english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 1
అనుదిన మన్నా

మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 1

Monday, 26th of August 2024
0 0 741
Categories : ఆధ్యాత్మిక బలం (Spiritual Strength)
మహమ్మారి యొక్క ప్రభావాలలో ఒకటి, చాలా మంది ప్రజలు అరిగిపోయినట్లు మరియు పడిపోయినట్లు భావిస్తున్నారు. బాహ్యంగా ప్రతిదీ చక్కగా కనిపిస్తుంది, కానీ లోపల అవి కూలిపోయి నిరుత్సాహపడుతున్నారు. వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా లేదా వారి చుట్టూ జరుగుతున్న సంఘటనల ద్వారా వారి విశ్వాసం మునుపెన్నడూ లేని విధంగా పరీక్షించబడుతోంది.

"నాకు ఇక ప్రార్థన చేయాలని అనిపించదు, వాక్యం చదవాలని నాకు అనిపించదు, నేను చేసేదంతా నిద్రపోవటం లేదా టెలివిజన్‌ ఎక్కువగా చూడటం" అని ప్రజలు నాకు చెబుతూ వ్రాస్తున్నారు.

కొంత మంది ఒకేసారి మూడు, నాలుగు నిద్ర మాత్రలు తీసుకున్నట్లు అంగీకరించారు. ఇంకొక యువతి నాకు ఇలా వ్రాసింది, "పాస్టర్ గారు, నేను మద్యం తాగుతున్నాను, ఇలా చేసినందుకు నన్ను నేను ద్వేషిస్తున్నాను, కాని నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియదు. ఇది సరైనది కాదని నాకు తెలుసు. దయచేసి సహాయం చేయండి."

నేను ముందుకు వెళ్ళే ముందు, నేను ఇప్పుడే పేర్కొన్న ఈ వ్యక్తులు చెడ్డ వ్యక్తులు కాదని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో ఒకచోట, వారు తమ అంతర్గత ఆధ్యాత్మిక బలాన్ని కోల్పోయారు; వారు తమ అంతర్గత శక్తిని కోల్పోయారు; వారి ఆత్మీయ మనిషి చాలా బలహీనంగా మారింది, అందుకే అది సరైనది కాదని తెలిసినప్పుడు కూడా వారు ఆ పనులు చేస్తున్నారు.

మంచి శుభవార్త ఏమిటంటే, మీరు మీ ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోగలుగుతారు, తద్వారా విరోధం ఉన్నప్పటికీ, హింసలు ఉన్నప్పటికీ, మీ వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ లోకంలో చేయమని దేవుడు మిమ్మల్ని పిలిచినవన్నీ మీరు చేయగలరు.

ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవలసిన అవసరం ఏమిటి?
నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది, తద్వారా మీరు దేనినైనా ఎదుర్కోవడంలో దేవుని చిత్తాన్ని చేయవచ్చు.
నరుని యొక్క బలమైన ఆత్మ శారీరక నొప్పి లేదా ఇబ్బందుల్లో అతన్ని నిలబెట్టుకుంటుంది, కానీ బలహీనమైన మరియు విరిగిన నలిగిన ఆత్మ ఎవరు పెంచగలరు లేదా భరించగలరు? (సామెతలు 18:14)

నేను ఇటీవల ఒక నివేదికను చదివాను, "ఒక సూపర్ మోడల్ తన తొమ్మిదవ అంతస్తు బాల్కనీ నుండి తనకు తాను కిందకు పడిపోయింది." ప్రజలు వ్యాఖ్యానించడం కనిపించింది, ఈ ధైర్యవంతురాలు, అందమైన, విజయవంతమైన మహిళ, ఆమె దీన్ని చేయవలసిన అవసరం ఏమిటి. ఆమె ఇంత కఠినమైన అడుగు వేయవలసిన అవసరం ఏమిటి?

ఆరోగ్యకరమైన ఆత్మ ప్రతికూలతను జయిస్తుంది,
కానీ ఆత్మ అణచి వేయబడినప్పుడు నీవు ఏమి చేయగలవు? (సామెతలు 18:14)

సామెతలు 18:14 లో, మనము ఇప్పుడు మెసేజ్ అనువాదాన్ని చదువుతాము, అది ఆరోగ్యకరమైన ఆత్మ ప్రతికూలతను జయించగలదని చెబుతుంది, కానీ ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ  అణచి వేయబడినప్పుడు నీవు ఏమి చేయగలవు. నీవు ఏమి చేయగలవు?

ఈ రోజు నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను: "మీ ఆధ్యాత్మిక బలాన్ని నూతనముగా చేయడానికి మీరు ఏమి చేయగలరు?
బలమైన ఆత్మ అంటే ఏమిటి?

బలమైన ఆత్మ నమ్మకంగా, స్థిరపడి, కదలకుండా, దేనికైనా సిద్ధంగా ఉంటుంది. ఇది ప్రతికూల పరిస్థితులలో స్థితిస్థాపకంగా ఉంటుంది, ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది-మరియు అది ఎప్పటికీ వెనకడుగు వేయదు. శారీరక దాడులు, ఆర్థిక ఎదురుదెబ్బలు, సంబంధ సమస్యలు, జీవన ప్రగతి ఎదురుదెబ్బలు మరియు శత్రువు మీపై దాడిచేసిన దేనినైనా బలమైన ఆత్మ మీకు దేని ద్వారైనా లభిస్తుంది.

బలమైన ఆత్మ ఆత్మ ఫలాన్ని ప్రదర్శిస్తుంది. బలమైన ఆత్మ యొక్క చిహ్నము ప్రేమ, సంతోషము, సమాధానము. (గలతీయులు 5:22-23). బలమైన ఆత్మ ఎప్పుడూ వెనకడుగు వేయదు.

బైబిల్లో యోబు అనే దేవుని దాసుడు ఉన్నాడు. అతను ఆర్థిక, ఆరోగ్యం, సంబంధ మొదలైన అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నాడు. అతడు సహించడానికి మరియు చివరికి బలంగా బయటకు రావడానికి కారణమేమిటి? ఇది కేవలం బలమైన ఆత్మ. ఇది బలమైన అంతర్గత బలం.

యోబు 32:8 లో, "అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును" అని పేర్కొన్నాడు. ఇది ఆత్మీయ మనిషి యొక్క ఈ అవగాహన; అంతర్గత ఆధ్యాత్మిక బలం గురించి ఈ అవగాహన వల్లనే యోబు ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డాడు.

మంచి శుభవార్త ఏమిటంటే, అనారోగ్యం నిరుత్సాహపరచలేని, నిరుత్సాహం దానిని పడిపోలేని, భయం దానిని ఆపలేని, చెడు వార్తలు దానిని తరలించలేని మరియు ప్రతికూలత దానిని ప్రభావితం చేయని ప్రదేశానికి మీరు మీ ఆత్మను అభివృద్ధి పరచుకోవచ్చు. మీరు మీ ఆత్మను ఈ స్థాయికి పెంచుకోవచ్చు.
ఒప్పుకోలు
1. తండ్రీ దేవా, ఈ రోజు నేను విశ్వాస పదాలను భూమిలోకి విడుదల చేస్తున్నాను, ఆధ్యాత్మిక విత్తనం నా జీవితంలో ఆధ్యాత్మిక మరియు సహజ ఫలాలను ఫలింప జేస్తుంది. యేసు నామంలో.

2. నేను పరలోకం మరియు భూమి యొక్క దేవుడైన యెహోవాపై నా ఆశను, నమ్మకాన్ని ఉంచినందున నా ప్రాణాన్ని అణచివేయనివ్వను. నేను పై వాడిగా ఉందును గాని క్రింద వాడిగా ఉండను. నేను తలగా ఉందును గాని తోకగా ఉండను. నేను లోపలికి వచ్చే మరియు బయటకు వెళ్లే దివేయించబడిన వ్యక్తిని. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మొలకెత్తిన కఱ్ఱ
● ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I
● దేవుని నోటి మాటగా మారడం
● ప్రభవు శాశ్వతకాలము ఉండును
● ఇది ఒక్క పని చేయండి
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
● సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్