english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ బీడు పొలమును దున్నుడి
అనుదిన మన్నా

మీ బీడు పొలమును దున్నుడి

Thursday, 1st of August 2024
0 0 770
Categories : పశ్చాత్తాపం (Repentance) మానవ హృదయం (Human Heart)
ముళ్ల పొదలలో విత్తనములు చల్లక 
మీ బీడు పొలమును దున్నుడి. (యిర్మీయా 4:3)


తరచుగా మనం ఇతరుల లోపాలను లేదా అపరాధములను త్వరగా గమనిస్తుంటాము, ఇతరుల జీవితాలలో స్థిరంగా ఉండాల్సిన రంగాల కోసం కూడా ప్రార్థిస్తుంటాము. అయితే, మన హృదయాలను మనం పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

బీడు భూమి అనేది సాగు చేయని వ్యవసాయ భూమి, ప్రత్యేకించి ఇంతకు ముందు దున్నిన పొలము, కానీ నెలల తరబడి నిద్రాణంగా ఉంది. అటువంటి పొలమును దున్నడం కష్టం; బీడు పొలమును దున్నే వరకు ఉపయోగకరమైన ఏదీ పెరగదు.

మన హృదయాలు కొన్నిసార్లు బీడు పొలముల ఉంటాయి. బహుశా, మీ తండ్రి లేదా తల్లి (లేదా దగ్గరి వ్యక్తి) స్వస్థత కోసం ప్రభువు యందు విశ్వసించి మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు, కాని అలా జరగలేదు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా నెలల తరబడి ఉద్యోగం లేకుండా ఉండి ఉండవచ్చు మరియు అది మీ విశ్వాసాన్ని దెబ్బతీసింది. బహుశా మీరు సంవత్సరాలుగా దీర్ఘకాలిక సాంగత్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరు కనీసం మీ కోసం ప్రభువు ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదని మీరు నిర్ధారణకు వచ్చారు.

దేవుడు మీ హృదయంలో నూతన మరియు ఫలవంతమైన వాటిని నాటాలంటే ఈ అవిశ్వాసం యొక్క కాఠిన్యాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి మరియు దున్నాలి. హృదయపూర్వక పశ్చాత్తాపం మరియు లోతైన ఒప్పుకోలును దున్నడానికి ఇది ఒక మార్గం.

ముళ్ల పొదలలో విత్తనములు చల్లక (యిర్మీయా 4:3)
బైబిలు విత్తడం గురించి బహుగా ప్రోత్సహిస్తుంది కానీ అదే సమయంలో సరికాని స్థలాల్లో విత్తకుండా మనల్ని నిషేధిస్తుంది లేదా ఆపుతుంది.

ముళ్ళు మన హృదయాల పొలాలను ఫలించనివిగా చేస్తాయి? విత్తువాని యొక్క ఉపమానంలో, మానవ హృదయ స్థితి గురించి వివరించడానికి యేసయ్య ఒక పొలంలో ముళ్లను ఉపయోగిస్తాడు. "ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచి వేయును గనుక వాడు నిష్ఫలుడవును" (మత్తయి 13:22)

"వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచి వేయుట వలన అది నిష్ఫలమగును." (మార్కు 4:19)

"ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచిన కొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచి వేయబడి పరిపక్వముగా ఫలింపనివారు." (లూకా 8:14)

పై లేఖనాల నుండి, నాలుగు విషయాలు స్పష్టంగా ఉన్నాయి:
1. ఐహిక విచారమును 
2. ధన మోహమును 
3. ఇతరమైన అపేక్షల కోరికలు
4. ధన భోగములు

మీ హృదయ స్థితిని బట్టి, ఆ ముళ్ళు లైంగిక ప్రలోభాలు మరియు కామం, స్వీయ-భోగం, గర్వం, కోపం, స్వార్థం, ఉల్లాసము మరియు వినోదం పట్ల అలసత్వంతో కూడిన ప్రేమ, వ్యసనాలు, దురాశ మరియు ఇతర ముళ్లను సూచిస్తాయి. వీటిలో ప్రతి ఒక్కటి వాక్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దేవుడు మీలో మరియు నాలో ఫలించాలనుకుంటున్న పంటపై ప్రతి ఒక్కటి వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది.

నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి
ప్రేమయను కోత మీరు కోయుడి, 
యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక 
ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షము కురిపించునట్లు 
ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. (హొషేయ 10:12)

ప్రభువు ముందు మీరు మీ మోకాళ్లపై ఎప్పుడు చివరిసారిగా విరిగి నలిగిన సమయాన్ని వెచ్చించారు? మీ జీవితంలో బీడు పొలముల రంగాలను దున్నడానికి మీరు ఆయనను అనుమతిస్తారా? మీరు ఆయన స్వరానికి విధేయులై ఉంటారా?
ప్రార్థన
తండ్రీ, "జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము" అని నీ వాక్యం చెబుతోంది. యేసు నామంలో, నా బీడు పొలమును దున్నడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు దయచేయి.

తండ్రీ, "నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కయు వేరు చేయబడును" అని నీ వాక్యము చెబుతోంది. ఇప్పుడు ఫలించకుండా నన్ను అడ్డుకునే వాటన్నింటినీ నా హృదయం నుండి వేరు చేయి. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
● మీ మార్పును ఏది ఆపుతుందో తెలుసుకోండి
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి
● మాటల శక్తి
● రెండవసారి చనిపోవద్దు
● 14 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్