అనుదిన మన్నా
0
0
62
ప్రభువైన యేసు పునరుత్థానానికి సాక్ష్యమివ్వడం
Sunday, 20th of April 2025
Categories :
నిజమైన సాక్షి (True Witness)
దయచేసి మీ బైబిళ్ళను నాతో అపొస్తలుల కార్యములు 4:2 కు తెరవండి: "వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడిరి."
పరిసయ్యులు, సద్దుకేయులు, ఆ కాలపు మత పెద్దలు బాధపడటం ఇక్కడ మనం చూస్తున్నాము. పునరుత్థానం చేయబడిన యేసు గురించి అపొస్తలులు బోధించినందున వారు ఒక విధమైన శాంతిని కోల్పోయారు.
ఈ రోజు కూడా, సిలువపై చనిపోతున్న యేసును గురించి మాట్లాడేటప్పుడు లోక ప్రజలకు ఎటువంటి సమస్య లేదు. వారు, "అవును, యేసు మరణించాడు చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఆయన మంచి మనిషి". కానీ ఇప్పుడు ఇక్కడ మలుపు తిరిగింది. "చూడండి, మరణించిన యేసును గుర్తుకుతెచ్చుకోండి, ఆయన తెరిగి లేచాడు" అని మీరు వారికి చెప్పినప్పుడు వారు చాలా బాధపడతారు. అక్కడే వారు "లేదు, అది సాధ్యం కాదు" అని అంటారు.
నేటికీ, లోకంలో ఒక సమూహం ఉంది, యేసు మృతులలో నుండి లేచాడని నమ్మరు. కాబట్టి, వారు తమ సొంత సిద్ధాంతాన్ని కనుగొన్నారు. వారు, "చూడండి, యేసు సిలువపై ఉన్నాడు కాని ఆయన చనిపోలేదు, ఆయన మూర్ఛపోయాడు మరియు తరువాత పునరుజ్జీవింపబడ్డాడు." ఇది నరకం యొక్క గొయ్యి నుండి అబద్ధం.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం మరియు పునరుత్థానం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వారు ఒక కథను ఎంత సౌకర్యవంతంగా కనుగొన్నారో చూడండి. నిజం ఏమిటంటే, "యేసు చనిపోయాడు, యేసు మృతులలో నుండి లేచాడు మరియు ఆయన త్వరలో రానైయున్నాడు."
పునరుత్థానం అంటే ఏమిటి? నేటికీ మనకు ఇది ఎలా వర్తిస్తుంది? ఇది కేవలం శుభాకాంక్షలు పంపడం మరియు కొన్ని మంచి చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గురించి మాత్రమేనా? ఇది కేవలం చేతులు కలుపుకోవడం మరియు మంచి సమయం గడపడం గురించి మాత్రమేనా? ఇప్పుడు, నేను వీటన్నిటికీ వ్యతిరేకం కాదు, మనం ఇవ్వని చేయవలసి ఉంది కాని దీనికి ఇంకా ఏదో ఉంది.
ప్రతి క్రైస్తవుడు ఆయన పునరుత్థానానికి సాక్షిగా పిలువబడ్డాడు.
యూదా మరణించినప్పుడు, అక్కడ 11 మంది అపొస్తలులు మాత్రమే ఉన్నారు. అందువల్ల యూదాకు బదులుగా వేరే వారిని తీసుకోవాలని అపొస్తలులు సమావేశం కావాలని పిలుపునిచ్చారు.
అపొస్తలుల కార్యములు 1:22 లో, "కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను".
ఈ వచనములో ఒక సిద్ధాంతం ఉంది, అది ఈ రోజు కూడా మనకు వర్తిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఆయన పునరుత్థానానికి సాక్షిగా పిలువబడ్డాము.
"ఓహ్, దేవుణ్ణికి స్తోత్రం, నేను స్వస్థత పొందాను, నేను ఆశీర్వదించబడ్డాను" అని చెప్పడం సరిపోదు. ఇప్పుడు, మళ్ళీ, ఇవన్నీ మంచివి కాని ఇంకేదో ఉంది. ఆయన పునరుత్థానానికి మనం సాక్షులుగా మారాలి.
సాక్ష్యమివ్వడం అంటే ఏమిటి?
సాక్ష్యమివ్వడం అంటే నాకు ఆయన గురించి తెలుసు అని చెప్పేవాడు.
గమనించండి, మనలో చాలామంది ఇప్పటికీ అడిగే స్థాయిలో ఉన్నారు. (మత్తయి 7:7 చూడండి) యేసును అనుసరించిన జనసమూహం ఎక్కువగా చేపలు మరియు రొట్టె కోసం ఆయనను అనుసరించింది. మీరు సువార్తలను చదివినట్లయితే, యేసు ప్రజలను స్వస్థపరుస్తున్నందున వారు ఒక చోట ఒకరిపై ఒకరు పడిపోతున్నారని, వారు ఒకరినొకరు తొక్కుకుంటున్నారని బైబిలు చెబుతోంది. స్వస్థత చేసే సద్గుణము యేసు నుండి పోయింది, ప్రజలు జనసమూహాని ద్వారా స్వస్థత పొందారు. వైద్యులు బహుశా వ్యాపారం నుండి బయటకు వెళ్ళారు. సహాయం చేసేవారు బహుశా యేసు కాలంలో వ్యాపారం నుండి బయటపడ్డారు.
ప్రభువైన యేసును సిలువ వేసినది ఎవరో మీకు తెలుసా? చేపలు మరియు రొట్టెలు తిన్న అదే సహచరులు. స్వస్థత మరియు విడుదల పొందిన చాలా మందిలో కొంతమంది కావచ్చు. వారు "ఆయనను సిలువ వేయండి" అని కేకలు వేసిరి. (లూకా 23:21)
ఈ రోజు కొంతమంది ఉన్నారు, ప్రతిదీ సరిగ్గా జరుగుతున్నప్పుడు, వారు "యేసుకు వందనాలు" అని చెప్తారు, కాని కష్టతరమైనప్పుడు, వారు సోషల్ మీడియాలో తమ ద్వేషపూరిత విషాన్ని ప్రేరేపిస్తారు". అలాంటి వారు యేసు శిష్యుడు కారు, కానీ వారు కేవలం మంచి వాతావరణ అభిమాని మాత్రమే. ప్రతిదీ మంచిగా ఉన్న మరియు లేకున్నా ప్రభువును మరియు ఆయన బోధను అనుసరించేవాడు శిష్యుడు.
అపొస్తలులు ఇలా అన్నారు, "జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము". (1 యోహాను 1:1)
Bible Reading: 2 Samuel 20-22
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీ పునరుత్థానానికి నన్ను నిజమైన సాక్షిగా చేయి. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● యేసు రక్తాన్ని అన్వయించడం● కృతజ్ఞత అర్పణలు
● అవిశ్వాసం
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● మన ఎంపికల ప్రభావం
● దేవుని నోటి మాటగా మారడం
● ఇది సాధారణ అభివందనము కాదు
కమెంట్లు