అనుదిన మన్నా
ప్రారంభ దశలో దేవుణ్ణి స్తుతించండి
Tuesday, 12th of November 2024
1
0
106
Categories :
స్తుతి (Praise)
మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. (ఫిలిప్పీయులకు 1:6)
బైబిలు ఎజ్రా 3:10-11లో ఇలా చెబుతోంది, "శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా..... నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి, వీరు వంతు చొప్పున కూడియెహోవా దయాళుడు, ఇశ్రాయేలీ యుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులంద రును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి."
వారు ఎందుకు అలా చేశారని మీరు ఆశ్చర్యపోవచ్చు. పునాదులు మాత్రమే వేయబడ్డాయి. మందిరము ఇప్పటికీ నిర్మించబడలేదు. వారు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అయినను మందిరము నిర్మించబడక ముందే వారు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు? మీరు గమనించాలని నేను కోరుకునే కొన్ని గొప్ప గుప్త రహస్యాలు ఉన్నాయి.
స్తుతి అనేది విశ్వాసం యొక్క కార్యం
ఇది ఇలా చెబుతోంది, "ప్రభువా, నీవు ప్రారంభించినది, నీవు చేయగలవని మరియు పూర్తి చేస్తావని నేను నమ్ముతున్నాను. నాకు నీ ప్రణాళికలు ఇచ్చినందుకు వందనాలు, ఎందుకంటే నీ ప్రణాళికలు ఎల్లప్పుడూ నెరవేరుతాయి." మీరు క్రొత్తదాన్ని ప్రారంభించినప్పుడు, సందేహాలు మీ మనస్సుపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. "ఈ కార్యం విజయవంతం అవుతుందా?" అలాంటి సమయాల్లో, ప్రభువును స్తుతించడం ప్రారంభించండి, చిన్న ప్రారంభానికి వందనాలు చెప్పండి. మీరు మరింత అద్భుతమైన విషయాలు చూస్తారు.
స్తుతులు మిమ్మల్ని బలపరుస్తుంది
నెహెమ్యా తన ప్రజలకు, "యెహోవా యందు ఆనందించుట వలన మీరు బల మొందుదురు". (నెహెమ్యా 8:10). మీరు మీ ఆనందాన్ని కోల్పోతే, మీరు మీ బలాన్ని కూడా కోల్పోతారు. మీరు మీ బలాన్ని కోల్పోతే, మీ శత్రువుపై విజయం గల శక్తిని మీరు కోల్పోతారు. మీ శత్రువుపై విజయం గల శక్తిని మీరు కోల్పోతే, మీరు ఓడిపోతారు. బైబిలు ఇలా చెబుతోంది, "అబ్రాహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను" (రోమీయులకు 4:20)
స్తుతులు మీ వాతావరణాన్ని మారుస్తుంది
మట్టి, రాయి మరియు సిమెంట్ మరియు పాక్షికంగా నిర్మించిబడిన నిర్మాణాన్ని ఒకసారి ఊహించండి మరియు అలాంటి సమయంలో, ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మీరు దేవుణ్ణి స్తుతించినప్పుడు, మీ సమస్యలు మారనట్లు అనిపించవచ్చు, కానీ మీ దృక్పథం ఖచ్చితంగా మారుతుంది. సహజంగా చెప్పాలంటే, మీరు తొలిదశలో దేవుణ్ణి స్తుతించినప్పుడు, మీరు బాగా పని చేస్తారు, మరియు పని త్వరగా మరియు వేగంగా పూర్తవుతుంది. మీ విశ్వాసం బలపడుతుంది, మరియు మీరు చేస్తున్న పనిలో దేవుడు మీతో ఉంటాడని మీకు తెలుస్తుంది.

ప్రార్థన
యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను.
Join our WhatsApp Channel
Most Read
● మీ సౌలభ్యము నుండి బయటపడండి● ఆ వాక్యన్ని పొందుకునట
● సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం
● ప్రభువు యొద్దకు తిరిగి వెళ్దాం
● 34 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దైవికమైన సమాధానము ఎలా పొందాలి
● 14 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు