అనుదిన మన్నా
యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
Wednesday, 18th of September 2024
0
0
145
Categories :
అంత్య దినాలు (Endtimes)
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. (మత్తయి 10:34-36)
చాలా తప్పుగా అర్ధం చేసుకున్న ఈ భాగంలో, యేసు ప్రవక్త మీకా గురించి చెప్పుతున్నాడు (మీకా 7:6). అలాగే, యేసు ప్రస్తావించిన ఖడ్గము అక్షరాలా ఖడ్గము గురించి కాదు, ఇది ఒక చిహ్నము.
గెత్సెమనే తోటలో యేసును రక్షించడానికి పేతురు ఒక కత్తిని తీసుకొని ప్రధాన యాజకుని సేవకుడి చెవిని నరికినప్పుడు, యేసు అతనిని మందలించి, తన కత్తిని వరలో తిరిగి పెట్టుము అని చెప్పాడు, "కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు" (మత్తయి 26:52). అప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాలను అర్పించి, ప్రపంచం మొత్తం చేసిన పాపాలకు చనిపోయాడు.
చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడిగారు, "అయితే, "నేను సమాధానమును పంపడానికి రాలేదు, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు" అని యేసు ఎందుకు చెప్పాడు. యేసు ఎలాంటి ఖడ్గమును పంపడానికి వచ్చాడు?
ప్రభువైన యేసుక్రీస్తు పేర్లలో ఒకటి 'సమాధానకర్తయగు అధిపతి' (యెషయా 9:6)
యోహాను 14:27 లో, యేసు, "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి."
పై వచనాలు మరియు బైబిల్లోని ఇలాంటివి యేసు సమాధానము ఇవ్వడానికే వచ్చాడని స్పష్టం చేస్తున్నాయి - మానవుని మరియు దేవునికి మధ్య సమాధానము.
యేసు స్పష్టంగా ఇలా అన్నాడు, "6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6)
దేవుణ్ణి తిరస్కరించేవారు మరియు యేసు ద్వారా రక్షణానికి ఏకైక మార్గం దేవునితో నిరంతరం యుద్ధంలో పాల్గొంటారు. కానీ పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వచ్చిన వారు దేవునితో సమాధానము పొందుతారు.
ఈ అంత్యదినాల సమయాల్లో, మంచి మరియు చెడు, క్రీస్తు మరియు క్రీస్తు విరోధి, క్రీస్తును తమ ఏకైక రక్షకుడిగా అంగీకరించిన వారికి మరియు అంగీకరించని వారికి మధ్య యుద్ధము ఉంటుంది. చాలా సార్లు ఈ సమూహాలు ఒక కుటుంబంలో ఉన్నాయి, అందులో కొందరు విశ్వాసులు మరియు మరికొందరు కాదు.
మత్తయి 10:34-36లో, యేసు భూమి మీదికి సమాధానమును పంపడానికి కాదు, ఖడ్గము అనే అనే విభజించే ఆయుధం అని చెప్పాడు. ఆయన భూమిని సందర్శించిన ఫలితంగా, కొంత మంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటారు, మరియు మానవుని యొక్క శత్రువులు అతని ఇంటిలోనే ఉండవచ్చు.
క్రీస్తును అనుసరించడానికి ఎంచుకునే చాలా మంది తమ కుటుంబ సభ్యులచే తరచుగా ద్వేషించబడుతారు. ప్రభువును నిజంగా అనుసరించే మూల్యం ఇది. మన కుటుంబం పట్ల మనకున్న ప్రేమ కూడా ఆయన పట్ల మనకున్న ప్రేమ కన్నా గొప్పది కాదని ప్రభువైన యేసు స్పష్టంగా పేర్కొన్నాడు. (మత్తయి 10:37 చదవండి)
చరిత్ర అంతటా హింసను సమర్థించమని ఈ భాగాన్ని విజ్ఞప్తి చేసిన వారు తమ హింసాత్మక ఆకాంక్షలకు తగినట్లుగా దాన్ని వక్రీకరిస్తున్నారు.

ప్రార్థన
తండ్రీ, నీ వాక్యం నాకు ఇచ్చే స్పష్టత, ప్రోత్సాహం మరియు ఆశకు వందనాలు.తండ్రీ, నేను అనుదినం నీ వాక్యాన్ని చదివేటప్పుడు నీతో నా సంబంధాన్ని మరింతగా పెంచుకోవడంలో నాకు సహాయం చేయి.తండ్రీ, నీ వాక్యం ద్వారా నిన్ను నీవు కనపరచుకో మరియు నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. నా స్వంత బుద్దిపై ఆధారపడకుండా ఉండటానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్
Join our WhatsApp Channel
Most Read
● ఇటు అటు పరిగెత్తవద్దు● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● 21 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
● దానియేలు ఉపవాసం
● మాకు కాదు
● హామీ గల సంతృప్తి
కమెంట్లు