english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. బైబిలు వ్యాఖ్యానం
  3. అధ్యాయం 20
బైబిలు వ్యాఖ్యానం

అధ్యాయం 20

Book / 13 / 2193 chapter - 20
283
అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్య మొకటి నీ మీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. (2 దినవృత్తాంతములు 20:2) 

"యెహోషాపాతుకు తెలియజేసిరి" అని లేఖనాలు చెబుతున్నాయి. ఇది ఇహలోక స్వరం, ప్రభువు స్వరం కాదు. ఇది దుష్ట నివేదిక కావచ్చు. 

అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా (2 దినవృత్తాంతములు 20:3)

ఇహలోక యొక్క స్వరం ఎప్పుడూ భయాన్ని కలిగిస్తుంది. అయితే యెహోషాపాతు ప్రభువును వెదకడానికి సిద్ధమయ్యాడు. భయం మిమ్మల్ని నడిపించవలసి వస్తే, అప్పుడు ప్రభువును వెతకాలి. ఉపవాసముతో ప్రభువును వెదకండి. ఉపవాసంతో కలిపి ప్రార్థన గొప్ప ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. (2 దినవృత్తాంతములు 20:4)

యెహోషాపాతు ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఏకీకృతమైన (కలసి కట్టుగా) ఉపవాసం చేశాడు. మీరు మరియు మీ కుటుంబం ఏకీకృతమైన ఉపవాసం చేయాలి. ఇది ఏకీకృతమైన ఉపవాసం యొక్క ఉదాహరణ.
​
మీలో అయిదుగురు నూరు మందిని తరుముదురు; నూరు మంది పదివేలమందిని తరుముదురు; (లేవీయకాండము 26:8)

5 - 100, అంటే 1 వ్యక్తి 20 మందిని తరుముతాడు
100 - 10000, అంటే 1 వ్యక్తి 100ని తరుముతాడు
ప్రజలు కలిసి కట్టుగా ఉన్నప్పుడు శక్తి విపరీతంగా అధికమవుతుంది.

మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. (2 దినవృత్తాంతములు 20:12)

ఈ వచనం యెహోషాపాతు రాజు గొప్ప సమూహం వారిని చుట్టుముట్టినప్పుడు దేవునికి చేసిన ప్రార్థనలో ఒక భాగం.
ప్రార్థన వాస్తవికతను తిరస్కరించదు. ప్రార్థన వాస్తవికతకు మన కన్నులను మూసివేయదు లేదా దాని నుండి పారిపోయేలా చేయదు. నిజానికి, నిజమైన ప్రార్థనకు వాస్తవికతను మార్చే శక్తి ఉంది. ప్రతి క్రైస్తవుడు హృదయపూర్వక ప్రార్థనకు తనను తాను సమర్పించుకోవల్సిన కారణాలలో ఇది ఒకటి.

తమకు వ్యతిరేకంగా గుమిగూడిన గొప్ప సమూహానికి వ్యతిరేకంగా తమకు అధికారం లేదని యెహోషాపాతు రాజు అంగీకరించాడు. "పరిస్థితి పట్ల ఏమి చేయాలో వారికి ఖచ్చితంగా తెలియదు" అని కూడా అతడు అంగీకరించాడు.

జీవితంలోని ఒత్తిళ్లు మనల్ని అతలాకుతలం చేసే సందర్భాలు ఉంటాయి, అలాంటి సమయాల్లో మనం ఏమి చేయాలో అర్థంకాదు. మీరు చేయగలిగేది ఒకటి, మీ పూర్ణహృదయంతో దేవునికి ప్రార్థన చేయుడి. ప్రార్థన యొక్క సరళమైన నిర్వచనం ఏమిటంటే "నీ పూర్ణహృదయంతో దేవునికి ప్రార్థన చేయుట." ఆయనకు సమస్తము చెప్పండి.

మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను. (యాకోబు 5:13)

22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారిమీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.

23 అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. (2 దినవృత్తాంతములు 20:22-23)


కీర్తనలు 40:14లో, దావీదు ఇలా ప్రార్థించాడు: "నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక." బొత్తిగా భ్రమసియుందురు! ఆయన జనులు శత్రువులతో పోరాడటానికి దేవుని చేతిలో భ్రమసి చెందుట అనేది ఒక ఆయుధం.

యిర్మీయా ప్రవక్త కూడా ప్రార్థించాడు. అతడు ఇలా అన్నాడు, "అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్న డును మరువబడని నిత్యావమానము పొందుదురు.(యిర్మీయా 20:11). నిత్యావమానము! అది తీవ్రమైనది. ప్రభువు మీ కోసం పోరాడుతున్నప్పుడు మీ శత్రువు, మీరు కాదు, నిత్యావమానములో పడతాడు.

జెకర్యా 12:4 ఇలా సెలవిస్తుంది, "ఇదే యెహోవా వాక్కు, "ఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదా వారి మీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును." ఆ పద భ్రమత్వాన్ని మళ్లీ గమనించారా? తన శత్రువులతో పోరాడటానికి ఇది దేవుని ఆయుధాలలో ఒకటి.

ఈ సమయంలో, ప్రభువు మీ కోసం యుద్ధం చేస్తాడు మరియు మీరు సమాధానపరచబడుతారు. ఆయన మీ దృఢ నిశ్చయంగల శత్రువులను భ్రమలో పడవేస్తాడు మరియు వారికి ఏమి చేయాలో తెలియదు. మీరు యేసు నామంలో సంపూర్ణ విజయాన్ని పొందుతారు. స్తుతి ఆరాధన శత్రు బలగానికి కలవరాన్ని కలిగిస్తాయి.

నాల్గవ దినమున వారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. (2 దినవృత్తాంతములు 20:26)

బెరాకా ఒక లోయ అని గమనించండి, అయినా అది ఒక దీవెనకరంగా ఉంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవుడు పర్వతాలు మరియు లోయల దేవుడు.

Join our WhatsApp Channel

Chapters
  • అధ్యాయం 3
  • అధ్యాయం 4
  • అధ్యాయం 10
  • అధ్యాయం 11
  • అధ్యాయం 15
  • అధ్యాయం 16
  • అధ్యాయం 17
  • అధ్యాయం 19
  • అధ్యాయం 20
  • అధ్యాయం 21
  • అధ్యాయం 22
  • అధ్యాయం 23
మునుపటి
తరువాత
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్