అనుదిన మన్నా
0
0
160
ప్రేమ - విజయానికి నాంది - 2
Sunday, 31st of August 2025
Categories :
ప్రేమ (Love)
లేఖనములో చెప్పబడినట్లుగా ప్రేమ భావోద్వేగమైన భావము కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం; ఇది ప్రధానంగా క్రియ పదం. ఇది మీకు నిక్కపొడుచుకోవటం ఇచ్చే భావోద్వేగం మాత్రమే కాదు. "మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించాలని" లేఖనం మనకు స్పష్టంగా ఆదేశిస్తుంది (1 యోహాను 3:18)
చాలా తరచుగా మనం మన స్నేహితులను ఎంచుకుంటాము ఎందుకంటే వారు మనకు తగినట్టుగా సరిపోతారని. వారితో ఉండటం చాలా సులభం, కాబట్టి వారిని ఆస్వాదించడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది సుఖవంతంగా ఉంటుంది. కానీ నిజమైన ప్రేమ అంటే కరుణ, జాలి (దయ) మరియు మరొకరి శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించడం. ఇది నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది మరియు సౌలభ్యం మీద కాదు.
మనం విరిగి నలిగిన, పాపంతో నిండిన లోకములో, మనం కలిసి జీవించడం కష్టంగా భావించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు; ప్రేమించడం కష్టంగా ఉండే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. మన సహజమైన మానవ ధోరణే ఇతర మార్గంలో పరుగెత్తడం, వీలైనంత వరకు వాటిని నివారించడం.
దేవుని వాక్యం మనకు సవాలు చేస్తుంది, "మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా, మీకు మేలు చేయువారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా". (లూకా 6:32-33)
దేవుడు మీ జీవితంలో ఉంచిన కష్టమైన వ్యక్తులను ప్రేమించాలంటే, దేవుడు ఉచితంగా ఇచ్చే కృప మీకు అవసరం.
రోమీయులకు 5:5 ఇలా సెలవిస్తుంది, "మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది." మనం పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, దేవుని ప్రేమ మన ఆత్మలలోకి లోతుగా పంచబడుతుంది. ఇది వేరే విధంగా జరగదు. మన చుట్టూ ఉన్న కష్టతరమైన వ్యక్తులను ప్రేమించడంలో మనకు సహాయపడే కృప ఇది.
మనం ఇలా చేసినప్పుడు, దేవుడు మహిమపరచబడతాడు మరియు మన హృదయాలు లోతైన సంతృప్తిని పొందుతాయి. ఇది నిస్సందేహంగా అధిక విలువైనది మరియు ఇది విజయానికి నాంది కావడానికి కారణం.
Bible Reading: Lamentations 2-4

ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీ ఆత్మను నాపై కుమ్మరించుము. పరిశుద్దాత్మ వచ్చి, నా జీవితంలోని ప్రతి రంగాన్ని ముట్టు. ఆమేన్
Join our WhatsApp Channel

Most Read
● దేవుని స్వరాన్ని విశ్వసించే శక్తి● మీరు చెల్లించాల్సిన వెల
● దేవదూతల సైన్యం మన పక్షమున ఉన్నారు
● దోషానికి సంపూర్ణ పరిష్కారం
● జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం
● సంసిద్ధత లేని లోకములో సంసిద్ధముగా ఉండడం
● 09 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు