english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 11 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
అనుదిన మన్నా

11 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన

Monday, 2nd of December 2024
0 0 345
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)

కృపచేత లేవనెత్తెను

దరిద్రులను మంటిలో నుండి యెత్తు వాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. (1 సమూయేలు 2:8)

"కృపచేత లేవనెత్తెను" అనే పదానికి మరొక పదం "దైవ ఔన్నత్యం (ఉన్నత స్థలము)." మీ ప్రస్తుత స్థాయి విజయంతో సంబంధం లేకుండా ఉంటే, మరొక ఉన్నతమైన మరియు మెరుగైన స్థాయి ఉంది. మనము ఒక వెలుగు వలె ప్రకాశింపజేయాలి, మరియు మన మార్గం ఖచ్చితమైన దినము వరకు ప్రకాశవంతంగా మరియు వెలుగుగా ప్రకాశిస్తుంది. (మత్తయి 5:14; సామెతలు 4:18)

కృప అనేది దేవుని నుండి పొందే ఒక అనర్హమైన అనుగ్రహము. మనకు దీనికై అర్హత లేదు; మనము దాని కోసం పని చేయలేము. ఇది ఆయన మనకు అందించే ఒక సంగతి మాత్రమే. లేఖనం యేసును "కృప మరియు సత్యముతో నిండిన" వ్యక్తిగా వర్ణిస్తుంది (యోహాను 1:14, యోహాను 1:17). అనారోగ్య వారిని స్వస్థపరచడం, చనిపోయినవారిని లేపడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం మరియు భార్యాభర్తల అవమానాన్ని కప్పిపుచ్చడం ద్వారా యేసుక్రీస్తు కనాను వివాహములో దేవుని కృపను స్పష్టంగా బయలుపరిచాడు. దేవుని కృప ప్రజల జీవితాలలో ఏమి చేయగలదో యేసయ్య చేసిన ప్రతిదీ మనకు చూపించింది. కాబట్టి మిత్రులారా మీకు దేవుని కృప కావాలి.

దేవుని కృప మనకు అవసరమా? దేవుని కృప మనిషి జీవితంలో ఏమి చేయగలదు? కృప లోపిస్తే ఏమవుతుంది?

దేవుని కృప యొక్క ప్రాముఖ్యత
1. మీ యందలి మానవ బలం విఫలమైనప్పుడు దేవుని కృప అవసరము
మీ జీవితంలో ఒక సంఘటన వస్తుంది, అక్కడ మీ బలం మిమ్మల్ని విఫలం చేస్తుంది. ఈ సమయంలో, 
 మీకై మీరు సహాయం చేసుకోలేరు మరియు మీరు పడిపోవడానికి ఇష్టపడనందున మీరు దేవుని మీద మాత్రమే ఆధారపడగలరు. మీరు ఈ స్థితికి చేరుకున్నట్లయితే, 2 కొరింథీయులు 12:9 జ్ఞాపకం ఉంచుకోండి, "అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె." 

2. అసాధ్యం అనిపించే కార్యములను చేపట్టాలంటే దేవుని కృప అవసరము
అప్పుడతడు నాతో ఇట్లనెను, "జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. 7 గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును." (జెకర్యా 4:6-7)

3. ఆశలన్నీ కోల్పోయినప్పుడు దేవుని కృప అవసరము
సీమోను, "ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని" ఆయనతో చెప్పెను. (లూకా 5:5). ఆశలన్నీ కోల్పోయినప్పుడు, దేవుడు పేతురుకు చేసిన విధంగా అసాధ్యమైన వాటిని చేయగలడు.

4. మీ నుండి మంచి ఏమీ రాదని ప్రజలు భావించినప్పుడు దేవుని కృప అవసరము
అందుకు నతనయేలు, "నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా?" అని అతని నడుగగా, "వచ్చి చూడుమని" ఫిలిప్పు అతనితో అనెను. (యోహాను 1:46)

అతడు (గిద్యోను) "చిత్తము నా యేలిన వాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని" ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి? 16 "నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని" సెలవిచ్చెను.” (న్యాయాధిపతులు 6:15-16)

5. మీరు అర్హత పొందని దీవెనలు పొందడానికి దేవుని కృప అవసరము
మీరు దేనిని గూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. (యోహాను 4:38)

6. మీరు గొప్ప కార్యములు చేయాలనుకున్నప్పుడు దేవుని కృప అవసరము
" నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (యోహాను 14:12)

ఆయన మనకు తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు; అందువలన, ఎవరికీ ఎటువంటి సాకులు చెప్పడానికి వీలులేదు. ప్రభువు కోసం గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలు చేయడానికి ఈ రోజు దేవుని కృపను పూర్తిగా ఉపయోగించుకోండి.

7. దేవుని నుండి ఏదైనా పొందాలంటే దేవుని కృప అవసరము
కృప లేకుండా, మీరు దేవునితో మాట్లాడటానికి లేదా ఆయన నుండి ఏదైనా పొందడానికి అర్హులు కారు.

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. (హెబ్రీయులకు 4:16)

8. 30 సంవత్సరాలలో మీ కష్టార్జితము మీకు ఇవ్వలేనిది దేవుని కృప మీకు 3 నెలల్లో 
ఇవ్వగలదు
అలౌకిక వేగం కోసం కృప అనేది జీవితములోని ఏ అంశంలోనైనా ఇప్పటికే మీ కంటే ముందున్న వ్యక్తుల కంటే ముందంజ వేయగల సామర్థ్యం. ఇది అన్ని విధానాలు మరియు ప్రణాళికలను దైవ పద్ధతిలో తీసివేయడం, ఆశ్చర్యకరంగా తక్కువ సమయంలో మిమ్మల్ని ముందుకు తుసుకెళ్లుతుంది.

యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. (1 రాజులు 18:46) యేసు నామములో ఇతరులను మించిపోయేలా ప్రవక్తయైన ఏలీయా మీద ఉన్న ప్రభువు యొక్క ఈ హస్తము మీ మీద మరియు నా మీద నిలిచి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

బహుమానం పొందడం సాధ్యమే కానీ కృపాకాదు. మన సమాజంలో చాలా మంది మేధావులు ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. చాలా మంది అందమైన స్త్రీలు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. వివాహములో స్థిరపడటానికి, మంచి ఉద్యోగం సంపాదించడానికి మరియు జీవితాన్ని ఆనందించడానికి దేవుని కృప అవసరం. కొన్ని సద్గుణాలు జీవితాన్ని మధురంగా మారుస్తాయి మరియు దేవుని కృప వాటిలో ఒకటి. కృప లేని జీవితం కష్టపడుతుంది. మీ బలం ఇవ్వలేనిది కృప మీకు ఇవ్వగలదు.

ఈ రోజు మీరు దేవుని కృపకై మొఱ్ఱపెట్టాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కృప గురించి మీరు ఎంత మేల్కొని ఉంటారో, అంత మీ జీవితములో అది కార్యము అవుతున్నట్లు మీరు చూస్తారు.

కృప ద్వారా ఎత్తబడిన వారికి బైబిలు ఉదాహరణలు
  • మెఫీబోషెతు
కుంటివారిని రాజభవనములో అనుమతించలేదు, కానీ దేవుని కృప ద్వారా మెఫీబోషెతు ఎత్తబడ్డాడు. దావీదు రాజు సౌలు రాజుకు సేవకుడిగా ఉండే మాకీరు అనే వ్యక్తిని పిలిచిన రోజు వచ్చింది. “యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడాయని అతని నడుగగా సీబాయోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను" (2 సమూయేలు 9:3). దావీదు వెంటనే మెఫీబోషెతును తాను నివసిస్తున్న లోదెబారు నుండి తీసుకువచ్చాడు. (2 సమూయేలు 9:1-13 చదవండి)

  • యోసేపు
యోసేపు ఐగుప్తును పరిపాలించడానికి అపరిచితుడిగా అర్హత పొందలేదు, కానీ కృప అతనికి అర్హతను ఇచ్చింది. కృప మీ మరియు నా లాంటి మనుష్యులను మన శత్రువుల మధ్య కూడా పరిపాలించేలా చేస్తుంది.

42 మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి 43 తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడువంద నము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. 44 మరియు ఫరో యోసేపుతోఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. (ఆదికాండము 41:38-44)

  • ఎస్తేరు
కృప ద్వారా, ఒక బానిస అమ్మాయి ఒక వింత దేశములో రాణి అయ్యింది. కృప ఒక ప్రణాళికను కూడా మారుస్తుంది
​స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను. (ఎస్తేరు 2:17)

  • దావీదు
కృప దావీదును వెనుకబడిన జీవితము నుండి ముందు వైపుకు తీసుకువెళ్లింది. అతడు అడవిలో గొర్రెలను నడిపించడం నుండి సమస్త దేశానికి దైవికంగా లేవనెత్తబడ్డాడు.

కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమన గాగొఱ్ఱల కాపులో నున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. (2 సమూయేలు 7:8). మీకు కూడా ఇలాగే జరగవచ్చు.

కృపను ఆస్వాదించడానికి మరియు కృపలో ఎదగడానికి ఏమి చేయాలి?

  • కృప కొరకు ప్రార్థించండి
కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను. (నిర్గమకాండము 33:13)

  • దీనులుగా ఉండండి
"కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది." (యాకోబు 4:6)

  • ఇతరుల పట్ల కృపను చూపండి
దేవుడు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో, మీరు కూడా మీ పొరుగువారికి ఆవిధంగా చేయండి. (మత్తయి 5:7)

  • దేవుని కృప గురించి అవగాహన కలిగి ఉండండి మరియు దాని మీద మరింత అధ్యయనం చేయండి
దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతి 2:15)

  • గొప్ప మరియు చిన్న ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించండి.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 5:18)

  • కృపను కలిగి ఉండే స్త్రీ పురుషులను కృపను ప్రసాదించమని కోరండి
అభిషేకం గల పాత్రల ద్వారా కృపను పొందుకోవచ్చు
నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను. (సంఖ్యాకాండము 11:17)

Bible Reading Plan: Luke 10- 13
ప్రార్థన
1. యేసు నామములో నేను వెనుకబాటుతనం మరియు స్తబ్దత యొక్క ఆత్మను తిరస్కరిస్తున్నాను. (ఫిలిప్పీయులకు 3:13-14)

2. యేసు నామములో, నేను మహిమ నుండి మహిమకు వెళతాను, యేసు నామములో. (2 కొరింథీయులకు 3:18)

3. తండ్రీ, యేసు నామములో జీవితంలో అభివృద్ధిని సాధించడానికి నాకు నీ కృపను దయచేయి. (రోమీయులకు 5:2)

4. తండ్రీ, యేసు నామములో నాకు గొప్ప ఆత్మను దయచేయి. (దానియేలు 6:3)

5. ప్రభువా, యేసు నామములో నా గొప్పతనాన్ని ప్రతి వైపులా అభివృద్ధిపరచు. (కీర్తనలు 71:21)

6. ప్రభువా, నీ కృపచేత, యేసు నామములో నన్ను ఆశించదగిన స్థానానికి లేవనెత్తు. (కీర్తనలు 75:6-7)

7. తండ్రీ, యేసు నామములో నన్ను ఆశీర్వదించే స్థలములో నన్ను ఉంచు. (ద్వితీయోపదేశకాండము 28:2)

8. తండ్రీ, యేసు నామములో నన్ను ఆశీర్వదించు మరియు నన్ను ఉత్తమమైన ఎంపిక చేసి వ్యక్తిగా ఇష్టపడేలా చేయి. (1 సమూయేలు 16:12)

9. ప్రభువా, నీ కృప యేసు నామమున ఉన్నత స్థలములలో నా కొరకు మాట్లాడును గాక. (ఎస్తేరు 5:2)

10. దేవుని కృపతో, యేసు నామములో నేను అంగీకరించబడతాను మరియు తిరస్కరించబడను; నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా ఉండను; నేను ఇచ్చేవానిగా ఉంటాను కానీ పుచ్చుకునే వానిగా ఉండను. (ద్వితీయోపదేశకాండము 28:13)

11. తండ్రీ, ఈ 40 రోజుల ఉపవాస కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరూ, వారిని మరియు వారి కుటుంబ సభ్యులను యేసు నామములో ఉన్నతమైన స్థలములో ఉంచు. (యెషయా 58:11)

12. దేవా, నా జీవితానికి వ్యతిరేకంగా శత్రువు యొక్క ప్రతి ప్రణాళికను కూల్చివేయి మరియు నీ సత్యము నాకు కవచం మరియు కేడము ఉండును గాక. (కీర్తనలు 91:4)

Join our WhatsApp Channel


Most Read
● ప్రభావం యొక్క గొప్ప పరుధులకు మార్గం
● దేవుని శక్తివంతమైన హస్తము యొక్క పట్టులో
● వుని కొరకు మరియు దేవునితో
● దాచబడిన విషయాలను అర్థం చేసుకోవడం
● మర్చిపోయిన ఆజ్ఞా
● దేవుడు ఇచ్చిన ఉత్తమ వనరు
● ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించాము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్