english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
అనుదిన మన్నా

దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1

Saturday, 21st of September 2024
0 0 509
Categories : భావోద్వేగాలు (Emotions) శిష్యత్వం (Discipleship)
"మొదట దేవుడు, రెండవది కుటుంబం మరియు మూడవది పని" అనే సామెతను మనం సాధారణంగా విన్నాము. అయితే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏమిటి?

మొదట, మనం గ్రహించుకోవల్సిన విషయం ఏమిటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వము లేదా చేయలేము. ఆయన మొదటివాడు.
"అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు." (ప్రకటన 1:8)

కాబట్టి, వాస్తవంగా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏమిటి?
ఒక క్రైస్తవునిగా, మన జీవితంలోని ప్రతి రంగంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసిన అనేక రంగాలు ఉన్నాయి.

1. మీ భావోద్వేగాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం
దావీదు యుద్ధంలో గొప్ప విజయం సాధించాడు. కానీ విషయం ఏమిటంటే, అతడు తన సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన తన సొంత కుమారున్ని అబ్షాలోముపై యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో అబ్షాలోము చంపబడ్డాడు.

ఒక తండ్రిగా, దావీదు గొప్ప మానసిక వేదనకు గురవుతున్నాడు, కాని అతడు తప్పుగా ఉన్న భావోద్వేగాలను పొందుకోవడం ద్వారా, తన ప్రజలు ఇంత గొప్ప మూల్యంకు తెచ్చిన విజయాన్ని అతడు అభినందించ లేదు. అతని భావాలు అతన్ని బంధించమని చెప్పింది.

తన ప్రజలు ధైర్యంగా పోరాడకపోతే అతని కుటుంబ సభ్యులు సజీవంగా ఉండరని దావీదు యొక్క అధిపతి యోవాబు అతనికి గుర్తు చేశాడు. తన తప్పుగా ఉన్న భావోద్వేగాలను జయించి ప్రజలను అభినందించాలని యోవాబు తెలివిగా దావీదును కోరాడు. బదులుగా, దావీదు సరైనది ఏమిటో తన అవగాహన కంటే పెద్దదిగా భావించాడు.

రాజు (దావీదు) "గుమ్మములో కూర్చున్నాడను" మాట జనులందరు విని, రాజును దర్శింప వచ్చిరిగాని ఇశ్రాయేలువారు తమ తమ యిండ్లకు పారిపోయిరి. (2 సమూయేలు 19:8)

తెలివైన సలహాలను పాటించడం ద్వారా మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, మిగతా విషయాలన్నీ వాటి సరైన స్థలంలోకి రాగలుగుతాయి.

ప్రతి రోజు, మనలో చాలా మంది సవాళ్లు లేదా కఠినమైన నిర్ణయాలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు సమస్య ఏమిటంటే, మనము దేవుని వాక్యం ప్రకారం వాటికి ప్రతిస్పందిస్తామా లేదా మనం మానసికంగా స్పందిస్తామా?

మానసికంగా స్పందించడమే మన ప్రాథమిక మానవ స్వభావం. భావోద్వేగాలు మిమ్మల్ని రోలర్ కోస్టర్ సవారికి మాత్రమే తీసుకువెళతాయి. ఏదేమైనా, దేవుని వాక్యాన్ని పరిస్థితికి అనుగుణంగా వర్తింపజేయడం ద్వారా, మన భావోద్వేగాలను బాగా నిర్వహించవచ్చు.

కొన్నిసార్లు, ఒక నిర్దిష్ట పరిస్థితికి లేఖనాన్ని వర్తింపచేయడం కష్టం. అలాంటి సందర్భాల్లో, "యేసు ఏమి చేస్తాడు?" అనే ప్రశ్న అడగండి. ఎల్లప్పుడూ ఎత్తైన రహదారిని ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల మీరు మీ భావోద్వేగాలను నిర్వహించే విధానంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వగలరు.

నా క్రైస్తవ నడవడికలో నేను విజయవంతం కాలేదని నేను అంగీకరించాలి, కాని నేను నా మార్గంలో ఉన్నాను. దయచేసి మీ ప్రార్థనలలో నన్ను గుర్తించుకొండి. ఎవరో చాలా తెలివిగా ఇలా అన్నారు, "దేవునికి మొదటి స్థానం ఇవ్వండి మరియు మీరు ఎప్పటికీ చివరివారు కాలేరు."
ప్రార్థన
తండ్రీ, మానసికంగా స్పందించకుండా నీ వాక్యముపై ఆధారపడటానికి నాకు శక్తినివ్వు. నా భావాలకు మించి జీవించడంలో నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 4
● ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
● దైవికమైన సమాధానము ఎలా పొందాలి
● 18 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● శీర్షిక: కొంత మట్టుకు రాజి పడటం
● లోకమునకు ఉప్ప లేదా ఉప్పు స్తంభం
● క్రీస్తులో రాజులు మరియు యాజకులు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్