english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మంచి శుభవార్త చెప్పుట
అనుదిన మన్నా

మంచి శుభవార్త చెప్పుట

Sunday, 23rd of February 2025
0 0 155
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)


19"కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు
నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని
గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ
ఉన్నానని వారితో చెప్పెను." ఆమెన్. (మత్తయి
28:19-20)



ఎస్తేరు 8:
3-4
ఇలా చెబుతోంది,
"
మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి
చేసికొని
, అతని
పాదములమీద పడి
, అగాగీయుడైన
హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని
కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు
లేచి రాజు ఎదుట నిలిచెను."



హామాను ఓడిపోయినప్పటికీ,
రాజు ఆజ్ఞ యూదులకు వ్యతిరేకంగా ఉంది. రాజు శత్రువును చంపాడు,
అయినప్పటికీ అతని కార్యములు చలనంలో ఉన్నాయి. ప్రజలను నాశనం
చేయడానికి నియమించబడిన సమయం ఇంకా కొనసాగుతూనే ఉంది మరియు ఉరిని అమలు చేయడానికి ఉన్న
వ్యక్తులు ఇప్పటికీ "వారందరినీ చంపండి" అనే చివరి ఆదేశానికి కట్టుబడి
ఉన్నారు.



సమయానికి ఏమీ చేయకపోతే
ఎంత ప్రమాదమో మీరు ఊహించవచ్చు. అయితే
, బైబిలు ఎస్తేరు 8:10లో ఇలా చెబుతోంది, "​రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు
ఉంగరముతో ముద్రించి గుఱ్ఱముల మీద
, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్ర
నెక్కించి ఆ తాకీదులను వారిచేత పంపెను."



రాజు వేగవంతమైన గుర్రాలపై
ప్రతికూలమైన సూచన పంపవలసి ఉంటుంది
, లేకపోతే ఉరిశిక్ష ఇంకా కొన్ని ప్రదేశాలలో కొనసాగుతుంది
మరియు ఉపవాసం మరియు ప్రార్థనలు ఫలించలేదు. కాబట్టి ఎస్తేరు తన ప్రజల రక్షణ కొరకు
విజ్ఞాపన చేసింది. ప్రతి సంఘములో విఙ్ఞాపణ ప్రార్థన అనేది ఈ దినాలలో చాలా అవసరం
,
తద్వారా ఆత్మలు రక్షించబడతాయి. దురదృష్టవశాత్తు,
ఇది అత్యంత నిర్లక్ష్యం చేయబడిన పరిచర్యలలో ఒకటి.



క్రీస్తు సిలువ మీద మనకు
విజయాన్ని సాధించినప్పటికీ
, ఆ విజయాన్ని అమలు చేయడానికి విఙ్ఞాపణ ప్రార్థన అవసరం. అయితే,
విఙ్ఞాపణ ప్రార్థన తరువాత బయటకు వెళ్లి మంచి శుభవార్త
గురించి ప్రజలకు చెప్పడం అవసరం. సువార్త బోధ తప్పనిసరిగా విఙ్ఞాపణ ప్రార్థనతో
ఉండాలి. చెడు వార్తల కంటే శుభవార్త వేగంగా ప్రయాణించవలసి ఉంటుంది
;
అందువల్ల రాజ గుర్రాలు ఉపయోగించబడ్డాయి - అవి సాధారణ
గుర్రాల కంటే వేగంగా ఉంటాయి. సమయం ఎక్కువగా ఉండటంతో అత్యవసర భావం ఏర్పడింది.



ప్రజలు ఇప్పటి వరకు చెడు
వార్తలకు అలవాటు పడ్డారు
, అయితే ఇది మంచి శుభవార్త ప్రకటించే సమయం. యేసు చెప్పిన
చివరి మాటలు మనకు ఏమి చేయాలో తెలియజేసే ప్రకటన. ఇప్పుడు ఆయన అపవాది మీద అధికారం
కలిగి ఉన్నాడు
, వానిని
ఓడించాడు
, వాని
జీవితం మరియు మరణం యొక్క తాళపు చెవిని కూడా కలిగి ఉన్నాడు. ప్రజలు బాధపడకుండా
ఉండాలంటే మనం వారికి సువార్తను చెప్పాలి. వారి స్వేచ్ఛ కోసం ఒక సదుపాయం ఉన్నందున
వారు పాపంలో కూరుకుపోవాల్సిన అవసరం లేదని మనం వారికి చెప్పాలి. యోహాను
8:36 ఇలా చెబుతోంది, "కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా
స్వతంత్రులై యుందురు."



యేసయ్య వారిని
విడిపించాడు
; వారు ఈ
వార్తలను అంగీకరించాలి. వారి జబ్బులకు
, రోగాలకు మూల్యం చెల్లించాడు. ఆయన దానిని దారిలో నుండి
తీసివేసి సిలువకు వ్రేలాడాడు. ఆయన దానిని పూర్తిగా చెల్లించాడు
,
కాబట్టి వారు అనారోగ్యంతో చనిపోవాల్సిన అవసరం లేదు. వారు
మంచి ఆరోగ్యంతో నడవడానికి ఆయన మూల్యం చెల్లించాడు. జీవితంలోని కష్టాల నుండి మనకు
శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఇది మనం వీలైనంత వేగంగా వ్యాప్తి చేయవలసిన శుభవార్త.



వేగవంతమైన గుర్రానికి మనం
పట్టీ కట్టి వార్తలను వ్యాప్తి చేయాలి. శత్రువు ప్రజలను చంపి వారిని
మోసగిస్తున్నాడు
, కాబట్టి మనం రక్షించే కర్తగా నిలబడాలి. పాపం మరియు మరణం నుండి వారిని
విడిపించడానికి మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు
, మనం కూడా వారిని చేరుకోవాలి. శుభవార్తను పంచడానికి సాధ్యమైన
ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుందాం. అపవాది ఓడిపోయాడు
; మనము స్వతంత్రులనుగా ఉన్నాం.


Bible Reading: Numbers 23-25 



ప్రార్థన


తండ్రీ, సిలువపై నీవు చేసిన త్యాగానికై వందనాలు. అనారోగ్యం నుండి నన్ను విడిపించిన నీవు పూర్తి చేసిన కార్యానికై వందనాలు. నేను వెళ్లిన ప్రతిచోటా సువార్తను వ్యాప్తి చేయడానికి నీ ఆత్మ ద్వారా నాకు శక్తినివ్వమని నేను ప్రార్థిస్తున్నాను. నీ మంచి చేయి నా మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను మరియు నీవు నిజంగా నన్ను మార్పు కర్తగా చేస్తావు. సువార్త వ్యాప్తి చెందకుండా ఏదీ నన్ను అడ్డుకోదు. నేను గొప్ప ఆజ్ఞను పాటించే కృపను పొందుతాను. యేసు నామములో. ఆమెన్.




Join our WhatsApp Channel


Most Read
● భావోద్వేగ ఎత్తు పల్లాల బాధితుడు
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #13
● ఇక నిలిచి ఉండిపోవడం చాలు
● పరిశీలనలో జ్ఞానం
● కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యొక్క శక్తి
● దేవునికి మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది
● ప్రభువైన యేసు పునరుత్థానానికి సాక్ష్యమివ్వడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్