english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీరు యుద్ధంలో ఉన్నప్పుడు: పరిజ్ఞానము
అనుదిన మన్నా

మీరు యుద్ధంలో ఉన్నప్పుడు: పరిజ్ఞానము

Thursday, 16th of January 2025
0 0 169
Categories : కలవరము (Distraction)
దావీదు యుద్దానికి వచ్చాడు, తన స్వంత ఇష్టంతో కాదు కానీ అతని తండ్రి ఒక పనిని అమలు చేయమని అడిగినందున వచ్చాడు. యుద్ధంలో ముందు వరుసలో ఉన్న తన సోదరులకు అతడు కొంత సామాగ్రిని తీసుకెళ్లాలని అతని తండ్రి కోరుకున్నాడు. (1 సమూయేలు 17:17-18 చదవండి)

ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను ఎలా ఎగతాళి చేస్తున్నాడో కూడా దావీదు ప్రత్యక్షంగా చూశాడు. అతనిలో అతని ఆత్మ కదిలించబడింది, మరియు గొల్యాతుతో పోరాడటం వలన ప్రతిఫలం ఏమిటో అతడు తన చుట్టూ ఉన్న మనుషులను అడిగాడు. ఆ మనుష్యులు వెంటనే అతనికి ఇలా సమాధానం ఇచ్చారు, "వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయును" (1 సమూయేలు 17:25)

అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి, "అతనితో నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱ మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను." (1 సమూయేలు 17:27-28)

దావీదు పెద్దన్న అయిన ఏలీయాబు, దావీదు ఆ మనుషులతో మాట్లాడినప్పుడు విన్నాడు, అందుకు అతడు మనుషులందరి ముందు తీవ్రంగా మందలించాడు. దావీదు సులభంగా మనస్తాపం చెందవచ్చు మరియు సంభవించిన దానితో బాధపడవచ్చు, కానీ అతడు అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

ఇక్కడ ఒక ముఖ్యమైన మూలం ఉంది:
కలవరము చెందడానికి దావీదు నిరాకరించాడు
మీరు యుద్ధంలో ఉన్నప్పుడు, నిజమైన యుద్ధం చేయకుండా మిమ్మల్ని నిరోధించడానికి శత్రువు ఎల్లప్పుడూ మిమల్ని కలవరం పెట్టడానికి ప్రయత్నించవచ్చు.

అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు, "మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను" (1 కొరింథీయులు 7:35)

కలవరము అనేది దేవుని ఉద్దేశాలు మరియు ప్రణాళికలకు మొదటి శత్రువు. ప్రజలు మీపై కోపపడినప్పుడు, మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, నిజం కాని విషయాలు చెప్పినప్పుడు, మనల్ని మనం రక్షించుకోవడానికి కోసం మనము సోషల్ మీడియాలో లేదా మరేదైనా వేదికపై వాళ్లతో పోరాడతాం. ఇది దేవుడు మీ పిలిపు గల అసలు విషయం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి కలవరం తప్ప మరొకటి కాదు.

గతంలో, దావీదు ఒక సింహం మరియు ఒక ఎలుగుబంటిని చంపాడు, మరియు అతడు ఏలీయాబుతో సులభంగా పోరాడగలడు, కానీ అతడు తన సొంత సోదరుడితో పోరాడటానికి దూరంగా ఉన్నాడు. అతడు ఏలీయాబుతో పోరాడి ఉంటే, అతడు గొల్యాతుతో ఎదురుపడడం తప్పిపోయేవాడు. ఒకవేళ దావీదు గొల్యాతుతో తన యుద్ధాన్ని కోల్పోయినట్లయితే, అతడు ఇశ్రాయేలుకు ఎన్నడూ తెలిసి ఉండేవాడు కాదు.

Bible Reading : Genesis 45 - 46
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీవు నన్ను చేయమని పిలిచిన వాటిపై దృష్టి పెట్టడానికి నాకు సహాయం చేయి. నాకు వ్యతిరేకంగా ఉన్న కలవరము యొక్క ప్రతి శక్తి యేసు నామంలో నరికివేయబడును గాక. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● విత్తనం గురించిన భయంకరమైన నిజం
● ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
● ఆయన్ని వెతకండి మరియు మీ యుద్ధాన్ని ఎదుర్కోండి
● నిందలు మోపడం
● ఎప్పుడు మౌనముగా ఉండాలి మరియు ఎప్పుడు మాట్లాడాలి
● పెంతేకొస్తు కోసం వేచి ఉండడం
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్