हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. 06 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Daily Manna

06 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన

Saturday, 16th of December 2023
1 1 1461
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
నేను వృథాగా ప్రయాసపడను

"ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు." (సామెతలు 14:23)

ఫలించుట ఒక ఆజ్ఞ. మానవుని సృష్టించిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన ప్రధాన ఆజ్ఞలలో ఇది భాగం. లాభాపేక్షలేని శ్రమ మీ జీవితంలో శత్రువు పని చేస్తున్నాడు అనేదానికి సంకేతం.

ఈ శక్తులు ప్రజలపై దాడి చేసినప్పుడు, వారి శ్రమను చూపించడానికి వారికి ఏమీ ఉండదు. కొన్నిసార్లు, ఈ శక్తులు వారిని పని చేయడానికి మరియు కొంత ఫలితాలను పొందడానికి అనుమతించవచ్చు, కానీ రాత్రికి రాత్రే, వారి సంవత్సరాల తరబడి శ్రమను తుడిచిపెట్టే ఇబ్బంది మరియు నష్టం అనేది ఉంటుంది.

అనేకమంది విశ్వాసులు వృథాగా ప్రయాసపడుతున్నారు; వారికి అపవాది యొక్క కార్యము గురించి తెలియదు. ఈ విశ్వాసులు వరములు పొందినవారు కానీ అభివృద్ధి చెందరు; వారికి ఉద్యోగం లేని అర్హతలు మరియు డబ్బు లేని తెలివితేటలు ఉన్నాయి. వీరిలో కొందరు బహుళ ఉద్యోగాలు, ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూ అప్పులపాలై జీవిస్తున్నారు. కొంతమంది విశ్వాసులు తమ వ్యాపారాలలో ఇప్పటికే విజయం సాధించారు, కాబట్టి వారు ఈ రకమైన ప్రార్థనలు చేయవలసిన అవసరం లేదని వారు భావిస్తారు. అపవాది విజయవంతంగా దాడిని ప్రారంభించిన తర్వాత కాకుండా దాడి చేసే ముందు ప్రార్థన చేయడం ఉత్తమమని వారు గ్రహించలేరు. మనం అజాగ్రత్తగా ఉంటే అపవాది ఎప్పుడైనా దాడి చేయవచ్చు కాబట్టి, నేటి విజయం రేపటి దినమున పోతుంది. ఉదాహరణకు, యోబును తీసుకోండి. అతడు అప్పటికే ఫలించబడ్డాడు మరియు బాగా స్థిరపడ్డాడు, కానీ అపవాది అతని మీద దాడి చేసినప్పుడు, అతడు ఒక
రోజులో ప్రతిదీ కోల్పోయాడు. దేవుడు అతనికి తోడుగా ఉండకపోతే యోబు మరల ఫలించే వాడు కాదు.

ప్రజలు వృథాగా ప్రయాసపడటానికి గల కొన్ని ప్రధాన కారణాలు
1. బానిసత్వం
ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు, వారి శ్రమ అంతా వారి కార్యనిర్వాహకుల కోసమే.

9 అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. 10 వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను. 11 కాబట్టి వారిమీద పెట్టిన
భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.
13 ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; 14 వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. (నిర్గమకాండము 1:9-11, 13-14)

2. దుర్మార్గుల దుర్మార్గం
మిద్యానీయులు, ఇశ్రాయేలీయులు విత్తనములు నాటడానికి మరియు విత్తనాలు పెరగడానికి వేచి ఉన్నారు, మరియు పంట సమయంలో, వారు తమకు లాభాన్నిచ్చే వాటన్నిటిని నాశనం చేయడానికి ఉన్నారు; శత్రువు ఈ విధంగా కార్యము చేస్తాడు.

శ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల యెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని
ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి. (న్యాయాధిపతులు 6:1-6)

కొన్నిసార్లు, వారు ఒక యువకుడి యవ్వన వయస్సులో విజయం సాధించడానికి అనుమతించవచ్చు మరియు వృద్ధాప్యంలో, వారు అతని ఆర్థిక స్థితిని హరించే అనారోగ్యంతో అతన్ని బాధ పెట్టవచ్చు.

కొన్నిసార్లు, వారు పిల్లలు చనిపోయేలా చేస్తారు మరియు పిల్లల మీద తల్లిదండ్రుల వెచ్చించి అంతా వృధా అవుతుంది. వారు మిమ్మల్ని ఆపడానికి ముందు వారిని ఆపండి; వారు మీతో పోరాడకముందే వారితో పోరాడండి. మీ శత్రువు భౌతికమైనది కాదు, మీ శత్రువు అపవాది, కానీ వాడు మీ మీద ప్రజలను ప్రభావితం చేయగలడు మరియు ఉపయోగించగలడు. ఆ ప్రజలు మీ నిజమైన శత్రువు కాదు, కానీ వారు సాతాను ప్రభావంలో ఉన్నారు. ఆధ్యాత్మిక శత్రువును ఆపడానికి మీరు ప్రార్థించిన క్షణం, మానవ ఆధారం ద్వారా వాని ప్రభావం కూడా ఆగిపోతుంది.

3. పాపభరితమైన జీవనశైలి
పాపం శత్రువుకు న్యాయానుసారమైన ప్రాప్యతను ఇస్తుంది.

మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. (యిర్మీయా 5:25)

లాభరహిత ప్రయాసమును అనుభవించిన వారికి బైబిలు ఉదాహరణలు
1. మరచిపోబడిన జ్ఞానము గల బీదవాడు.
ప్రసంగి 9:15 లో, జ్ఞానము గల బీదవాడు ఒక నగరం మొత్తాన్ని నాశనం నుండి రక్షించాడు, కానీ అతడు పరచిపోబడ్డాడు. అతని శ్రమకు ప్రతిఫలం లభించలేదు. ఈ వ్యక్తి తెలివైనవాడు, కానీ అతడు బీదవాడు ఎందుకంటే అతడు ప్రజలకు సహాయం చేసినప్పుడల్లా, వారు అతన్ని పరచిపోయే వారు. జ్ఞానం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది, కానీ ప్రజలను వృథాగా ప్రయాసపడేలా చేసే ఈ ఆత్మతో మీరు
వ్యవహరించనప్పుడు, మీరు "జ్ఞానము గల బీదవాడైన వ్యక్తి" అవుతారు.

2. యాకోబు
యాకోబు చాలాసార్లు మోసపోయాడు మరియు అతని ప్రయాసకు పూర్తి ప్రతిఫలం లభించలేదు. అతని జీవితాన్ని దేవుని నిబంధన అతనిని రక్షించింది.

38 ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱలైనను మేక లైనను ఈచు కొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. 39 దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని. 40 పగటి యెండకును రాత్రి మంచుకును నేను
క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను. 41 ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. 42 నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు
నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను. (ఆదికాండము 31:38-42)

మన సమాజాలలో చాలా మంది లాబాను వంటివారు; వారు ప్రజలను మోసం చేస్తారు మరియు వారి పూర్తి ఆశీర్వాదాన్ని తిరస్కరిస్తారు. మీరు ప్రార్థన చేసిన యెడల, దేవుడు మీకు సంపూర్ణాంగా ఇవ్వడానికి అడుగు వేయగలడు.

తదుపరి అధ్యయనం: లూకా 5:5-7, యెషయా 65:21-23, 1 కొరింథీయులకు 15:10
Prayer
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

1. నా పంటను నాశనం చేయడానికి అప్పగించిన ప్రతి అధికారాన్ని నేను యేసు నామములో చెదరగొడుతున్నాను." (యెషయా 54:17)

2. నా చేతులపనికి వ్యతిరేకంగా పనిచేసే ఏ దుష్టశక్తినైనా నేను యేసు నామములో నాశనం చేస్తున్నాను." (ద్వితీయోపదేశకాండము 28:12)

3. దేవుని అభిషేకం మరియు యేసు రక్తం ద్వారా, నా జీవితంలో మంచి విషయాలపై దాడి చేసే ఏదైనా శక్తిని నేను యేసు నామములో నాశనం చేస్తున్నాను." (1 యోహాను 2:27; ప్రకటన 12:11)

4. నా ఆరోగ్యం, వ్యాపారం మరియు కుటుంబాన్ని మ్రింగివేసేవారిని, దోపిడీదారులను మరియు పాడు చేసేవారిని యేసు నామములో నేను తిరస్కరిస్తున్నాను." (మలాకీ 3:11)

5. నా శ్రమను వ్యర్థం చేయడానికి ఏ అధికారాన్ని అప్పగించినా నేను యేసు నామములో నిషేధిస్తున్నాను." (యెషయా 65:23)

6. తండ్రీ, నా చేతుల కష్టార్జితమును దీవించు మరియు యేసు నామములో 100 అంతలా పంటను
పండించు." (ఆదికాండము 26:12)

7. దొంగిలించబడిన ప్రతి దీవెనలు, సద్గుణాలు, అవకాశాలు మరియు సంపదలను యేసు నామములో నేను తిరిగి పొందుతున్నాను. (యోవేలు 2:25)

8. యేసు రక్తం ద్వారా, నా పునాదిలో ఉన్న ప్రతి చెడును నేను యేసు నామములో ఆపివేస్తున్నాను. (హెబ్రీయులకు 9:14)

9. నా జీవితంలో నా పరలోకపు తండ్రి నాటని ఏ తోటనైనా యేసు నామములో నిర్ములించబడును గాక. (మత్తయి 15:13)

10. నా పునాది నుండి నా జీవితంలోకి కార్యము చేయబడిన ప్రతి శాపం మరియు వైఫల్యాన్ని నేను యేసు నామములో నాశనం చేస్తున్నాను. (గలతీయులకు 3:13)

11. నా ఉద్దేశ్యం మరియు లక్ష్యానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధం వర్థిలదని నేను ప్రకటిస్తున్నాను మరియు నా భవిష్యత్తును నిర్వీర్యం చేయడానికి శత్రువు యొక్క ప్రతి ప్రణాళికను నేను యేసు నామములో రద్దు చేస్తున్నాను. (యెషయా 54:17)

12. ప్రభువా, నా తరపున పోరాడటానికి నీ దేవదూతలను విడుదల చేయి మరియు నా జీవితానికి నీ ఇష్టాన్ని వ్యతిరేకించే ప్రతి ఆధ్యాత్మిక కోటను యేసు నామములో కూల్చివేయబడును గాక. (కీర్తనలు 34:7)a


Join our WhatsApp Channel


Most Read
● క్షమించకపోవడం
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 4
● వుని కొరకు మరియు దేవునితో
● ప్రార్థనలో అత్యవసరం
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● 12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 3
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login