దేవుని ఆత్మ అనేది పరిశుద్దాత్మ యొక్క బిరుదు
1. శక్తి
2. ప్రవచనం మరియు
3. మార్గదర్శకత్వం
పాత నిబంధనలో ఆత్మ యొక్క మొదటి బిరుదు దేవుని ఆత్మ. మనము మొదట ఆదికాండంలో ఈ పేరుతో దేవుని ఆత్మను గురించి నేర్చుకోబోతున్నాము.
ఆదియందు దేవుడు (సిద్ధంపాటు, ఏర్పాటు, రూపించాడు, మరియు) భూమ్యాకాశములను సృజించెను.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ (చలించుచుండెను, ఆలోచిస్తుండెను) జలములపైన అల్లాడుచుండెను. (ఆదికాండము 1:1-2)
ఈ వచనాల ప్రకారం, పరిశుద్ధాత్మ సృష్టిలో కూడా పలుభాగస్తులైన్నట్లు మనం చూడవచ్చు. లేఖనాల ప్రకారం, దేవుని ఆత్మ గొప్ప లోతైన (జలములపైన) అల్లాడుచుండెను. యాంప్లిఫైడ్ బైబిలు మనకు అల్లాడుచుండెను అనే పదానికి రెండు అర్థాలను ఇస్తుంది - చలించుచుండెను మరియు ఆలోచిస్తుండెను.
ఇది ఒక పక్షి గూడులో కూర్చొని, తన గుడ్లపై అల్లాడుచు, కొత్త జీవితాలను చూసుకునే ఆలోచనను స్పష్టంగా తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 32:11 లో "పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు" వివరించడానికి అదే పదం ఉపయోగించబడింది.
తరువాత, అదే దేవుని ఆత్మ సౌలుపైకి వచ్చి అతనిని ప్రవచించేలా చేసింది (1 సమూయేలు 10:10 చూడండి).
ఆ ఆత్మ జెకర్యా మీదకు వచ్చెను మరియు ప్రభువు వాక్యాన్ని ప్రకటించడానికి అతనికి వీలు కల్పించాడు (2 దినవృత్తాంతములు 24:20 చూడండి).
మరియు ఇశ్రాయేలు పునరుద్ధరణ గురించి యెహెజ్కేలు దర్శనం "దేవుని ఆత్మ ద్వారా" ఇవ్వబడింది (యెహెజ్కేలు 11:24).
రోమీయులకు 8:14లో లేఖనం ఇలా సెలవిస్తుంది: "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు."
దేవుని ఆత్మ లోకాన్ని సృష్టించింది. ఆయన ప్రవచన ఆత్మ. ఆయన శక్తి యొక్క ఆత్మ, మరియు ఆయన మార్గదర్శకత్వం యొక్క ఆత్మ. మీరు (మీ శరీరం) దేవుని ఆలయమై యున్నానదనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?(1 కొరింథీయులకు 3:16)
కాబట్టి, క్రైస్తవులుగా, మన శరీరాలు సజీవుడగు దేవుని ఆలయములు, విలువైనవి మరియు క్రీస్తుతో మన సాంగత్యానికి సాక్ష్యంగా ఇతరులు చూడడానికి మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
Bible Reading: Psalms 108-119

ఒప్పుకోలు
నా శరీరం పరిశుద్ధాత్మ యొక్క ఆలయము, మరియు దేవుని సంపూర్ణత్వం నాలో నివసిస్తుంది. నేను ఆయనదై యున్న నా శరీరం మరియు నా ఆత్మ ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● ప్రవచనాత్మకంగా అంత్య దినాలను విసంకేతనం చేయడం● ఆరాధనను జీవన విధానంగా మార్చుకోవడం
● 21 రోజుల ఉపవాసం: 3# వ రోజు
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - I
● చెడు వైఖరి నుండి విడుదల
● దేవుడు ప్రతిఫలము ఇచ్చువాడు
● పరిశీలనలో జ్ఞానం
కమెంట్లు