english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుడు గొప్ప ద్వారములను తెరుస్తాడు
అనుదిన మన్నా

దేవుడు గొప్ప ద్వారములను తెరుస్తాడు

Saturday, 29th of March 2025
0 0 152
Categories : దేవుని శక్తి (Power of God)
"కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది (మూలభాషలో గొప్ప ద్వారము నాకు తెరువబడియున్నది); మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును." (1 కొరింథీయులకు 16:9)

ద్వారములు ఒక గదికి ప్రవేశాలు. మన కోసం ద్వారములు తెరవమని మనమందరం దేవునికి ప్రార్థిస్తాము; అనుకూలతలు, అవకాశం, వివాహం, వైద్యం, ఆర్థికం, అభివృద్ధి మొదలైనవి. ఇది నిజంగా తన పిల్లల పట్ల దేవుని చిత్తం. ఆయన ప్రకటన 3:8లో, "నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు." తెరిచి ఉంచిన తలుపులు మన ఊహలకు అందని ఆశీర్వాదాల ప్రాప్తిని సూచిస్తాయి. పనులు పూర్తిచేయడానికి మనం కష్టపడాలనేది దేవుని కోరిక కాదు. కాబట్టి, సిలువ మీద ఆయన కుమారుడైన యేసయ్య త్యాగం ద్వారా, జీవితంలోని ప్రతి మంచి విషయానికి మనకు ప్రవేశము ఉంది.

2 పేతురు 1: 3-4 లో బైబిలు ఇలా చెబుతోంది, "దేవుని గూర్చి నట్టియు మన ప్రభువైన యేసును గూర్చి నట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవ స్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను." ఒక మంచి తండ్రిగా, ఆయన తన పిల్లలకు వారసత్వాలను కలిగి ఉన్నాడు మరియు ఆయన వాటిని మనకు ఇవ్వడాని కిఇష్టపడ్డాడు.

అపొస్తలుడైన పౌలు తన మూడవ మిషనరీ ప్రయాణంలో ఎఫెసు నుండి కొరింథీయులకు వ్రాశాడు, అక్కడ అతడు కొరింథులోని విశ్వాసులతో ఉండాలని మరియు వారితో కొంత ముఖ్యమైన సమయాన్ని గడపాలని తన కోరికను వ్యక్తం చేశాడు. కానీ అతడు సువార్త ప్రకటించడానికి దేవుడు తనకు గొప్ప అవకాశాన్ని తెరిచి ఉంచాడని వారికి తెలియజేయడానికి అతడు సంతోషిస్తున్నాడు. తత్ఫలితంగా, ఎఫెసులోని ఒకప్పుడు అన్యజనులు పౌలు బోధించిన సువార్తను క్రమంగా అంగీకరించారు మరియు స్వీకరించారు.

యెహోషువ పుస్తకం కూడా ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్న విషయాన్ని గురించి వివరిస్తుంది. వారు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు, వారు తమ పూర్వీకుడైన అబ్రాహాముకు చెందిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఐగుప్తులో నివసించిన తరువాత, హెబ్రీయులు గతంలో నిర్మించిన మరియు విగ్రహాలను పూజించే అన్యజాతి తెగల స్వంతం చేసుకున్న ఇళ్లకు తిరిగి వచ్చారు, దీనిని సాధారణంగా కనానీయులు అని పిలుస్తారు (ఆదికాండము 15:21).

చాలా సార్లు, మనం తలుపులు తట్టడం వల్ల తలుపులు తెరవవు. బదులుగా, దేవుడు మనకొరకు సిద్ధపరచిన ఆశీర్వాదాలకు మన ప్రాప్తిని తట్టుకునేలా కొందరు బలవర్థకమయ్యారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత, హెబ్రీయులు మూడు ప్రధాన అడ్డంకులను కనుగొన్నారు, అవి తమ జీవితాలకు దేవుని ఆశీర్వాదాల వాగ్దానాలను అనుసరించేటప్పుడు క్రైస్తవులు ఎదుర్కొనే మూడు యుద్ధాల ప్రతిబింబం.

ఎ. ప్రాకారముగల నగరాలు (సంఖ్యాకాండము 13:28)
బి. నెఫీలీయుల వంశము (సంఖ్యాకాండము 13:33)
సి. ఏడు వ్యతిరేక దేశాలు (ద్వితీయోపదేశకాండము 7:1)

ఇశ్రాయేలీయులకు అభివృద్ధి మార్గంలో నిలిచిన ఈ అవరోధాలు మరియు సవాళ్లలో ప్రతి ఒక్కటి నేడు ఒక అన్వహించు పాఠము కలిగి ఉంది మరియు క్రైస్తవులు దేవుని వాగ్దానాల సంపూర్ణతను అనుభవించడానికి వారి మార్గంలో ప్రయాణించేటప్పుడు అనుభవించే అవరోధాలను గురించి సూచిస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, కానీ ఈ అడ్డంకులు నిజమైనవని మరియు అవి అపవాది యొక్క స్వచ్ఛమైన అవకతవకలు అని మీరు తెలుసుకోవడం మంచిది.

దేవుడు వారికి ఇప్పటికే భూమిని ఇచ్చాడు, కాని వాగ్దాన భూమి యొక్క ఆశీర్వాదాలను వారు ఆనందించకుండా ప్రజల మనస్సులను మార్చటానికి అపవాది ప్రయత్నించాడు. కానీ వాడు విఫలమయ్యాడు. కొందరు వ్యక్తులు అపవాదిని నిందించడానికి బదులు అలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు దేవుని కూడా నిందిస్తారు. మీ జీవితానికి సంబంధించిన దేవుని వాగ్దానాలు అబద్ధాలు కాదని, అవి చెల్లుబాటు అవుతాయని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.

Bible Reading: Judges 19
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీవు ఇప్పటి వరకు నా కోసం తెరిచిన ఉంచిన అనుగ్రహం మరియు లేవనెత్తుల కోసం నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ తెరిచిన ఉంచిన ద్వారము యొక్క వాస్తవికతలో ఉండటానికి నీవు నాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. నా తెరిచిన ఉంచిన ద్వారముకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి అవరోధం యేసు నామములో నాశనం చేయబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● అసాధారణమైన ఆత్మలు
● ప్రతి రోజు జ్ఞానిగా ఎలా వృద్ధి చెందాలి
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
● దేవుని రకమైన విశ్వాసం
● 21 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్