हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3
Daily Manna

ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3

Thursday, 1st of September 2022
0 0 622
Categories : శిష్యత్వం (Discipleship)
ప్రతి ఒకరు లేఖనాలను జాగ్రత్తగా చదవగలిగితే, యేసు మరియు శిష్యుల వద్దకు తరలివచ్చే వారి మధ్య బైబిల్ స్పష్టంగా తేడాను చూపుతుంది. ఆరాధనకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ శిష్యులు కారు.

ఈ వ్యత్యాసాన్ని ఈ క్రింది లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి:

అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను. (మత్తయి 15:32)

అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యుల తోను ఇట్లనెను. (మత్తయి 23:1)

అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లనెను… (లూకా 12:1)

ఈ గుంపు మరియు శిష్యుడిగా ఉండడం అంటే ఏమిటో గురించి చాలా చెప్పవచ్చు. అయితే, కొన్ని విషయాలు విశిష్టమైనవి:

1.ఈ శిష్యుల గుంపుకు యేసుతో మిగతా అన్ని గుంపుల కంటే భిన్నమైన సంబంధాన్ని కలిగి ఉంది. వారు ప్రభువు వద్దకు చెరడానికి ప్రత్యక్ష ప్రవేశం కలిగి ఉన్నారు.

2. వారికి బోధన మరియు ఇతరుల దగ్గర లేని సమాచారం అందుబాటులో ఉంది.

నన్ను తరచూ అడిగే ప్రశ్న ఏమిటంటే, “నేను క్రమం తప్పకుండా ఆరాధనకు హాజరవుతాను, జన సమూహంలో భాగం కావడం నుండి శిష్యుడిగా ఎలా మారగలను?”

నాతో పాటు లూకా 8:19 వచనాన్ని చూడండి, “ఆయన (యేసు) తల్లియు సహోదరులును ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేక పోయిరి. (లూకా 8:19)

గమనించండి, వారంతా జనుల గుంపులో భాగం. ఇప్పుడు వారు తమను జనసమూహానికి భిన్నంగా గుర్తించాలనుకున్నారు. వారు యేసును ముఖాముఖిగా కలవాలనుకున్నారు.

అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. (లూకా 8:20)

ప్రభువైన యేసు ఇచ్చిన జవాబు వినండి. మిగతా అన్ని గుంపు నుండి శిష్యుడిగా మారడానికి ఇది చాలా కీలకం. ప్రభువైన యేసుక్రీస్తుతో సంబంధంలో ఎదగడానికి మరియు నడవడానికి చాలా కీలకం.

అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. (లూకా 8:21)

దేవుని వాక్యాన్ని నిరంతరం వినడం మరియు దానిని మన అనుదిన జీవితానికి అన్వయించడం ద్వారా ఆచరణలో పెట్టడం వల్ల ప్రభువుతో నిజమైన మరియు సన్నిహిత సంబంధంలోకి వస్తుంది. ఇదే మిమ్మల్ని శిష్యునిగా చేస్తుంది.
Prayer
నేడు, దానియేలు ఉపవాసం యొక్క 5వ రోజు
[మీరు ఇంకా దీన్ని ప్రారంభించకపోతే లేదా దాని గురించి మరింత సమాచారం కావాలనుకుంటే, దయచేసి 26 & 27 ఆగస్టులోని అనుదిన మన్నాని చూడండి]

లేఖన పఠనము
కీర్తనలు 30:1-2
కీర్తనలు 107:20-21
యాకోబు 5:14-15

ఒప్పుకోలు
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. (గలతీయులు 2:20) నేను జయించిన వాడను. లోకంలో ఉన్నవానికంటే నాలో నివసించే దేవుని పరిశుద్ధాత్మ చాలా గొప్పవాడు. (1 యోహాను 4:4)

ప్రార్థన క్షిపణులు (అంశములు)
1. తండ్రీ, నీవు యెహోవా రాఫా నా స్వస్థ పరచినందుకు వందనాలు.
 
2. యేసు నామంలో మరియు యేసు రక్తం ద్వారా నా జీవితం మరియు కుటుంబంపై ఉన్న అనారోగ్యాలు మరియు వ్యాధుల పట్టును నేను నాశనం చేస్తున్నాను.

3. అనారోగ్యం నేను నీకు (పేరు లేదా పేర్లను పేర్కొనండి), యేసు నామముకు లోబడి మరియు యేసు నామంలో నా శరీరం నుండి శాశ్వతంగా వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తున్నాను.
 
4. నా ఆరోగ్యానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి అనారోగ్య ప్రతినిధిని యేసు నామంలో అదృశ్యం లేదా మాయమైపోవును అవును గాక.

5. యేసు నామంలో నా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి నా రక్తాన్ని యేసు రక్తంతో పాత్రాంతరము చేయబడును గాక.
 
6. ప్రభువా, స్వస్థపరచుటకు మరియు రక్షించుటకు నీ వాక్యము యొక్క శక్తిని నేను నమ్ముచున్నాను. ప్రభువా, ఇప్పుడు నన్ను స్వస్థపరచుటకు నీ సజీవ వాక్యమును పంపుము. నేను ఇప్పుడు యేసు నామంలో నా ఆత్మ మరియు శరీరంలోకి స్వస్థ పరిచే వాక్యాన్ని స్వీకరిస్తున్నాను.
 
7. ప్రభువా, నీవు నా బలహీనతలను మరియు నా రోగాలను భరించావు అని నీ వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి ప్రభువా, ఇప్పుడు క్రీస్తు యేసులో, యేసు నామంలో ఉన్న విమోచన ద్వారా నేను ప్రతి అనారోగ్యం మరియు వ్యాధి నుండి విముక్తి పొందానని ప్రకటిస్తున్నాను.

8. ప్రభువా, నేను క్రీస్తు పొందిన దెబ్బల చేత, నేను యేసు నామంలో ప్రతి అనారోగ్యాలు మరియు వ్యాధుల నుండి స్వస్థత పొందాను / బాగు చెందాను. అనారోగ్యం/వ్యాధి, యేసు నామంలో నా శరీరాన్ని వదిలి వెళ్ళిపో.

9. ప్రభువా, యేసు నామంలో, నా శరీరానికి (ప్రతి భాగానికి మరియు అంగంకు) స్వస్థత మరియు ఆరోగ్యం, నీ వాక్యము నాకు జీవమైయున్నదని నేను ప్రకటిస్తున్నాను.
 
10. ప్రభువా, యేసుక్రీస్తు నామమున నీ వాక్యం ప్రకారము నా శరీరంలో రోగము అనే ఆయుధము వర్ధిల్లదని నేను ప్రకటించుచున్నాను.
 
11. నా శరీరము దేవుని ఆలయము; అందువల్ల, యేసు నామములో అనారోగ్యం మరియు బలహీనత నీవు ఎక్కడ.

12. నేను బిగ్గరగా మరియు స్పష్టంగా ప్రకటిస్తున్నాను, మన ప్రభువైన యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత, నేను యేసు నామంలో స్వస్థత పొందాను.
 
13. ఓ దేవా, లేచి, నా ఆరోగ్యానికి గల శత్రువు యేసు నామంలో చెల్లాచెదురు అవును గాక.

14. దేవుని ఆరాధిస్తూ కొంత సమయం గడపండి.

Join our WhatsApp Channel


Most Read
● మీ విధిని మార్చండి
● యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం
● నీతియుక్తమైన కోపాన్ని స్వీకరించడం
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
● వాక్యం ద్వారా వెలుగు వస్తుంది
● జీవితం నుండి పాఠాలు- 3
● ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login