అనుదిన మన్నా
మూడు పరిధులు (రాజ్యాలు)
Saturday, 12th of October 2024
1
0
124
Categories :
నరకం (Hell)
యేసయ్య నామము (Name of Jesus)
కింది వచనాలను చాలా జాగ్రత్తగా చదవండి:
మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని. అయితే, "పరలోకమందు గాని భూమి మీదగాని భూమి క్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను." (ప్రకటన 5:2-3)
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును (ఫిలిప్పీయులకు 2:10)
పై లేఖనాలు మనకు మూడు రాజ్యాలను గురించి తెలియజేస్తుంది
పరలోకము
భూమి
భూమి క్రింద (పాతాళము)
పరలోకంలోని విషయాలు - దేవుని సింహాసనం ఉన్న ఆధ్యాత్మిక పరిధిని సూచిస్తుంది, దీనిని "మూడవ ఆకాశము" అని కూడా అంటారు (2 కొరింథీయులు 12:2). ఇది దేవుడు, దేవదూతలు మరియు పవిత్రుల నివాసం.
భూమి మీద గల విషయాలు - మనుషులు, జంతువులు మొదలైనవి ఉన్నాయి
భూమి క్రింద ఉన్న విషయాలు (పాతాళము లేదా నరకము) - తీర్పు దినము కోసం ఎదురుచూస్తున్నప్పుడు పడిపోయిన దేవదూతలు చీకటి గొలుసులతో బంధించబడిన గదులను కలిగి ఉంటుంది. (2 పేతురు 2:4 చదవండి)
క్రొత్త నిబంధన ప్రకారం, కొనిపోబడిన పురుషులు మరియు స్త్రీల యొక్క అనీతిమంతుల ప్రాణాలు మరియు ఆత్మలు ఇక్కడ ఉన్నాయి.
ప్రభువైన యేసు క్రీస్తు మృతులలో నుండి లేపబడిన తరువాత, తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఎఫెసీయులకు 1:20; ఫిలిప్పీయులు 2:9 –11 చదవండి).
తండ్రియైన దేవుడు యేసుకు ప్రతి నామ మునకు పైనామమును మాత్రమే ఇవ్వలేదు, కానీ యేసు నామమున, పరలోకము, భూమి, మరియు పాతాళం (నరకం) అనే మూడు ప్రపంచాలలోని ప్రతి జీవి - యేసుక్రీస్తు ప్రభువని మరియు సాష్టాంగపడి ఒప్పుకోవాలి.
దేవుడు కూడా ప్రభువు యేసును ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండ బెట్టుకొని యున్నాడు, మరియు సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి యున్నాడు. (ఎఫెసీయులు 1:19–22 చదవండి).
దీని అర్థం యేసు నామంలో ప్రార్ధించడం చాలా శక్తివంతమైనది. మనం యేసు నామంలో ప్రార్ధించినప్పుడు, మనము మూడు రాజ్యాలలో ఆయన అధికారంతో ప్రార్థిస్తున్నాము. నీకు మరియు నాకు వేరే నామము అవసరం లేదు - యేసయ్య నామము తప్ప.

ప్రార్థన
తండ్రీ, నేను యేసు నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామంలో, నేను క్రీస్తు యేసులో దేవుని నీతిమంతుడను. యేసు నామంలో, నేను ఎక్కడికి వెళ్లినా దేవుని కృప నన్ను ఒక డాలుగా చుట్టుముడుతుంది. నా జీవితం ఇకపై ఒకేలా ఉండబోదు.
Join our WhatsApp Channel
Most Read
● క్రీస్తు సమాధిని జయించాడు● భయపడకుము
● అద్భుతాలలో పని చేయుట: కీ#2
● దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
● మానవుని ప్రశంసల కంటే దేవుని ప్రతిఫలాన్ని కోరడం
● సమాధానము - దేవుని రహస్య ఆయుధం
● మీ విధిని నాశనం చేయకండి!
కమెంట్లు