english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఘనత జీవితాన్ని గడపండి
అనుదిన మన్నా

ఘనత జీవితాన్ని గడపండి

Saturday, 15th of February 2025
0 0 186
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)
"నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు." (1 సమూయేలు 2:30)

ఘనత అంటే ఎంతో గౌరవంగా భావించడం. దురదృష్టవశాత్తు, ఘనత యొక్క సిధ్ధాంతం వెనుకకు విసిరివేయబడిన సమయంలో మనం జీవిస్తున్నాము. చిన్నవారు ఇప్పుడు తమ తల్లిదండ్రులను ఘనపరచరు మరియు వారు క్రమశిక్షణతో లేకుంటే పోలీసులకు కూడా పిలుస్తారు. మన సంస్కృతి మరియు లేఖన సిధ్ధాంతాల పట్ల మనకు సున్నా ఘనత ఉంది. లిఖితము చేయబడిన వాటి కంటే మనము మన మార్గంలో పనులను చేస్తాము. నేటి కాలంలో, ఘనత భాష మనకు పరాయిదిగా కనిపిస్తుంది.

అయితే, ఎస్తేరు ఘనత సిధ్ధాంతాన్ని అర్థం చేసుకుంది. ఆమె అనాథ, అయినప్పటికీ ఆమె తన చిన్నాన్న సూచనలను అనుసరించింది. పెద్దయ్యాక ఇప్పుడు చిన్నాన్న కంటే బాగా తెలుసునని పోజులివ్వలేదు. ఆమె ఇప్పటికీ అతని సూచనలను ఘనపరిచింది మరియు అనుసరించింది. సింహాసనం పూర్తి చేయడంలో ఆమె కూడా ఉండాలని ఆమె చిన్నాన్న ఆలోచన అని మీరు నాతో అంగీకరిస్తారు. ఆమె తనకు ఆసక్తి లేదని మరియు ఆమె జీవితం కోసం తన స్వంత ప్రణాళికలను కలిగి ఉందని చెప్పవచ్చు, కానీ అలా చెప్పలేదు. ఆమె తన చిన్నాన్న కోరికలను ఘనపరిచి సంతకం చేసింది. అలాగే, ఆమె రాజభవనంలో ఉన్నప్పుడు, ఆమె రాజభవనం మరియు రాజు యొక్క నియమాలను ఘనపరిచింది. అవును, ఆమె ఒక యూదురాలు, కానీ ఆమె పనులు తన మార్గంలో చేయాలని పట్టుబట్టలేదు. ఒక సందర్భంలో, ఆమె తనకు నచ్చినది ఇవ్వమని రాజు నియమించిన నపుంసకుడికి చెప్పింది.

బైబిలు ఎస్తేరు 2:8-9లో ఇలా చెబుతోంది, "రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్ప గింప బడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్ల లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమం దుంచెను." ఈ స్త్రీని ఇష్టపడేలా చేసిన నపుంసకుడు ముందు ఎస్తేరు ఘనప్రదమైన మరియు గౌరవప్రదమైన వైఖరిని ప్రదర్శించి ఉండాలి. అహంభావి మరియు గర్వించే స్ట్రీను ఎవరు ఇష్టపడతారు?

కాబట్టి, మనం మన హృదయం నుండి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి. ఎస్తేరు కేవలం ఒక రైతు అమ్మాయి నుండి రాణిగా మారలేదు; ఆమె సింహాసనానికి తన మార్గాన్ని ఘనపరిచింది. ఆమెకు చాలా ఘనత ఉంది, ఆమెతో పరిచయం ఉన్న ఎవరైనా ఆమెను ఇష్టపడతారు. ఘనత యొక్క వ్యతిరేక పదం అహంకారం. మీ హృదయం నుండి ప్రజలను, నియమాలు మరియు వ్యవస్థలను ఘనపరచాల్సిన సమయం ఇది. ఇతరుల నుండి నేర్చుకోవలసినది ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు అన్నీ తెలుసునని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్తేరుకు రాజభవనం యొక్క నియమము తెలియదు, కానీ రాజు యొక్క నపుంసకుడికి తెలుసు, కాబట్టి ఆమె అతనికి లోబడేంత తెలివిగలది.

మిత్రమా, మనము మహిమ గల రాజును సమీపించినప్పుడు, మనము ఆయనను స్తుతించి కృతజ్ఞతలు చెప్పవలెను. అది ఘనత యొక్క నియమము. నజరేతులోని ప్రజలు యేసును ఘనపరచలేరు లేదా ఘనపరచలేదు-వారు ఆయనను చిన్ననాటి స్థాయికి వెనక్కి లాగాలని పట్టుబట్టారు, తద్వారా వారు ఆయనను తమతో సమానంగా మార్చుకోవచ్చు. సమస్య ఏమిటంటే ఆయన రాజు, పూర్వం లేదా సమానత్వం లేని పాలకుడు. యేసు చెప్పాడు, "ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను." (మార్కు 6:4)

మీరు ఘనపరిచేది మీ వైపుకు లాగబడుతుంది మరియు మీరు అగౌరవపరిచేది మీ నుండి దూరంగా ఉంటుంది. మనం ప్రజలతో మాట్లాడేటప్పుడు ఘన సంస్కృతిని అలవర్చుకోవాలి. మీకు మీ పాస్టర్ కంటే బాగా తెలుసు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు; ఆయనని ఘనపరచండి. మీరు మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ విద్యావంతులు మరియు ధనవంతులు కావచ్చు, కానీ మీరు ఇప్పటికీ వారిని ఘనపరచాల్సి ఉంటుంది, తద్వారా అది మీతో పాటు జీవితంలో మంచిగా ఉంటుంది మరియు మీరు దీర్ఘకాలం జీవించవచ్చు. ఘనత ఇంత శక్తివంతమైనది. ఇది మీ దశలను తిరిగి పొందే సమయం మరియు మీ హృదయం నుండి గర్వం మరియు అహంకారాన్ని తీసివేయడానికి దేవుని ఆత్మను అనుమతించండి, తద్వారా మీరు నిజమైన పరివర్తనను అనుభవించవచ్చు.

Bible Reading: Numbers 4-6
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీవు నా హృదయాన్ని వినియం గల ఆత్మతో నింపాలని ప్రార్థిస్తున్నాను. నీవు నా హృదయం నుండి ప్రతి గర్వాన్ని తొలగించి, నీ వినయపూర్వకమైన ఆత్మను పొందడానికి నాకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక నుండి నా ముందున్న వారిని ఘనపరుస్తాను, ఇకపై ఎవరినీ చిన్నచూపు చూడనని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● విశ్వాసం ద్వారా కృప పొందడం
● మీ కలలను మేల్కొలపండి
● మన హృదయం యొక్క ప్రతిబింబం
● వ్యర్థమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తుంది
● ప్రభువైన యేసుక్రీస్తును ఎలా అనుకరించాలి
● హామీ గల సంతృప్తి
● వుని కొరకు మరియు దేవునితో
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్