దేవా, నీ చిత్తమే నెరవేరును గాక
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. (మత్తయి 6:10)
దేవుని చిత్తం నెరవేరాలని మనం ప్రార్థించినప్పుడు, ఆయన రాజ్యాన్ని స్థాపించమని మరియు మన జీవితములో ఆయన సంపూర్ణ ప్రణాళికలను అమలు చేయమని పరోక్షంగా ఆయనను వేడుకుంటున్నాము.
దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థించినప్పుడు మన దృక్పథం మారుతుంది. ఆయన చిత్తం యాంత్రికంగా మన అవసరాలను తీరుస్తుంది, కాబట్టి మన స్వంత చిత్తం కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం నెరవేరాలని మనము ప్రార్థించినప్పుడు మన "స్వంత", అహంకారం మరియు పొగరు సిలువ మీద వేయబడతాయి.
దేవుని చిత్తం కార్యరూపం దాల్చడానికి ముందు భూమి యందు ప్రార్థించాలి. మన ప్రార్థన దేవుని ఆహ్వానించకపోతే, ఆయన అడుగు పెట్టడు లేదా వేయడు.
దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి?
1. ఒకవేళ మీకు దేవుని చిత్తం తెలుసుకోకపోతే, దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థించడం కష్టం
2 రాజులు 4:33-35లో, ప్రవక్త ఎలీషా మరియు స్త్రీకి బాలుడు అకాల మరణం చెందడం దేవుని చిత్తం కాదని తెలుసు, కాబట్టి ప్రవక్త ఎలీషా బాలుడు తిరిగి జీవించే వరకు తీవ్రంగా ప్రార్థించాడు. మీకు దేవుని చిత్తం తెలియనప్పుడు, జీవితం పొందుపరిచే దేనినైనా మీరు అంగీకరిస్తారు.
2. ఒకవేళ మీకు దేవుని చిత్తం తెలుసుకోకపోతే, మీరు పాపం చేయడానికి శోదించబడినప్పుడు మీరు విఫలం కావచ్చు
మత్తయి 4:1-11లో, యేసు అపవాది యొక్క ప్రలోభాల మీద విజయం పొందాడు ఎందుకంటే ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. ఒకానొక సమయంలో, అపవాది దేవుని వాక్యాన్ని తప్పుగా సూచించాడు, కానీ యేసయ్య వానిని ఎదురించాడు. మీకు దేవుని చిత్తం తెలియకపోతే, అపవాది మీ జీవితంతో ఆటలు ఆడుతాడు మరియు మిమ్మల్ని ఉచ్చులో పడవేస్తాడు.
3. మన భద్రత, ఆశీర్వాదం మరియు సంపద దేవుని చిత్తంలో ఉన్నాయి, మనము దేవుని చిత్తము తెలుసుకోకపోతే, అపవాది మన నుండి ప్రయోజనం పొందవచ్చు.
"ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. (3 యోహాను 2) అనారోగ్యం తమ జీవితానికి సంబంధించిన దేవుని చిత్తంలో భాగమని కొందరు అనుకుంటారు. పేదరికంలో నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడని కొందరు భావిస్తారు. వారు అపవాది బాధలను స్వీకరించి మోసపోయారు. మీ జీవితములో దేవుని చిత్తానికి విరుధ్ధంగా ఉన్న దేనినైనా ప్రతిఘటించే సమయం ఇది.
4. మనం ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడే ఆయన చిత్తానికి లోబడి జీవించగలము
మనకు దేవుని చిత్తం తెలియకపొతే, యాంత్రికంగా ఆయన చిత్తానికి విరుద్ధంగా పనులు చేస్తాము.
అప్పుడు నేను, "గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని” (హెబ్రీయులకు 10:7)
5. మనం దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోనప్పుడల్లా, అపవాది మన మీద దాడి చేయడానికి పూనుకుంటాడు
అపవాదికి చోటియ్యకుడి. (ఎఫెసీయులుకు 4:27)
6. మనం దేవుని చిత్తానికి బయట జీవిస్తున్నప్పుడు అపవాది మనల్ని నిందిస్తాడు
మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకు డైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. (జెకర్యా 3:1)
7. దేవుడు తన చిత్తానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు
3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. (యాకోబు 4:3). మన ప్రార్థనలు దేవుని చిత్తానికి బయట ఉన్నప్పుడు మనము సమాధానాలు పొందుకోలేము.
8. దేవుని చిత్తానికి వెలుపల లేదు బయట మనము మన లక్ష్యాలను నెరవేర్చలేము
4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలిం పరు. 5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. 6 ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. 7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. (యోహాను 15:4-7)
దేవుని చిత్తం మరియు మీ జీవితానికి సంబంధించిన ప్రణాళికలను తెలుసుకోవడానికి 2 ప్రధానమైన సంగతులు.
మీరు దేవునితో మీ బంధాన్ని పెంపొందించుకోవాలి. మీరు ఆయనను గురించి తెలుసుకోవాలి మరియు తెలుసుకోవడం కోసమే ఆయనను తెలుసుకోకూడదు.
మీరు ఆయన వాక్యంలో సమయాన్ని వెచ్చించడం, ప్రార్థన కోసం సమయాన్ని వెచ్చించడం మరియు సంఘ ఆరాధనలో పాల్గొనడానికి మరియు J-12 నాయకుని క్రింద ఉండేందుకు మీరు చేయగలిగిన ప్రతి అవకాశాన్ని తీసుకోవడం ద్వారా మీరు ఆ బంధాన్ని ఉత్తమంగా పెంపొందించుకుంటారు. మీరు మీ జీవితంలో ఈ క్రమశిక్షణలను వెతికినప్పుడు, దేవుడు ఆయన ప్రణాళికను మీకు వెల్లడించడానికి మొదటి అడుగు వేయడం ప్రారంభిస్తాడు.
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవా యందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (సామెతలు 3:5-6)
- దేవుని చిత్తమని మీకు ఇప్పటికే తెలిసిన దానికి లోబడి జీవించడం
చాలా మంది ప్రజలు తమ జీవితాల పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ 98 శాతం ఆయన చిత్తం ఇప్పటికే ఆయన వాక్యం ద్వారా జాగ్రత్తగా వెల్లడి చేయబడిందనే వాస్తవాన్ని వారు పట్టించుకోరు. దేవుడు తన చిత్తములోని అనేక అంశాల గురించి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఉదాహరణకు, వ్యభిచారముకు దూరంగా ఉండాలనేది స్పష్టంగా ఆయన ప్రణాళిక.
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 4:3).
దేవుడు తన చిత్తమని మనకు స్పష్టంగా చూపించిన సంగతులకు మనం లోబడియుండకపోతే, మన జీవితాల కోసం ఆయన ప్రణాళికకు సంబంధించి మరిన్ని సమాచారాన్ని ఆయన ఎందుకు వెల్లడిస్తాడని మనం ఎందుకు అనుకుంటాము?
Bible Reading Plan : Matthew : 25 - 28
1. తండ్రీ, నీ చిత్తము యేసు నామమున నా జీవితములో నెరవేరును గాక.
2. నా పరలోకపు తండ్రి నా జీవితంలో నాటని ప్రతిదీ యేసు నామములో అగ్ని ద్వారా నాశనం అవును గాక.
3. నేను వర్ధిల్లాలని దేవుని చిత్తము; అందువల్ల, యేసు నామములో నా జీవితంలో వైఫల్యం, నష్టం మరియు ఆలస్యం యొక్క కార్యాలను నేను నిషేధిసున్నాను.
4. నేను మంచి ఆరోగ్యముగా ఉండుట దేవుని చిత్తము; అందువల్ల, యేసు నామములో నా శరీరంలో ఏదైనా జబ్బు మరియు వ్యాధి నిక్షేపాలను నేను నాశనం చేస్తున్నాన.
5. నేను పుచ్చుకునే వానిగా కాకుండా ఇచ్చే వాడిగా ఉండాలని దేవుని చిత్తం; అందువల్ల, యేసు నామములో నన్ను అప్పుల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్న అపవాది కార్యాలను నేను నాశనం చేస్తున్నాను.
6. యేసు రక్తం ద్వారా, నాకు విరుద్ధమైన ప్రతి వ్యవస్థ యేసు నామములో సిలువకు వ్రేలాడదీయబడును గాక.
7. యేసు నామములో నన్ను లక్ష్యంగా చేసుకున్న మంత్రాలు, భవిష్యత్తు ప్రకటన, శాపాలు మరియు చెడును నేను వ్యాపింజేస్తున్నాను.
8. నేను ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో నా జీవితం నుండి చెడు, మరణం, అవమానం, నష్టం, బాధ, తిరస్కరణ మరియు ఆలస్యం తొలగించబడును గాక.
9. నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు మరియు యేసు నామములో నాకు వ్యతిరేకంగా లేచిన ప్రతి నాలుకను నేను ఖండిస్తున్నాను.
10. ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మరియు యేసు నామములో భూమి మీద నీ రాజ్యాన్ని విస్తరింప జేయడానికి నాకు అధికారం కలుగజేయి.