english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. పోరాటం చేయుట
అనుదిన మన్నా

పోరాటం చేయుట

Wednesday, 19th of March 2025
0 0 131
Categories : విడుదల (Deliverance)
"అయితే ఆయన ఇలా జవాబిచ్చాడు, "పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును." (మత్తయి 15:13)

ఇది కొందరికి వింతగా అనిపించవచ్చు, కానీ మీ ఇంట్లో కొన్ని పదార్థాలు లేదా వస్తువులు ఉండడం వల్ల శపించబడిన వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఉదాహరణకు, కొన్నిసార్లు, వ్యక్తులు సాతాను ఆచారాలలో ఉపయోగించిన వస్తువును ఇంటికి తీసుకురావచ్చు. అశ్లీలత వంటి ఇతర విషయాలు కూడా కొన్ని రకాల ఆత్మలకు ద్వారాలు తెరవవచ్చు. కొన్నిసార్లు ఒక వస్తువు దాని మీద ఉంచబడిన శాపాన్ని కలిగి ఉండవచ్చు.

ఐగుప్తు నుండి కత్తి

ఇశ్రాయేలులోని పరిశుద్ధ దేశ్ మా పర్యటనలలో ఒకటి, మేము ఐగుప్తును కూడా సందర్శించాము. పర్యటనలో ఉన్నప్పుడు, మా సభ్యుల్లో ఒకరు మాకు తెలియకుండానే కత్తిని కొనుగోలు చేశారు. ఇది చాలా పాతది మరియు చాలా చక్కని రూపాన్ని కలిగి ఉన్నందున అతడు దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతడు తన ఛాతీ మీద కూర్చొని ఉన్న వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి అవడం చూసాడు. భయభ్రాంతులకు గురైన అతని భార్య, రాత్రి నాకు ఫోన్ చేసి జరిగిన ఘోరం గురించి చెప్పింది.

మరుసటి రోజు పరిచర్య సమయంలో, ఈ వ్యక్తి ఆత్మ యొక్క శక్తి ద్వారా విడుదల చేయబడ్డాడు. ఈ బొమ్మ తనపై అరుస్తూ, "నన్ను ఎందుకు చంపావు?" అని అడిగాడని అతడు తరువాత నాతో చెప్పాడు. అతడు కత్తిని విసిరి వేసాడు, మరియు ఆ దృశ్యాలు ఆగిపోయాయి.

దీన్ని చదివే చాలా మందికి ఈ విషయాలు విచిత్రంగా మరియు వింతగా అనిపిస్తాయని నేను గ్రహిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ, ఆధ్యాత్మిక యుద్ధం అనేది మనస్సులో లేదా ఊహలో జరగదు; అది చాలా వాస్తవమైనది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో [శారీరికప్రత్యర్థులతో మాత్రమే పోరాడుతున్నాము] కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న (అలౌకిక) దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము." (ఎఫెసీయులకు6:12)

చీకటి శక్తుల చొచ్చుకొనిపోయే శక్తికి మీరు ఆధ్యాత్మికంగా సున్నితంగా ఉండలేరు. మనము యుద్ధంలో ఉన్నాము మరియు శత్రువు కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (ప్రపంచ వాణిజ్య కేంద్రం) దాడి జరిగినప్పుడు, టెర్రరిస్టు భవనం నేలపై నుంచి సుత్తితో పేల్చివేయలేదు; సెక్యూరిటీ వారిని అరెస్ట్ చేయకుంటే చాలా సంవత్సరాలు పట్టిఉండవచు. కాబట్టి వారు భూమిపై ఉన్న ఎత్తైన భవనాలలో ఒకదానిని ఒక్కసారిగా కిందకి దించే వ్యూహం కోసం వెళ్లారు. అలాగే, శత్రువు కుటుంబ వెనకాల  ఉంటాడు ఎందుకంటే కుటుంబాన్ని ఒకసారి దెబ్బతీస్తే, సమాజం కూడా దెబ్బతింటుందని వాడికి తెలుసు.

కాబట్టి, మనము కుటుంబాన్ని రక్షించడానికి పని చేయాలి. మన కుటుంబాల మీద శత్రువుల జోక్యానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. మన ఇంట్లో దుష్టుల మొక్కులు ఉంచలేము. మనం వాటిని తీసి వేయాలి. మనకు తెలియకుండానే ఎక్కువ కాలం వాటికి నీళ్ళు పోశాము; వాటిని పీకే సమయం వచ్చింది. వాటిని మన కుటుంబాల నుండి వేరు చేసి, శాంతి పాలన కోసం వాటిని తీసివేయాల్సిన సమయం ఇది.

అశ్లీలత

ఇది మన ఆధ్యాత్మిక స్థితి మీద ఆదేశాన్ని పొందడానికి శత్రువు ఉపయోగించే మరొక శపించబడిన విషయం. మీరు సినిమాని కొనుగోలు చేయాల్సిన రోజులు పోయాయి, కానీ ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు కేవలం ఆన్‌లైన్‌లో వెతకాలి మరియు మీరు అశ్లీల సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. వివాహాలను వేరు చేయడానికి మరియు యువకుల విధిని నాశనం చేయడానికి సాతాను ఉపయోగిస్తున్న అవినీతిలో ఇది ఒకటి. వద్దు అని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యసనానికి వ్యతిరేకంగా ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ టీవీని ఆపివేయి, ఆ సైట్‌ను వదిలివేసి, మీరు వాని కీలుబొమ్మ కాదని అపవాదికి తెలియజేయండి. మీరు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు, కాబట్టి మీరు స్వతంత్రంగా ఉన్నారు.

మీ ఇంటిలో తన ఉనికితో పోరాడటానికి నిలబడి ఉన్న చీకటి శక్తులన్నింటికీ వ్యతిరేకంగా దేవుడు మీ ఇంటి చుట్టూ అగ్ని గోడను నిర్మించమని ప్రార్థించండి. మీరు విజేత, బాధితుడు కాదు.

Bible Reading: Joshua 17-19
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, శపించబడిన వస్తువుకి సంబంధించి నీ వాక్యము యొక్క సత్యానికి మా కళ్ళు తెరిచినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఇంటికి అపవాది యొక్క ప్రవేశ ద్వారమును చూడటానికి నీవు మరోసారి మా కళ్ళు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. నీ కృప మమ్మల్ని చీకటి నుండి మరియు నరకం యొక్క బానిసత్వం నుండి విముక్తి చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మేము స్వతంత్రులుగా ఉన్నామని నేను ఆజ్ఞాపిస్తున్నాము. యేసు నామములో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ప్రబలంగా ఉన్న అనైతికత మధ్య స్థిరంగా ఉండడం
● అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
● ప్రభువు యొక్క ఆనందం
● బలిపీఠం మరియు మంటపం
● దైవ రహస్యాల ఆవిష్కరణ
● సంఘానికి సమయానికి ఎలా రావాలి
● 07 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్