english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి?
అనుదిన మన్నా

ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి?

Sunday, 25th of August 2024
0 0 836
Categories : ఆర్థిక విడుదల (Financial Deliverance) డబ్బు నిర్వహణ (Money Management)
ఒక పాస్టర్గా, ప్రజలు తరచూ నా వద్దకు వచ్చి వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థించమని నన్ను అడుగుతారు. తరచుగా వినే ఒక ప్రశ్న "పాస్టర్ గారు; నా డబ్బు ఎక్కడికి పోతుందో నాకు తెలియడం లేదు".

ఆదాయ స్థాయి ఏమైనప్పటికీ, "నాకు కొంచెం ఎక్కువ ఉంటే, నా ఆర్ధిక వ్యవస్థతో నేను నిజంగా సంతృప్తి చెందుతాను", అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. నిజం ఏమిటంటే, మనం ఎంత సంపాదించాలో దానితో సంబంధం లేదు, కానీ మన వద్ద ఉన్నదాన్ని ఎలా నిర్వహించాలో దీనికి చాలా సంబంధం ఉంది.

ఆర్థిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మన గృహాలు, మన వివాహాలను మరియు మన ఆధ్యాత్మిక జీవితం యొక్క వాతావరణాన్నిచాలా వరకు ప్రభావితం చేస్తుంది.

ఆర్థిక సమస్యలపై చాలా వివాహాలు విడిపోయాయి. చాలా మంది ఆర్థిక సమస్యల వల్ల తమ పిలుపులను వదులుకున్నారు.

కాబట్టి, మన వ్యక్తిగత, తాత్విక మరియు భావోద్వేగ సమస్యలు మరియు బలాలు మన డబ్బు వాడకంలో ప్రతిబింబిస్తాయి. డబ్బును నిర్వహించడం ఆధ్యాత్మిక అంశం అని మనం గుర్తించాలి.

ఎవరో ఇలా అన్నారు, "మీరు అతని యొక్క చెక్ బుక్ లేదా అతని క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లను చూడటం ద్వారా ఒక పురుషుని లేదా స్త్రీ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను తెలియజేయవచ్చు. సరే, మీది ఎలా కనిపిస్తుంది? ఇది మీ వ్యక్తిగత ప్రతిబింబం కోసం ఒక ప్రశ్న.

ప్రభువైన యేసు మరే ఇతర విషయాల గురించి చెప్పిన దానికంటే డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడాడని మీకు తెలుసా? కొంత మంది బైబిల్ పండితులు ఇలా అంటారు, "యేసు చెప్పిన అన్ని వాక్యాలలో 15 శాతం డబ్బు విషయమే" - పరలోకం మరియు నరకం గురించి ఆయన బోధించిన దానికంటే ఎక్కువ.

యేసుకు డబ్బు ఎందుకు అంత ముఖ్యమైనది? ఎందుకంటె! డబ్బు ఒక ఆధ్యాత్మిక అంశం.

వర్తమాన మరియు గతంలోని మన దగ్గర ఉన్నవన్నీ దేవుని నుండి వచ్చినవే. ఆయన దానిని కలిగి ఉన్నాడు మరియు ఆయన తన ప్రయోజనాల కోసం ఉపయోగించమని మనకు అప్పగించాడు. దావీదు ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని, (1 దినవృత్తాంతములు 29:14), "సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము" అని ప్రార్థించాడు. 

ఇది తెలుసుకోవడం మరియు నమ్మడం ఆర్థిక స్వేచ్ఛ వైపు అత్యంత కీలకమైన అడుగు. (యోహాను 8:32) దేవుడు ఇవన్నీ కలిగి ఉన్నాడు, మరియు ఆయన తన సమృద్ధి నుండి మనకు ఇస్తాడు.

మనము ఆశీర్వదించబడిన మరియు ఆశీర్వదించబడాలని కోరుకునే మన వనరులు నిజంగా ఎక్కడ నుండి వచ్చాయో గుర్తుంచుకోవాలి మరియు దేవుడు మనకు ఇచ్చిన డబ్బుతో మహిమపరచడానికి ఎల్లప్పుడూ మార్గాలను వెతకాలి. ఇది ప్రవాహాన్ని ప్రవహించేలా చేస్తుంది.
ప్రార్థన
తండ్రీ దేవా, ఈ రోజు నా తలను సంమృద్ది నూనెతో అభిషేకించు మరియు నా ప్రతి ఆర్థిక పాత్ర నీ సంమృద్దితో పొంగిపోర్లనివు. యేసు నామంలో. తండ్రీ దేవా, నన్ను సరైన వ్యక్తులతో అనుసంధానించు, అది నా విధికి కారణమవుతుంది. యేసు నామంలో. దేవుడు ఇచ్చిన ప్రతి లక్ష్యాలను మరియు నా కలలను నేను సాధిస్తానని అంగీకరిస్తున్నాను. యేసు నామంలో, నా జీవితంలో పేదరికం యొక్క ప్రతి మూలాన్ని దేవుని అగ్ని ద్వారా నాశనం అవునుగాక అని నేను ఆజ్ఞాపిస్తున్నాను.

Join our WhatsApp Channel


Most Read
● మీరు ఎవరి సమాచారమును నమ్ముతారు?
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #15
● హృదయాన్ని పరిశోధిస్తాడు
● ఇది సాధారణ అభివందనము కాదు
● దేవుడు మీ శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడా?
● కేవలం ఆడంబరము కొరకు కాకుండా లోతుగా వెదకడం
● ఇది మీకు ముఖ్యమైతే, దేవునికి కూడా ముఖ్యమనే భావన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్