english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. విశ్వాసం ద్వారా పొందుకోవడం
అనుదిన మన్నా

విశ్వాసం ద్వారా పొందుకోవడం

Wednesday, 26th of June 2024
0 0 793
Categories : విశ్వాసం (Faith)
విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. (హెబ్రీయులకు 11:6)

దేవుని నుండి మనం పొందుకునేదంతా విశ్వాసం ద్వారా వస్తుంది. ఈ రోజు, నేను దేవుని నుండి విశ్వాసం ద్వారా పొందడానికి మూడు శక్తివంతమైన పద్దతులను పంచుకోవాలనుకుంటున్నాను.

1#పద్దతి
1.ఆయన ఉన్నాడని మనం యథార్థంగా, హృదయపూర్వకంగా విశ్వసించాలి. నేడు మన చుట్టూ ఉన్న లోకము నిరంతరం దేవుణ్ణి తిరస్కరిస్తోంది. ఆ అబద్ధాన్ని మనం పొందుకొకూడదు. బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: "ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది." (కీర్తనలు 19:1)

రెండవదిగా, చరిత్రలో పురుషులు మరియు స్త్రీల జీవితాలలో మరియు మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాములను మనం చూశాము.

రూతు మోయాబీయురాలైన విధవరాలు. మొదట్లో, ఆమె ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మలేదు. అయినప్పటికీ, ఆమె లోతైన నష్టం మరియు బాధ అనుభవిస్తున్నప్పటికీ, ఆమె ప్రభువును విశ్వసించింది మరియు ఆయనను తన దేవునిగా చేసుకుంది. (రూతు 1:16). మీరు లోతైన బాధ మరియు నష్టాన్ని అనుభవిస్తున్నారెమో. దేవుడు లేడని మీకు అబద్ధం చెప్పడానికి దుష్టునికి అవకాశం ఇవొద్దండి. ఆ బాధ మరియు నష్టం మిమ్మల్ని ప్రభువు నుండి దూరం చేయడానికి అనుమతించవద్దు. దానికి బదులుగా ఆయన మీద మరి ఎక్కువగా ఆధారపడండి.

2#పద్దతి
2. దేవుడు తనను శ్రద్ధగా వెదకు వారికి ప్రతిఫల మిచ్చువాడు.

రూతు శ్రద్ధగా ప్రభువును వెంబడించింది. ఆమె మోయాబు నుండి బెత్లెహెము (ఆహారపు మందిరం అని అర్థం) - దేవుని మందిరం.

రూతు విశ్వాసం పట్ల ప్రభువు ఎంతగానో సంతోషించాడు, ఆమె సర్వస్వం కోల్పోయిన అన్యజాతి స్త్రీ అయినప్పటికీ, ఆమె తన జీవితకాలంలో ఆమెను ఆశీర్వదించడమే కాకుండా, ఆమెను తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వంశంలోకి చేర్చాడు. మీ పట్ల కూడా అదే విధంగా జరగవచ్చు.

3#పద్దతి
అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. (యాకోబు 1:6-7)

"ఏదైనా దొరుకునని" అనే పదబంధాన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను: ఏదైనా దానిలో స్వస్థత, విడుదల, సంపద మొదలైనవి ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే, ఏదైనా విషయములలో సమస్తము కలిగి ఉంటుంది.

ప్రభువు నుండి నేరుగా పొందుకొవడానికి సరైన పద్దతి "విశ్వాసంతో అడగడం" ఇప్పుడు మొదట్లో, మీరు వెంటనే ఫలితాలను చూడలేరు కానీ మీరు అడగడం ద్వారా వాక్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, మీ ఆధ్యాత్మిక బలము అభివృద్ధి చెందుతుంది మరియు మీరు మీ జీవితంలో "ఏదైనా" అనే ప్రత్యక్షతను చూడటం ప్రారంభిస్తారు.

ఈ విధంగా విశ్వాసం కలిగి ఉన్న గొప్ప దాసులు మరియు దాసీలు వారి విశ్వాసాన్ని ఇలా అభివృద్ధి పరచుకున్నారు అలాగే మీరు మరియు నేను కూడా చేయవచ్చు.

చాలా సంవత్సరాల క్రితం, దేవుని గొప్ప దాసుడు D.G.S దినకరన్ గారు యాంప్లిఫైడ్ బైబిల్ నుండి వాక్యం చెప్పడం విన్నాను. అడుగుతూ ఉండండి మరియు అది మీకు ఇవ్వబడును; [భక్తితో] వెదకుతూ ఉండండి మరియు అది మీకు దొరుకును; తట్టుతూ ఉండండి మరియు ఆ [తలుపు] మీకు తీయబడును. (మత్తయి 7:7)

మీరు జాగ్రత్తగా గమనిస్తే, అసలు అనువాదం, "అడుగుతూ ఉండండి మరియు మీకు ఇవ్వబడును" అని చెబుతుంది. చాలా మంది ఒకట్రెండు రోజులు అడుగుతారు మరియు అన్నింటినీ మూటగట్టుకుంటారు. అడుగుడి మరియు అడుగుతూ ఉండండి, అది మీకు ఖచ్చితంగా ఇవ్వబడును.

ప్రార్థన
పరలోకపు తండ్రీ, నా అవిశ్వాసాన్ని క్షమించు. నా జీవిత మంత ప్రతి రోజూ నిన్ను శ్రద్ధగా వెతకడానికి నీ కృప మరియు శక్తిని నాకు దయచేయి. నువ్వే నా ప్రతిఫలం. నేను నిన్నే ఆరాధిస్తాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● 33 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆ అబద్ధాలను బయటపెట్టండి
● జీవన నియమావళి
● జూడస్ జీవితం నుండి పాఠాలు -1
● జీవ గ్రంథం
● 20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ అనుభవాలను వృథా చేయవద్దు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్