english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. సంఘానికి సమయానికి ఎలా రావాలి
అనుదిన మన్నా

సంఘానికి సమయానికి ఎలా రావాలి

Tuesday, 2nd of April 2024
0 0 989
Categories : శిష్యత్వం (Discipleship)
క్రీస్తును ఆయన శిష్యునిగా వెంబడించడానికి తోటి క్రైస్తవుల గుంపుతో క్రమంగా కలుసుకోవడం చాలా అవసరం. సంఘా ఆరాధనకు క్రమం తప్పకుండా హాజరుకాకపోవడమంటే, మనం ఏమి చేయమని వాక్యం చెబుతుందో విస్మరించడమే. అయితే, ప్రతి ఆదివారం ఉదయం సమయానికి సంఘానికి వెళ్లడం మనలో చాలా మందికి నిజమైన సవాలుగా ఉంటుంది.

"సమయానికి వెళ్లాలని నాకు నిజంగా కోరిక ఉంది, కానీ ముందుగా పూర్తి చేయాల్సిన చాలా పనులు ఉంటాయి, ఇది నిజమైన పోరాటం." మీ సమస్య కూడా ఇదే అయితే, మీలాగే చాలా మంది ఒకే పడవలో ప్రయాణిస్తున్నందున అది మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టనివ్వద్దు.

ఆదివారం ఉదయం సంఘానికి వెళ్లడానికి సంవత్సరాలుగా నాకు సహాయపడిన కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. (మళ్ళీ, ఇది మిమ్మల్ని ఖండించడానికి కాదు, దేవునితో మీ నడవడికలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి.)

1. మీ నిద్ర నియమావళిలో మార్పులు చేయండి
చాలామందికి ఆదివారం ఉదయం పరుపు చుట్టడం అంటే చాలా కష్టం. మీకు దేవుడు ఇచ్చిన విశ్రాంతి దినం ‘నిద్ర దినం’గా మారకూడదు. మీకు ఇలా అనిపిస్తే, మీ కోసం నాకు పనిచేసిన కొన్ని మంచి సలహాలు ఉన్నాయి. శనివారం కొంచెం తొందరగా పడుకోండి. ఒకవేళ మీరు తగినంతగా నిద్రపోలేదని ఆందోళన చెందుతుంటే, ఆదివారం మధ్యాహ్నం నిద్రపోవడం మీకు నిజంగా సహాయపడుతుంది. త్యాగం లేకుండా ఫలితం లేదన్నది సత్యం.

"ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను." (మార్కు 1:35) క్రీడాకారులు వంటి అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా వారు ఉన్న చోటికి చేరుకోవడానికి త్యాగం యొక్క బలిపీఠం వద్ద ఏదో సాధించాలని కొన్ని పనులు చేసారు. మీ విషయంలో, ఇది మీ నిద్ర సమయాలను సర్దుబాటు చేస్తుంది. 

2. ఇంటర్నెట్/వై-ఫైని ఆఫ్ చేయండి
ఒక విధంగా చూస్తే, మీరు ఇలా చెప్పవచ్చు, "అన్ని విషయములయందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. (1 కొరింథీయులకు 10:23) 

ఇది కొంచెం కష్టాంగా అనిపించవచ్చు, కానీ ఇంటర్నెట్/Wi-Fiని ఆఫ్ చేసి, పడుకోండి! నాలాగే మీకు పిల్లలుంటే ఇష్టం ఉన్నట్లయితే నేను చెప్పేది అర్థం అవుతుంది. పిల్లలు శనివారం రాత్రి ఆలస్యంగా మేల్కొని, కొన్ని సినిమాలు చూడటం, సోషల్ మీడియాను చూడటం వంటి చేస్తారు మొదలైనవి. మొదట్లో కొన్ని నిరసనలు ఎదురైనా, కుటుంబ సభ్యులు బాగా విశ్రాంతి తీసుకుని ఆదివారం ఉదయం వెళ్లేందుకు సిద్ధమయ్యాక ఆ నిరసనలు ప్రశంసలుగా మారుతాయి.

3. శనివారం రాత్రి మీ బట్టలు ఎంచుకోండి మరియు ఐరన్ చేయండి
ఇది చాలా సమయాన్ని ఆదా చేసే గొప్ప కార్యము - ప్రత్యేకించి మీకు కుటుంబం (మరియు పిల్లలు) ఉన్నట్లయితే. శనివారం రాత్రి అన్ని బట్టలను ఎంచుకొని ఇస్త్రీ చేసి, మరుసటి రోజు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో వాటిని వేలాడదీయండి. అలాగే, ప్రతి ఒక్కరి సాక్స్, మాస్క్‌లు, బూట్లు మొదలైనవాటిని అక్కడ ఉంచండి - ఇది మరుసటి రోజు ఉదయం మీకు పిచ్చి పెనుగులాటను ఆదా చేస్తుంది.

"సంఘానికి వెళ్లడం" అంటే కేవలం ఆచార విధంగా కాదు - ఇది ఒక ప్రత్యేకమైన హక్కు. మన రక్షణ యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానం ఫలితంగా ఉంది, ఇది మనల్ని దేవునితో మరియు ఇతర క్రైస్తవులతో రాకపోకలు చేయడానికి దారితీస్తుంది. క్రీస్తు శరీరంలో భాగమయ్యే అవకాశం మనకు ఇవ్వబడింది. ఆయనను వెంబడించాలని కోరుకునే వారితో సమయాన్ని గడపడానికి మనకు అవకాశం ఉంది. మీరు ప్రతి ఆదివారం సంఘానికి హాజరు కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ ఆలోచనను కలిగి ఉండండి.

ఆదివారం ఉదయం సంఘానికి సమయానికి చేరుకోవడానికి మీకు ఏ పద్ధతులు సహాయపడతాయి? దయచేసి వాటిని క్రింద పంచుకోండి.
ప్రార్థన

ధన్యుడగు పరిశుద్దాత్మ, ఈ మార్పు సందేశాన్ని పొందడానికి నా హృదయాన్ని సిద్ధం చేయి మరియు నా కళ్ళు తెరువు. నా కుటుంబ సభ్యులు మరియు నేను ఎల్లప్పుడూ సంఘ ఆరాధనలకు సమయానికి చేరుకునేలా సహాయం చేయి. నేను నిన్ను వాక్యంతో మాత్రమే కాకుండా నా కార్యముల ద్వారా కూడా ఘనపరుస్తాను. యేసు నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● ప్రవచనాత్మక వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఏమి చేయాలి?
● ప్రవక్త ఎలీషా జీవితం- ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క నాలుగు ప్రదేశాలు - III
● సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం
● కొండలు మరియు లోయల దేవుడు
● 06 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● పరిపూర్ణ సిద్ధాంతపరమైన బోధన యొక్క ప్రాముఖ్యత
● దేవుని లాంటి ప్రేమ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్