఈ క్రింది వచనం చూడండి.
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. (కీర్తనలు107:20)
"ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను" అని బైబిలు చెబుతోంది. ఇప్పుడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలనుకున్నప్పుడు, ఆయన ఏమి చేస్తాడు? ఆయన తన వాక్యాన్ని పంపుతాడు. దేవుడు గుంటలలో నుండి మిమ్మల్ని విడిపించే ముందు, ఆయన తన వాక్యాన్ని పంపుతాడు.
మీరు ప్రతిరోజూ బైబిలు (దేవుని వాక్యం) చదవడం అలవాటు చేసుకోవటం అనే దానికి ఇదే కారణం. అందుకే మీరు అనుదిన మన్నా చదవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. (వాక్యాన్ని పంపే ముందు నేను తరచుగా ఎక్కువగా ప్రార్థిస్తాను). దేవుని వాక్యం మిమ్మల్ని స్వస్థపరిచే మరియు విడుదల చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఒకానొక మన సంఘ ఆరాధనలో, సంతానం లేని స్త్రీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వాగ్దానాలను పొందుకుంటున్నాను. మరో స్త్రీ తన ఫోన్‌లో మొత్తం ఇదంతా రికార్డు చేసి దాదాపు పదేళ్లుగా సంతానం లేని తన స్నేహితురాలికి పంపింది.
ఈ స్త్రీ ప్రతిరోజూ ఈ రికార్డింగ్‌ని వింటుండేది మరియు నేను ఉపయోగించిన లేఖనాలను పొందుకుంటు ప్రార్థించేది. కొన్ని నెలల్లో, ఈ స్త్రీ అద్భుతంగా గర్భం దాల్చింది. ఆమె స్నేహితురాలు మన W3 ఒకానొక సభలలో కూడా సాక్ష్యమిచ్చింది. మీరు గమనించండి, దేవుని వాక్యమే ఆమె పరిస్థితిని మార్చింది. దేవుని వాక్యపు శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
నీ కన్నుల యెదుట నుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము.
దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. (సామెతలు 4:20-22)

ప్రార్థన
తండ్రీ, నేను మీ వాక్యమును ఏ విధంగానైనా నిర్లక్ష్యం చేసినట్లయితే నన్ను క్షమించు. నీ అమూల్యమైన వాక్యాన్ని ప్రతిరోజూ చదవడానికి మరియు ధ్యానించడానికి నాకు నీ కృపను దయచేయి. ఎందుకంటే నీ వాక్యమే నాకు జీవము మరియు ఆరోగ్యము. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● కొత్త నిబంధనలో నడిచే దేవాలయము● లోకమునకు ఉప్పు
● భాషలలో మాట్లాడుట మరియు అభివృద్ధి చెందుట
● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1
● ఇతరుల కోసం ప్రార్థించడం
● కోతపు కాలం - 2
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు